seven year jail
-
లైంగిక దాడి కేసులో దోషికి ఏడేళ్ల కారాగారం
న్యూఢిల్లీ : రెండున్నర ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిన్నారులు ‘జాతీయ సంపద’గా పేర్కొంటూ ఈ మేరకు శిక్ష విధించినట్లు అదనపు జడ్జి ఇల్లా రావత్ తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేపాల్‌కు చెందిన రాంసింగ్ఏడేళ్ల కారాగార శిక్షతోపాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ‘చిన్నారుల సంక్షేమం, సంరక్షణ ప్రతి నాగరిక సమాజం లక్షణం, అదే దేశ సంపదకు గీటురాయి , మొత్తం సమాజం క్షేమం, అదే అభివృద్ధి పెరుగుదలను సూచిస్తుంది’ అని జడ్జి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాధిత చిన్నారికి రూ. లక్ష నష్టపరిహారాన్ని అందజేయాలని ఢిల్లీ సామాజిక న్యాయ సేవా సంస్థను ఆయన ఆదేశించారు. జనవరి 2013న నిందితుడు బాలికపై అత్యంత పాశవికంగా తల్లిఎదుటనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి కోర్టు నివేదించారు.నేరం రుజువుకావడంతో దోషికి కోర్టు పై శిక్ష విధించింది. -
యువకుడికి ఏడేళ్ల కారాగారం
న్యూఢిల్లీ: భార్య మరణానికి కారకుడైన 26 ఏళ్ల యువకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. భార్యాభర్త మధ్య జరిగిన ఘర్షణ కారణంగా క్షణికావేశంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడింది. అడిషనల్ సెషన్స్ జడ్జి గౌతమ్ మానన్ ఈ మేరకు జైలు శిక్ష ఖరారు చేశారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన యువకుడు క్షణికావేశంలో నిందితుడు భార్యపై కి రోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఆమెను కాపాడడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుం డాపోయింది. ఈ ప్రమాదంలో 90శాతం కాలిన గాయాలకు గురైన ఆమె నెలరోజుల తర్వాత మృతి చెందింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట చట్టం ప్రకారం నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 10,000 జరిమానా విధించారు. ఈ సంఘటనలో నిం దితుడు పథకం ప్రకారం ఆమెను హత్య చేయలేదని, క్షణికావేశంలో జరిగిన ఘటనగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఎందుకంటే ఆమెపై కిరోసిన్ పోసిన నిందితుడు కాపాడేయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆమె గ్యాస్ స్టౌపై పడింది. ఈ క్రమంలో అతను కూడా మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జరిగిన నెలరోజులకు ఆమె మృతి చెందింది. అత్త కారణంగానే భర్త తనపై కిరోసిన్ పోసి మండుతున్న గ్యాస్ స్టౌపై నెట్టివేశాడని ఆమె మరణ వాంజ్మూలంలో పేర్కొంది. పోస్టుమార్టం నివేదికలో కూడా ‘అసహజ మరణంగా’నే తేలింది. ఈ కేసు విచారణలో నిందితుడు క్షణికావేశంలో ఆమె మృతికి కారకుడయ్యాడని పేర్కొంటూ ఈ మేరకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. వరకట్నం తక్కువగా ఇచ్చాననే కారణంతోనే భర్త, అత్త కలిసి తన కూతురుని హత్యచేశారని బాధితురాలి తండ్రి మార్చి 9, 2009 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పనిమనిషిపై అత్యాచారం: యువకుడికి ఏడేళ్ల జైలుశిక్ష
తాను పనిచేస్తున్న ఇంట్లోనే పనిమనిషిపై అత్యాచారం చేసినందుకు ఓ యువకుడికి ఢిల్లీ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. బీహార్‌లోని మధుబని ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే ఆ యువకుడికి కోర్టు 3 వేల రూపాయల జరిమానా కూడా వేసింది. ప్రమోద్ ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. అదే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న మహిళపై 2010 అక్టోబర్ నెలలో అత్యాచారం చేశాడు. అతడి నేరం నీచాతి నీచమని అదనపు సెషన్స్ జడ్జి కావేరీ బవేజా వ్యాఖ్యానించారు. అనంతరం అతడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే, ప్రమోద్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బాధితురాలికి అతడు తగినంత నష్టపరిహారం చెల్లించలేడు కాబట్టి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని అంశాల ప్రకారం తగిన పరిహారం బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నేరం జరిగిన తర్వాత విచారణ సమయంలో ప్రమోద్ తప్పించుకుని తిరగడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంటు కూడా జారీ చేశారు.