న్యూఢిల్లీ: భార్య మరణానికి కారకుడైన 26 ఏళ్ల యువకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. భార్యాభర్త మధ్య జరిగిన ఘర్షణ కారణంగా క్షణికావేశంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడింది. అడిషనల్ సెషన్స్ జడ్జి గౌతమ్ మానన్ ఈ మేరకు జైలు శిక్ష ఖరారు చేశారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన యువకుడు క్షణికావేశంలో నిందితుడు భార్యపై కి రోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఆమెను కాపాడడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుం డాపోయింది. ఈ ప్రమాదంలో 90శాతం కాలిన గాయాలకు గురైన ఆమె నెలరోజుల తర్వాత మృతి చెందింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట చట్టం ప్రకారం నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 10,000 జరిమానా విధించారు.
ఈ సంఘటనలో నిం దితుడు పథకం ప్రకారం ఆమెను హత్య చేయలేదని, క్షణికావేశంలో జరిగిన ఘటనగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఎందుకంటే ఆమెపై కిరోసిన్ పోసిన నిందితుడు కాపాడేయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆమె గ్యాస్ స్టౌపై పడింది. ఈ క్రమంలో అతను కూడా మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జరిగిన నెలరోజులకు ఆమె మృతి చెందింది. అత్త కారణంగానే భర్త తనపై కిరోసిన్ పోసి మండుతున్న గ్యాస్ స్టౌపై నెట్టివేశాడని ఆమె మరణ వాంజ్మూలంలో పేర్కొంది. పోస్టుమార్టం నివేదికలో కూడా ‘అసహజ మరణంగా’నే తేలింది. ఈ కేసు విచారణలో నిందితుడు క్షణికావేశంలో ఆమె మృతికి కారకుడయ్యాడని పేర్కొంటూ ఈ మేరకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. వరకట్నం తక్కువగా ఇచ్చాననే కారణంతోనే భర్త, అత్త కలిసి తన కూతురుని హత్యచేశారని బాధితురాలి తండ్రి మార్చి 9, 2009 పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యువకుడికి ఏడేళ్ల కారాగారం
Published Fri, Oct 17 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement