Seven year old
-
ఏడేళ్లకే పోలీసయ్యాడు!
బంజారాహిల్స్: ఈ చిట్టి పోలీసును చూశారుగా. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్‌తో ఏదో కేసు గురించి సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కదూ. ఇతడి పేరు మోహన్సాయి. వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ పోలీసయ్యాడు. తన చిరకాల కోరికను ఇలా తీర్చుకున్నాడు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దామా.. ఏపీలోని గుంటూరుకు చెందిన బ్రహ్మం, లక్ష్మి దంపతులకు ఏడేళ్ల కుమారుడు మోహన్సాయి ఉన్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు కేన్సర్ బారిన పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఏడాది కాలంగా కుమారుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందంటూ తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. మోహన్సాయి పరిస్థితి చూసి వారి మనసు చలించేది. కన్నీటి పర్యంతమయ్యేవారు. మోహన్సాయి కోరికను ఆస్పత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్సాయి అభిలాషను తీర్చేందుకు వారు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్ యూనిఫాంలో స్టేషన్లోకి అడుగుపెట్టిన మోహన్‌సాయికి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి స్టేషన్లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్లో కూర్చోబెట్టి ఠాణా పని తీరుపై ఆయన వివరించారు. -
'కీలక నరాలు తెగడం వల్లే అరవలేకపోయాడు'
న్యూఢిల్లీ : గుర్గావ్లో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసుకు సంబంధించి శవ పరీక్ష నివేదిక వెల్లడైంది. బాలుడి మెడమీద కత్తితో కోయడంతో పలు ముఖ్యమైన నరాలు తెగిపోయిన కారణంగా అతడు అరవలేకపోయాడని వైద్యులు తెలిపారు. మొత్తం రెండుసార్లు బాలుడి మెడను కత్తితో కోశారని, అందులో ఒక గాయం బాలుడి ముఖ్యమైన నరాలు తెంపేసిందని, దాంతో అతడు అరిచే ప్రయత్నం చేసినా అరవలేకపోయినట్లు వెల్లడించారు. విపరీతంగా రక్తస్రావం అవడంతోనే బాలుడు మృత్యువాతపడ్డాడని చెప్పారు. అయితే, బాలుడిపై లైంగిక దాడి జరగలేదన్నారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ఆ స్కూల్‌కు చెందిన బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో చంపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. మరోపక్క, తమ పిల్లలకు పూర్తి భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదో రోజు కూడా నేవీ ముంబయి పాఠశాలలో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రమంత్రులు మనేకా గాంధీ, ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఇందుకోసం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. -
మానవత్వం మరిచి.. ప్రేమతత్వం విడిచి
రామంతపురం: పిలుపులు వినిపిస్తాయేమోగానీ ఎదురు సమాధానం చెప్పలేడు. పోని ఎక్కడికైనా చకచకా కదులుదామంటే శరీరం సహకరించదు. చుట్టూ భయంభయంగా చూపులు. ఎవరైనా దగ్గరికొచ్చి పలుకరిస్తే మోముపై నవ్వులు. ఇది తమిళనాడులో తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఓ శారీరక మానసిక వికలాంగ బాలుడి హృదయవిధారక ఘటన. ఆ బాలుడిని కన్నవారే నడి రోడ్డున వదిలేశారు. పైగా అతడు మూగవాడు కూడా. రామంతపురంలోని ఎర్వాది దర్గా వద్దకు తీసుకొచ్చిన అతడి తల్లిదండ్రులు కాసేపట్లో వస్తామని చెప్పి వెళ్లిపోయారని దర్గా అధికారులు తెలిపారు. తర్వాత దర్గా అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి అతడి బ్యాగు తనిఖీ చేయగా మూడు జతల బట్టలు మాత్రం కనిపించాయి. వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా మూగవాడు కావడంతో కేవలం నవ్వడం, భయంగా చూడటం తప్ప ఏమి చేయలేకపోయాడు. దీంతో జిల్లాలోని చైల్ప్ లైన్ కు తరలించారు.