seventh rank
-
‘ఫిడే’ గ్రాండ్‌ప్రి టోర్నీ: హారికకు ఏడో స్థానం
లుసానే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను హారిక 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఏడు పాయింట్లతో నానా జాగ్‌నిద్జే (జార్జియా), గోర్యాచికినా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. -
డ్రాపౌటైనా.. ఏడో ర్యాంకు సాధించిన మహిళ..
ఒంగోలు: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మహిళా విభాగంగా జిల్లా స్థాయిలో ఆమె ఏడో ర్యాంకు కైవసం చేసుకుంది. అయితే.. ఏంటి అనే ప్రశ్న వెంటనే ఇక్కడ ఉత్పన్నం కావడం సహజం. కానీ ఆమె నేపథ్యం తెలిస్తే ఔరా.. అని మాత్రం అనిపించక మానదు. బాల్యంలో ఆమెది దీనగాధ. చదువుకోవాలనే జిజ్ఞాస మాత్రం ఉంది. తప్పని పరిస్థితుల్లో వివాహం.. ఆపై భర్త వెంకటరత్నం ప్రోత్సాహం..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాల కల్పన వెరసి ఆమె నేడు కష్టాల కొలిమి నుంచి బయట పడి ఒక స్థిరమైన జీవితాన్ని అందుకోగిలిగింది. ఆమే సంతనూతలపాడు మండలం ఎండ్లూరుకు చెందిన కోరుకొండ సుభాషిణి. పసిప్రాయంలో కన్నీటి కష్టాలు సుభాషిణి జీవితం ఆదిలో ముళ్లపాన్పే. 9వ తగరతి చదువుతుండగానే తండ్రి కన్నుమూశాడు. ఆర్థిక బాధలు ప్రారంభమయ్యాయి. ఇద్దరు అన్నయ్యలు ఒక వైపు చదువుకుంటుండగా ఆమె బాల కార్మికురాలిగా మారింది. ఇలా నాలుగేళ్లు గడిచాయి. ఆమెకు తన మేనమామ ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న కోరుకొండ రామారావు అండగా నిలిచాడు. చిన్నపిల్లను పనిలోకి పంపడం ఏమిటంటూ చదువుకోమన్నాడు. పెళ్లి చేయాలనుకుంటుంటే బడి అంటారేంటంటూ తల్లి ఒప్పుకోలేదు. అయినా ఒప్పించి నెల్లూరులోని డ్రాపౌట్స్ ఉండే సర్వీస్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ ఉండి చదువుకుంటూ సంతనూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రైవేటుగా పదో తరగతి పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఆ సమయంలోనూ పెళ్లి చేసుకోవాల్సిందే.. అంటూ తల్లి పట్టుబట్టింది. అప్పటికే తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం, తన కళ్ల ముందే పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో మెడలు వంచి తాళి కట్టించుకుంది. ఇక తన చదువుకు ఫుల్స్టాప్ పడినట్లే అని భావించింది. భర్త రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది భర్త బంధువే కావడంతో చదువుకోవాలన్న తన ఆసక్తిని అతడి ఎదుట బయట పెట్టింది. ఆయన ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండంతో సరే అన్నాడు. బీఏ డిగ్రీతో పాటు బీఎల్ఐసీలో కరస్పాండెన్స్ కోర్సు పూర్తి చేసింది. అంతటితో ఆగలేదు. ఎంఏ సోషియాలజీతో పాటు ఎంఎల్ఐసీ, ఆపై బీఈడీ కూడా సుభాషిణి పూర్తి చేసింది. సాధారణంగా వివాహమైన తర్వాత చదువు అంటేనే చాలామంది వెనుకాడే పరిస్థితి. అటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె రెండు డిగ్రీలు, రెండు పీజీలు, బీఈడీ కోర్సు పూర్తి చేయడం వెనుక ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిస్ఫూర్తితో ముందుకు సుభాషిణీ డిగ్రీలు పూర్తి చేస్తున్నా ఎక్కడో అసంతృప్తి. చదువు కోవడం వరకు ఒకే. కానీ ఉద్యోగం సంగతి ఏంటి. రెండు సార్లు గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలు రాసింది. కానీ ఒకదాంట్లో రెండు మార్కులు, మరోదాంట్లో నాలుగున్నర మార్కుల తేడాతో అవకాశాన్ని కోల్పోయింది. ఈ సమయంలోనే గతేడాది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ/వార్డు సచివాలయాలకు నోటిఫికేషన్ విడదల చేసిన సంగతి విదితమే. ఈ సారి ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. తమ మండంలోనే చండ్రపాలెం పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్–3కి మళ్లీ రాసింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా జిల్లాస్థాయిలో మహిళా విభాగంలో ఏడో ర్యాంకు కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాల కల్పన ద్వారా తనకు ఆర్థిక భరోసా లభించిందని, అదే తాను గ్రూప్–3కి ఎంపిక అయ్యేందుకు తోడ్పడిందని పేర్కొంటోంది. త్వరలోనే గ్రూప్–2ను సైతం సొంతం చేసుకుంటానని ధీమాగా చెబుతోంది. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. కానీ తన విజయం వెనుక తన భర్తే ఉన్నారు అంటూ సగర్వంగా చెబుతున్న ఈ జంట నేటి తరానికి ఆదర్శం అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. -
కసిపెంచిన కష్టాలు
♦ అడ్డా కూలీ బిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంకు ♦ పేదింట విరిసిన కుసుమం...మౌనిక ♦ పట్టుదలే పునాదిగా రాణింపు ♦ కష్టాలు వెంటాడుతున్నా అద్వితీయ ప్రతిభ ♦ ఇంటర్లో 987(ఎంపీసీ) మార్కులతో.. ♦ రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు కైవసం గజ్వేల్/కొండపాక: తండ్రి ఓ అడ్డా కూలీ... తల్లి బీడీ కార్మికురాలు... కేవలం రెండెకరాల మెట్ట పొలం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. ఇవన్నీ ఆ విద్యార్థి లక్ష్యానికి అవరోధంగా మారలేదు. తనను ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే తల్లిదండ్రుల ఆశను తీర్చడానికి నిరంతరం శ్రమించింది. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ సెలవులు వచ్చినప్పుడల్లా కూలీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. కసిగా చదివి తాజాగా శుక్రవారం విడుదలైన ఇంటర్(ఎంపీసీ) 987/1000మార్కులతో రికార్డు సృష్టించింది. కష్టాలే తనలో విజయకాంక్షను రగిల్చాయని ఆ విద్యార్థిని చెబుతోంది. ఈ సందర్భంగా శనివారం ‘సాక్షి’తో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఆ వివరాలు..కొండపాక మండలం ధమ్మక్కపల్లి గ్రామానికి కూరాటి నర్సింలు. యాదమ్మకు మౌనిక(17), జ్యోతి(14), ప్రసాద్(13), మధు(9)లు సంతానం. నర్సింలు రెండెకరాల ఆసామి. వరుసగా నాలుగు బోరుబావులు వేసినా అవి ఫెయిల్ కావడంతో ఆశలు చాలించుకొని..ఆ భూమిలో ఏటా పత్తి, మొక్కజొన్న లాంటి మెట్టపంటలు సాగు చేసుకుంటున్నాడు. మూడేళ్లుగా కాలం కలిసి రాక వ్యవసాయంపై ఆశలు చాలించుకొని...అడ్డా కూలీగా స్థిరపడ్డాడు. గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద పనికెళ్తున్నాడు. గ్రామం చుట్టు పక్కల.. లేదంటే సిద్దిపేటకు పనికి వెళ్తుంటాడు. పనికి వెళ్లనిదే పూట గడిచే పరిస్థితి లేదు. నిత్యం పని వెతుక్కుంటాడు. యాదమ్మ బీడీలు చుడుతుంది. మౌనిక కొండపాకలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతోంది. ఇంటర్ చదువుతున్న మౌనికకు పేదరికం ఏనాడూ అవరోధంగా మారలేదు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి మాత్రం మౌనిక చలించిపోయింది. నిత్యం విజయకాంక్షతో రగిలిపోయింది. ఇంటర్ ఎలాగైనా రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా శ్రమించింది. తల్లిదండ్రులకు తోడూ అధ్యాపకుల ప్రోత్సాహం లభించడంతో లక్ష్యాన్ని సాధించడానికి బాటలు వేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 987/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకును సాధించి అందరినీ అబ్బురపరిచింది. ఐఏఎస్ కావడమే లక్ష్యం చిన్నప్పటి నుంచి కష్టాల్లో పుట్టిపెరిగాను. నేను బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్లికిక కష్టాలుండొద్దు. ఐఏఎస్ సాధించాలనేదే నా జీవిత లక్ష్యం. పాఠశాలలో నన్ను మ్యాథ్స్ లెక్చరర్ అక్బర్ సార్, ప్రిన్సిపాల్ జ్యూటికా వన్నీసా మేడమ్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి సహకారం జీవితంతో మరిచిపోలేను. చురుకైన విద్యార్థిని మా విద్యా సంస్థలో మౌనిక చాలా చురుకైన అమ్మాయి. ఇలాంటి విద్యార్థిని మా విద్యాసంస్థలో ఉన్నందుకు సంతోషించేవాళ్లం. పాఠాలు శ్రద్ధగా వినేది. చదువులో ఎప్పుడూ ముందుండేది. - జ్యూటికావన్నీసా, ప్రిన్సిపాల్ ఏకసంతాగ్రహి మౌనిక లాంటి విద్యార్థినులు చాలా అరుదు. ఏ విషయం చెప్పినా బాగా గుర్తు పెట్టుకునేది. ప్రతి పరీక్షలోనూ మొదటి స్థానం సాధించేది. ఎన్ని ఇబ్బందులున్నా బాధపడేది కాదు. దిగమింగుతూ లక్ష్యాన్ని సాధించింది. ఈ అమ్మాయి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. - షేక్ అక్బర్, మ్యాథ్స లెక్చరర్ కష్టాలను లెక్కచేయ.. నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలున్నాయని చదవడం ఆపేయలేదు. మేము ఉపాసముంటే తనూ ఉపాసముంది. మాతోపాటు ఎన్నో సార్లు కూలీ పనులకు వచ్చింది. మా కష్టంలో పాలు పంచుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా బిడ్డ చదువు ఆపేయ. ఆమెను కలెక్టర్‌ను చేస్తానని మాట ఇచ్చిన. దీనికి ఎంతైనా కష్టపడుతా. నా బిడ్డకోసం కష్టపడడంలో ఎంతో ఆనందముంది. - మౌనిక తండ్రి కూరాటి నర్సింలు