several areas
-
అంతటా వర్షం
- 62 మండలాల్లో 13.1 మి.మీ సగటు నమోదు - పరిగి, సోమందేపల్లిలో భారీ వర్షం అనంతపురం అగ్రికల్చర్: వరుణుడి కాస్త కరుణించాడు. మూడు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 62 మండలాల పరిధిలో 13.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్ మొదటి వారంలో ఈ స్థాయి సగటు నమోదు కాగా, ఇది రెండోది కావడం విశేషం. పరిగిలో 65.4 మి.మీ, సోమందేపల్లి 60.4 మి.మీ భారీ వర్షం కురిసింది. పెనుకొండ 39.1, హిందూపురం 35.8, లేపాక్షి 35.6, రొద్దం 33.6, మడకశిర 31.4, అగళి 30.4, తాడిపత్రి 29.2, రొళ్ల 27.9, బెళుగుప్ప 26, కళ్యాణదుర్గం 23.8, నార్పల 22.9, యల్లనూరు 22.3, శింగనమల 19.9, గుడిబండ 19, తలుపుల 17.4, ఉరవకొండ 16.9, కూడేరు 16.6, పెద్దపప్పూరు 14.7, కనగానపల్లి 14.2, బ్రహ్మసముద్రం 14.1, ఆత్మకూరు 14.1, పుట్లూరు 13.1, కుందుర్పి 10.5 మి.మీ వర్షం కురిసింది. మరో 15 మండలాల్లో తేలికపాటి వర్షం కురవగా, 11 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. 10 మండలాల్లో తుంపర్లు పడగా ఎన్పీ కుంట మండలంలో వర్షపాతం నమోదు కాలేదు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 34.7 మి.మీ నమోదైంది. వర్షసూచన రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు 10 నుంచి 24 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 34 నుంచి 36 డిగ్రీలు, కనిష్టం 22 నుంచి 23 డిగ్రీలు నమోదు కావచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 85 నుంచి 90, మధ్యాహ్నం 62 నుంచి 64 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
పలు ప్రాంతాల్లో గాలివాన
అనంతపురం అగ్రికల్చర్ : సోమవారం సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపటిగా మారిన ‘అనంత’లో సాయంత్రం వేళ కాస్త వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులతో పాటు గాలి వీయడంతో కాస్త చల్లదనం సంతరించుకుంది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనం గాలుల వల్ల కాస్త ఉపశమనం పొందారు. శింగనమల, పుట్లూరులో 15 మి.మీ, నల్లమాడ, కనగానపల్లి, తలుపుల, తాడిపత్రి 10 మి.మీ, బుక్కపట్నం, కదిరి 8 మి.మీ మేర వర్షం పడింది. ఓడీ చెరువు, ముదిగుబ్బ, పుట్టపర్తి, రామగిరి, చెన్నేకొత్తపల్లి, గుడిబండ, యాడికి, గార్లదిన్నె, పామిడి, అనంతపురం, బుక్కరాయసముద్రం తదితర మండలాల పరిధిలో చిరుజల్లులు పడ్డాయి. వర్షపాతం నమోదైనా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఈనెలతో పాటు మే నెలలో కూడా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేలకొరిగిన అరటి తోటలు యల్లనూరు : యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి, కొండవండ్లపల్లి, బుక్కాపురం గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన గాలివానకు 30 ఎకరాల వరకు అరటి తోటలు నేలకొరిగాయి. తిమ్మంపల్లిలోని తోటల్లోని విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. అకాల వర్షంతో అరటి తోటలు దెబ్బతినడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, పాతబస్తీ, ఉప్పల్, మలక్‌పేట, ఎల్బీ నగర్, సంతోష్‌నగర్ లలో భారీ వర్షాలు కురిశాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మదీనాగూడ, చందానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో ఎక్కిడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లు పొంగి, వాటి నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. దీంతో నడక కూడా కనాకష్టంగా మారిపోయింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
అకాల వర్షాలతో పడిపోయిన ఉష్ణోగ్రతలు!
-
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురవడం ప్రారంభమైంది. సిటీలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌తో ఉదయం 6.30 కి మొదలైన వర్షం 8.00 గంటలకు బంజారాహిల్స్ దాకా విస్తిరించింది. ఆదివారం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వానలు కురిశాయి. వరణుడి దెబ్బకు జిల్లాలో మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. రాయలసీమ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా రాయపూర్ వరకు ఉపరితల వర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వారు చెప్పారు. శనివారం రాయలసీమలో సగటు ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదయ్యాయి. -
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌తో ఉదయం 6.30 కి మొదలైన వర్షం 8.00 గంటలకు బంజారాహిల్స్ దాకా విస్తిరించింది. అంతేకాకుండా ఉత్తర కర్ణాటక నుంచి లక్షద్వీప్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా రాయలసీమ, తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాలు కదులుతాయని తెలిపారు. అందుచేత అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వారు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. శనివారం నుంచి రాయలసీమ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని సమాచారం. -
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం