హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, పాతబస్తీ, ఉప్పల్, మలక్పేట, ఎల్బీ నగర్, సంతోష్నగర్ లలో భారీ వర్షాలు కురిశాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మదీనాగూడ, చందానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో ఎక్కిడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి.
పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లు పొంగి, వాటి నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. దీంతో నడక కూడా కనాకష్టంగా మారిపోయింది.