ఎక్సైజ్ దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లాలో సారా తయారీ, అమ్మకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కర రావు స్పష్టం చేశారు. మంగళవారం పోలవరం, కొవ్వూరు, చింతలపూడి, జ ంగారెడ్డిగూడెం, నరసాపురం ఎకై్సజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా విక్రేతలపై రెండు కేసులు నమోదు చేసి 10లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీ మాట్లాడుతూ జిల్లాలో సారా అమ్మకాలను పూర్తిగా నిరోధించేందుకు నిత్యం దాడులు చేస్తున్నామని చెప్పారు. సారా అమ్మకాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.