శబరిపీఠంలో ‘హరితహారం’
నారాయణపేట రూరల్ : పట్టణ శివారులోని వల్లంపల్లిరోడ్డులో గల శబరి పీఠంలో గురువారం అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాకర్ల భీమయ్య అయ్యప్పస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి అర్చకుల వేధ మంత్రోచ్ఛరణాల మధ్య రావి, జమ్మి, మర్రి, వేప మొక్కలు నాటి పుష్కరాల నుంచి తెచ్చిన నీటిని పోశారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పోషల్నారాయణ, ఓంప్రకాష్, సంజీవ్, రఘు, నగేష్, వెంకటేష్, మల్లేష్, పాల్గొన్నారు.