Shali Gouraram Mandal
-
తెగని పంచాయితీ.. అత్తవారింటికి వచ్చిన అల్లుడు.. ఇదే అదనుగా..
శాలిగౌరారం (నల్గొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ మామిడికాయల జయమ్మ కుమార్తె సారికను నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(35)కు ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేయగా, కిరణ్ ఎమ్మార్పీఎస్ ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో రోజురోజుకూ పోషణ ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం మానేసిన సారిక ఆరు నెలల క్రితం కుమారుడు, కుమార్తెను వెంటపెట్టుకొని చిత్తలూరులోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. కానీ భార్యభర్తల మధ్య బేదాభిప్రాయాలు తగ్గకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా భర్తపై పోలీసులకు ఫిర్యాదు ఈనేపథ్యంలో భర్త కాపురానికి తీసుకుపోవడంలేదని 20రోజుల క్రితం సారిక శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పోలీసులు భార్యాభర్తలకు కలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అక్కడనుంచి కిరణ్ హైదరాబాద్‌కు పోగా, సారిక చిత్తలూరులో ఉంటోంది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కిరణ్ చిత్తలూరు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కిరణ్ మద్యం ఇంటికి తెప్పించుకొని తాగాడు. భోజనం తర్వాతా ఆర్థికపరమైన విషయాలతో దంపతుల మధ్య వాదనలు జరిగాయి. కొంతసమయం తర్వాత కిరణ్ ఇంట్లో నేలపై నిద్రించాడు. ఇదే అదునుగా భావించిన సారిక రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న కిరణ్ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సారిక అక్కడనుంచి బయటకు వెళ్లి వంగమర్తిమీదుగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయింది. దీంతో అర్వపల్లి పోలీసులు సంఘటన గురించి శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిత్తలూరుకు చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవరావు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం తరలింపు అడ్డగింత మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. నిందితులను గుర్తించి కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ సారికతో పాటు మరో నలుగురి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. హత్యలో ఐదుగురి పాత్ర? మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు హతుడి కుటింబికులు ఆరోపిస్తున్నారు. వారిలో సారికతో పాటూ చిత్తలూరుకు చెందిన ఆమె అక్క బండారు నాగమ్మ, ఆమె కుమారుడు బండారు శివప్రసాద్, యాదాద్రి భువనగిరిజిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవికి చెందిన ఓ వ్యక్తి, నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
అందరు ఉన్నా..తాగేందుకు నీళ్లు పోయలేదు...
శాలిగౌరారం (తుంగతుర్తి) : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కొడుకులు..తొలిదైవంగా భావిస్తారు. ఆ తల్లిని..ఈలోకం విడిచే వరకు ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన వారు కనీస మానవ విలువలను మరిచి తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండికూడా పెట్టకుండా మాడుస్తూ ఇంటినుండి బయటకు తరిమేశారు. ఈ హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మాధారంకలాన్ గ్రామానికి చెందిన తీగల యాదమ్మ(80)కు ప్రస్తుతం వివాహితులైన ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యాదమ్మ భర్త వెంకయ్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. దీంతో యాదమ్మ తన ఇద్దరు కొడుకుల వద్దనే ఉంటూ జీవించింది. అన్నదమ్ముల మధ్య తల్లి పోషణ విషయంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యాదమ్మకు రెండవ కుమారుడి ఇంటిఆవరణలో ప్రత్యేకంగా ఒక రేకులగదిని నిర్మించారు. కానీ కోతుల వీరంగాలతో ఆ గది రేకులు మొత్తం ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా పెద్దకుమారుడు కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు మాత్రం గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి నిర్మించిన గదికి తిరిగి పైకప్పు వేసేందుకు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడంతో పట్టించుకోలేదు. ఆమె పైకప్పులేని ఇంట్లో ఉండలేక పలుమార్లు గ్రామపెద్దలను, చివరకు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. గ్రామపెద్దల మాటలను కూడా తన కుమారులు పట్టించుకోకపోవడంతో మూడేళ్ల క్రితం ఇళ్లు వదిలి వెళ్లింది. అప్పటినుంచి రెండు సంవత్సరాలు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయం వద్ద ఉంటూ యాచకవృత్తిపై ఆధారపడి జీవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అక్కడివారు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యాదమ్మ కుమార్తెలు తమవద్దనే ఉండేందుకు రమ్మని తల్లిని కోరారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఐదు నెలల క్రితం యాదమ్మ నకిరేకల్ వచ్చి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆసరా పింఛన్ సాయంతో జీవించింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా మర్రూరుకు చెందిన ఆమె రెండవ కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లి సాకుతోంది. విషయం తెలుసుకున్న యాదమ్మ పెద్ద కుమారుడు దశరథ తన చెల్లెలుకు పలుమార్లు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. దీంతో యాదమ్మ ముగ్గురు కుమార్తెలు శుక్రవారం తమ తల్లిని తీసుకొని మాధారంకలాన్ వచ్చారు. తల్లిని అన్నల ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా వారు తమ ఇంట్లోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదేమీలేక పెద్దకుమారుడు దశరథ ఇంటిముందు ఉన్న కానుగుచెట్టకింద తల్లిని వదిలి వెళ్లిపోయారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచానికి పరిమితమైన ఆ వృద్ధతల్లి శుక్రవారం నుంచి వీధిలోని చెట్టుకిందనే జీవచ్ఛవంలా పడిఉంది. చుట్టుపక్కలవారు వృద్ధురాలు పడే నరకయాతనను చూడలేక మంచీళ్లు ఇవ్వడంతోపాటు బుక్కెడన్నం పెట్టి ప్రాణం కాపాడారు. కానీ ఆమె కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం శోచనీయం. -
ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి..
-
ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి..
శాలిగౌరారం(నల్లగొండ): సెల్ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే ప్రమాదం కూడా పొంచివుందనే సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో సెల్‌ఫోన్ పేలి ఓ విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన యాషబోయిన మల్లేశ్(16) ఇటీవలే పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం గ్రామ శివారులోని నిమ్మతోటకు నీళ్లు కట్టేందుకు తన చెల్లెలుతో కలిసి వెళ్లాడు. వాతావరంణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుండటంతో.. ఇంటి వద్ద ఉన్న తండ్రి కొడుకుకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తోట సమీపంలో పిడుగు పడటంతో.. మల్లేశ్ మాట్లాడుతున్న ఫోన్ పేలింది. దీంతో మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందగా అతని చెల్లెలు శిరీష(15)తో పాటు మధు(15) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు అచేతనంగా పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించి కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.