shankar narayan
-
'టెన్త్ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించలేం'
సాక్షి, అమరావతి : లాక్డౌన్ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు ఇప్పుడు నిర్వహించలేమంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెన్త్ పరీక్షలు ముగిసేవరకు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల బోధన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారన్నారు. ఇందుకోసం విద్యామృతం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి ఉదయం 10 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సప్తగిరి చానెల్ ద్వారా పాఠాలు ప్రసారం అవుతాయని తెలిపారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సురేశ్ వెల్లడించారు. కాగా ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి టీచర్ల ఎంపిక చేస్తున్నామని, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉత్సాహం ఉన్న టీచర్స్ ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పొడిగింపుపై తీసుకున్న నిర్ణయం తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం పకడ్బందీ చర్యలు అవసరమన్నారు. ప్రధాని మోదీ తెలిపినట్లుగా ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షల సడలింపులో రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారని శంకర్ నారాయణ వెల్లడించారు. -
విద్యావంతులైతేనే రాణింపు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ లేపాక్షి : సమాజంలో కురుబలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలంటే మొదట విద్యావంతులుగా ఎదగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం అన్నారు. లేపాక్షి మండలం కల్లూరులో కురుబ సేవా సంఘం ఆధ్యర్వంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కనకదాసు జయంతి సభలో వారు మాట్లాడారు. కురుబలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఇంతరవకు మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. కురుబలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కల్లూరు బస్టాండు వరకు కురుబలు ర్యాలీ నిర్వహించి శిలాఫలకం ప్రారంభించారు. తాలుకా కురుబ సంఘం అధ్యక్షుడు జగదీష్, స్థానిక కురుబ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కుళ్లాయప్ప, బిసలమానేపల్లి సర్పంచ్ మాళక్క పాల్గొన్నారు. -
27న కరువుపై వైఎస్సార్ సీపీ ధర్నా
- హాజరుకానున్న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి - జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి రైతాంగం తరపున జిల్లా కేంద్రంలో ఈనెల 27న భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కొండాపురం గ్రామంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా కరువు బారిన పడిందని, మునుపెన్నడూ లేని విధంగా కరువు కరాళ నత్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభంలో కరువు పారద్రోలడానికి జిల్లా రైతాంగానికి ప్రాణాధారమైన వేరుశనగను కాపాడడానికి రెయిన్ గన్లతో రక్షక తడులు అందించి పంటను కాపాడుతామని మీడియా ద్వారా మభ్యపెట్టిందన్నారు. వర్షాభావం ఏర్పడిన సందర్భంలో జిల్లా మంత్రులు కాని ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని కరువును పూర్తీగా పట్టించుకోకుండా గాలికొదిలేసారన్నారు. వాస్తవ పరిస్థితులను గుడ్డి ప్రభుత్వానికి తెలియజేయడానికి 27న పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ధర్నా చేపడతామన్నారు. ఈ ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరై ధర్నాలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. జిల్లా రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాకు తరలిరావాలని శంకరనారాయణ కోరారు. నాయకులు కన్వీనర్ ఫక్రోద్దిన్, సుదర్శనశర్మ, గంపల వెంకటరమణారెడ్డి, ధనుంజయరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. -
గవర్నర్ పదవికి శంకర్నారాయణ్ రాజీనామా