27న కరువుపై వైఎస్సార్‌ సీపీ ధర్నా | ysrcp strikes on 27th on drought | Sakshi
Sakshi News home page

27న కరువుపై వైఎస్సార్‌ సీపీ ధర్నా

Published Wed, Sep 21 2016 5:40 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

27న కరువుపై వైఎస్సార్‌ సీపీ ధర్నా - Sakshi

27న కరువుపై వైఎస్సార్‌ సీపీ ధర్నా

- హాజరుకానున్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
- జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ


పెనుకొండ: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి  రైతాంగం తరపున జిల్లా కేంద్రంలో  ఈనెల 27న భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల  మండలం కొండాపురం గ్రామంలో ఆయన మంగళవారం  విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా కరువు బారిన పడిందని, మునుపెన్నడూ లేని విధంగా  కరువు కరాళ నత్యం చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ ప్రారంభంలో కరువు పారద్రోలడానికి జిల్లా రైతాంగానికి ప్రాణాధారమైన వేరుశనగను కాపాడడానికి రెయిన్‌ గన్‌లతో రక్షక తడులు అందించి పంటను కాపాడుతామని మీడియా ద్వారా  మభ్యపెట్టిందన్నారు. వర్షాభావం ఏర్పడిన సందర్భంలో జిల్లా మంత్రులు కాని ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని కరువును పూర్తీగా పట్టించుకోకుండా గాలికొదిలేసారన్నారు. వాస్తవ పరిస్థితులను గుడ్డి ప్రభుత్వానికి తెలియజేయడానికి 27న పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ధర్నా చేపడతామన్నారు.

ఈ ధర్నాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడు  వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరై  ధర్నాలో  ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. జిల్లా రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాకు తరలిరావాలని శంకరనారాయణ కోరారు.  నాయకులు కన్వీనర్‌ ఫక్రోద్దిన్,  సుదర్శనశర్మ, గంపల వెంకటరమణారెడ్డి, ధనుంజయరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement