shankara narayana
-
ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా!
పెనుకొండ: రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ నిలదీశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్’ పేరిట హిందూపురంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాతే ఈ ప్రాంత ప్రాజెక్టులపై వారికి శ్రద్ధ పుట్టుకొచ్చిందని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టులను పూర్తిగా అశ్రద్ధ చేశారన్నారు. చంద్రబాబు హంద్రీ–నీవాను తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారని, కానీ వైఎస్సార్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ కల్పతరువుగా మార్చారని వివరించారు. 1995 నుంచి 2004 వరకు హంద్రీ–నీవాపై టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.9 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ కష్టాలు తెలిసిన వ్యక్తిగా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.6,500 కోట్లతో హంద్రీ–నీవాకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన అరకొర పనులను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేదని, పైగా 200 శాతం అధికంగా అంచనాలు పెంచుకుని బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా టీడీపీ నేతలు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథిలకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టొద్దు రాయలసీమకు సాగునీటిని అధికంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. నీళ్లన్నీ సీమకే తీసుకెళ్తున్నారంటూ ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో మాట్లాడించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంత రైతుల పట్ల వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ద్వంద్వ వైఖరి మానుకునేలా చంద్రబాబును నిలదీయాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరిన్ని కృష్ణా జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేశామని తెలిపారు. గండికోట రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యంతో నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను, కుట్రపూరిత సదస్సులను మానుకుని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. -
పాఠశాల సిబ్బందిపై మంత్రి తీవ్ర ఆగ్రహం
సాక్షి, కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలోని మహత్మా జ్యోతిబాపూలే బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రికార్డులను పరిశీలించి విద్యార్థుల తరగతి గదులను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఆయన అడిగిన పాఠ్యాంశాలలోని ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పలేక పోయారు. అదేవిధంగా తెలుగు సంధులు ఎన్ని అని అడిగిన ప్రశ్నకు గెస్ట్ ఫ్యాకల్టీ కూడా సమాధానం చెప్పలేక పోవడంతో మంత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వసతి గృహాలు, విద్యాసంస్థల్లో విద్యా విధానాల అమలును తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. గడిచిన ఐదేళ్లలో శాశ్వత ఉపాధ్యాయులు లేకపోవడంతో వసతి గృహాల పాఠశాలలు గాడి తప్పాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అణగారిన వర్గాల పిల్లలు నష్టపోయారని, విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేసిందని మండిపడ్డారు. అదే విధంగా.. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు రెసిడెన్షియల్ స్కూల్స్‌ను గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం మనబడి నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. నూతన విద్యాసంవత్సరంలో 1నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం విద్యను తీసుకురానున్నామన్నారు. పేద ప్రజానీకానికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు వసతుల కల్పన, నిర్వహణలో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి పేద విద్యార్థులకు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి పేదింటి విద్యార్థికి విద్య అందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని మంత్రి వెల్లడించారు. -
మీ కుటుంబాలకు పెద్దకొడుకునవుతా
రొద్దం: పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద ఆగస్టు 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పెద్దకొడుకులా అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రొద్దం మండలం ఎల్.తిమ్మాపురం, లక్సాపల్లి గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది కుటుంబాలను శంకరనారాయణ, ఆయన తమ్ముళ్లు మల్లికార్జున, రవీంద్రలు శనివారం పరామర్శించారు. మృతులు రవీంద్రారెడ్డి భార్య భారతమ్మ, భీమయ్య భార్య భీమక్క, బెజవాడ గోపాల్‌రెడ్డి భార్య లక్ష్మమ్మ,, కురుబ నారాయణయప్ప భార్య నాగరత్నమ్మ, కురుబ వెంకటప్ప భార్య అశ్వర్థమ్మ, కురుబ రామాంజినప్ప భార్య రామాంజినమ్మ, కురుబ వెంకటస్వామి భార్య దేవమ్మ, వడ్డి ఆంజనేయులు భార్య అలివేలమ్మ, దాసరి అంజి భార్య కళావతి తదితర కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. రోడ్డు ప్రమాదం కలచివేస్తోంది డ్రైవర్ తప్పిదం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందడం తనను కలచివేస్తోందని శంకరనారాయణ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన రోజే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకునే విషయమై చర్చించామన్నారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. వ్యక్తిగతంగాను, పార్టీపరంగాను ఆదుకునేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తీరుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రొద్దం మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు, రాజారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, పెనుకొండ, గోరంట్ల మండలాల కన్వీనర్లు ఫక్రోద్ధీన్, శ్రీకాంత్‌రెడ్డి, తయాబ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగాధర్, నాగలూరు బాబు, సుధాకర్‌రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, న్యాయవాది భాస్కర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కొడల రాయుడు, ప్రసాద్ పాల్గొన్నారు. -
జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని వన్శికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం శంకరనారాయణ అధ్యక్షతన నవరత్నాల సభ జరిగింది. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వృద్ధులు, రైతులు, వితంతువులు అన్ని వర్గాల ప్రజలు జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇసుక, పట్టిసీమ, ఇతర సంక్షేమ పథకాల్లో దోపిడీకి పాల్పడుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని, నవరత్నాలను గడప గడపకూ తీసుకెళ్లాలన్నారు.