గోవధను నిషేధించాలని డిమాండ్
లక్నో: దేశవ్యాప్తంగా గోవధను నిషేధించి ఆవులను రక్షించాలని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హిందూ మతానికి చెందిన ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఇదే గోవులను రక్షించడానికి సరైన సమయం అని శంకరాచార్యులు అన్నారు.
అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో గోవధ నిషేధాన్ని విమర్శించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివేదికను కూడా ఆయన తోసి పుచ్చారు. భారతీయ జనతా పార్టీ, ఇతర హిందూ ఆర్గనైజేషన్లు 'ఘర్ వాపసి' కార్యక్రమానలు నిర్వహిస్తున్నాయి. వాటితో పాటు గోవధ నిషేధాన్ని కూడా ప్రారంభిస్తే బాగుంటుందని శంకరాచార్యులు పేర్కొన్నారు.