నెలకు వేల కోట్లలో నష్టం
• పన్నుల్లో కోత.. పెద్ద నోట్ల రద్దుపై సీఎం ఆందోళన
• గవర్నర్‌తో సుదీర్ఘ భేటీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు చెల్లించే నిధుల్లో కోత పెట్టడం, పెద్ద నోట్లను రద్దు చేయడంతో చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదముందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు, పెద్ద నోట్ల రద్దు ప్రభావంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నెలకు రూ.1,000 కోట్లనుంచి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడుతుందని సీఎం నివేదించినట్లు తెలిసింది. అంతమేరకు కేంద్ర ప్రభుత్వ నష్ట పరిహారం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని, కేంద్రం ఎలాంటి మినహారుుంపులు, సవరణలు ఇస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
పన్నుల వాటాలో 42 శాతం కోత
ఎన్నడూ లేనివిధంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్రం బాగా తగ్గించింది. దీంతో తెలంగాణకు జరిగే అన్యాయం, వాటిల్లే నష్టాలను గణాంకాలతో సహా గవర్నర్‌కు సీఎం వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏడాదికి రూ.13,995 కోట్లు పన్నుల వాటా కింద రావాలి. ప్రతి నెలా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలు నెలకు రూ.997 కోట్ల చొప్పున విడుదల చేసింది. కానీ ఈ నెల ఒకటో తేదీన కేవలం రూ.585 కోట్లు విడుదల చేసింది. అంటే దాదాపు 42% మేరకు తగ్గించింది. ఇలా పన్నుల్లో వాటా తగ్గించటంతో రాష్ట్రాలు ఇబ్బంది పడతారుు. అనుకున్న కార్యక్రమాలు అమలు చేయటం వాటాల్లో మార్పుచేర్పులు చేయాల్సి వస్తే మార్చిలో బడ్జెట్ రూపొందించేటప్పుడు చేస్తారు తప్ప మధ్యలో కాదు. దీంతో రాష్ట్రాలు నిర్దేశించుకున్న వార్షిక ఆర్థిక ప్రణాళిక గాడి తప్పుతుంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదు’’అని గవర్నర్‌తో అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
నోట్ల రద్దుతో కుదేలు
ఇక పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఎకై ్సజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై తీవ్ర ప్రభావం పడిందని, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలవుతుందని గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఖజానాను దెబ్బతీసేలా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దినసరి నగదు లావాదేవీలు జరిగే విభాగాలన్నింటిపైనా నోట్ల రద్దు ప్రభావం కొట్టిచ్చినట్లు కనిపించింది. రిజిస్ట్రేషన్లు, వాహనాలు, గృహోపకరణాల కొనుగోళ్లు ఒక్కసారిగా స్తంభించారుు’’ అని చెబుతూ సంబంధిత గణాంకాలను కూడా గవర్నర్‌కు నివేదించారు. ‘‘రాష్ట్రంలో సగటున రోజుకు దాదాపు 3,000 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతారుు.
నోట్ల రద్దు ప్రభావంతో బుధవారం కేవలం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లే జరిగారుు. భూముల రిజిస్ట్రేషన్ల రూపంలో రోజుకు రూ.20 కోట్ల చొప్పున నెలకు సగటున రూ.320 కోట్లు ఖజానాకు జమవుతుంది. ఈ ఆదాయం దాదాపు 90 శాతం పడిపోయే ప్రమాదముంది. మోటార్ వాహనాల విక్రయాల రిజిస్ట్రేషన్లతో రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుంది. రోజుకు కనీసం మూడు వేలకుపైగా వాహనాల అమ్మకాలు జరుగుతారుు. గడిచిన రెండు రోజుల్లో అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయారుు. ఎకై ్సజ్, లగ్జరీ ట్యాక్స్ తదితర రంగాల్లో కూడా ఆదాయం తగ్గుతుంది. రాష్ట్రంలో చిన్న వ్యాపారులదే పెద్ద వాటా. ఎక్కువ లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతారుు. నగదు చలామణిపై ఆంక్షలు విధించడంతో సామాన్యులు ఇబ్బంది పడతారు’’ అని చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.