నెలకు వేల కోట్లలో నష్టం | telangana cm worried about notes cancelled in monthly income | Sakshi
Sakshi News home page

నెలకు వేల కోట్లలో నష్టం

Published Fri, Nov 11 2016 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్ప గుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi

గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్ప గుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్

పన్నుల్లో కోత.. పెద్ద నోట్ల రద్దుపై సీఎం ఆందోళన  
గవర్నర్‌తో సుదీర్ఘ భేటీ

 సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు చెల్లించే నిధుల్లో కోత పెట్టడం, పెద్ద నోట్లను రద్దు చేయడంతో చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదముందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు, పెద్ద నోట్ల రద్దు ప్రభావంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నెలకు రూ.1,000 కోట్లనుంచి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడుతుందని సీఎం నివేదించినట్లు తెలిసింది. అంతమేరకు కేంద్ర ప్రభుత్వ నష్ట పరిహారం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని, కేంద్రం ఎలాంటి మినహారుుంపులు, సవరణలు ఇస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement