క్షమాపణ కోరితే వదిలేద్దాం.. :కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే కాంగ్రెస్ వాకౌట్ చేయడం, టీడీపీ సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై సీఎం ప్రగతిభవన్‌లో శుక్రవారం రాత్రి సమీక్షించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. గవర్నర్‌ను అగౌరవపరిచేలా వ్యవహరించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయకూడదని మంత్రులను కేసీఆర్ ప్రశ్నించినట్టుగా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
దీనిపై సభలో క్షమాపణలు అడిగితే వదిలిపెట్టాలని, లేకుంటే సస్పెండ్ చేయాలని నిర్ణయిం చినట్టుగా తెలిసింది. ఏపీ అసెంబ్లీలో కూడా గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే దాకా ప్రతి పక్షం ఓపికగా ఉందని గుర్తుచేశారు. గవర్నర్ ప్రసంగంపై ఏమైనా అభ్యంతరాలుంటే ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడొచ్చని, వీలుకాకుంటే నిరసనలను తెలియజేయవచ్చునని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను అగౌరవపరిచిన సభ్యుల పట్ల క్షమాపణ చెప్పేదాకా ఉపేక్షించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.
ఒకటి నుంచి ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’
సాక్షి, హైదరాబాద్: ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’ పథకానికి మార్గదర్శకాలు సిద్ధ మయ్యాయి. ఒంటరి మహిళలకు ప్రతినెలా రూ.1000 చొప్పున ఆర్థిక భృతిని అందించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శ కాలకు సీఎం కేసీఆర్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ పథకం దరఖాస్తులను ఈ నెల 20 నుంచి స్వీకరించాలని, ఏప్రిల్ 15లోగా అర్హుల జాబి తాలను సిద్ధం చేయాలని అధికారులు భావి స్తున్నారు. ఏప్రిల్‌కు సంబంధించిన భృతిని మేలో పంపిణీ చేయనున్నారు. ఏ ఆదరువు లేని, యాసిడ్ దాడులు, అత్యాచార బాధితు లు, ఎస్సీఎస్టీ అట్రాసిటీకి గురైన మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.