sharmista
-
కాంగ్రెస్ పరిస్థితిపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
ఒక నిర్దిష్ట నాయకుని నాయకత్వంలో పార్టీ నిరంతరం ఓడిపోతుంటే, దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, రచయిత శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ల జరిగిన 17వ లిటరేచర్ ఫెస్టివల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2014, 2019లలో రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని, దానిని ఎలా బలోపేతం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలంతా ఆలోచించాలని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలోని సంస్థాగత ఎన్నికలు, విధానపరమైన నిర్ణయాలు... ఇలా ప్రతి స్థాయిలోనూ అట్టడుగు స్థాయి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారని శర్మిష్ట పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయని, ఎవరి భావజాలంతోనూ మనం ఏకీభవించకపోయినప్పటికీ, వారి భావజాలం తప్పుకాదని అర్థం చేసుకోవాలని శర్మిష్ట అన్నారు. తమ తండ్రి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్లమెంటులో ప్రతిష్టంభన సమయంలో ఇతర పార్టీ సభ్యులతో చర్చించడంలో ఆయనకున్న నేర్పు కారణంగా ఆయన ఏకాభిప్రాయ నిర్మాతగా గుర్తింపు పొందారన్నారు. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడటం మాత్రమే కాదని, ఇతరుల మాట వినడం కూడా చాలా ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో చర్చలు ఉండాలన్నది ప్రణబ్ ముఖర్జీ సిద్ధాంతమని షర్మిష్ట పేర్కొన్నారు. -
‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అందరికీ వందనం అంటూ ట్వీట్‌ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా..అందరికీ మీ తుది వీడ్కోలు పలికేందుకు మీ అభిమాన కవి కోట్‌ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను..దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు..మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రణబ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “সবারে আমি প্রনাম করে যাই” I bow to all🙏 Baba, taking the liberty to quote from your favourite poet to say your final goodbye to all. You have led a full, meaningful life in service of the nation, in service of our people. I feel blessed to have been born as your daugher. pic.twitter.com/etYfZXzZ1j — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 31, 2020 చదవండి : రాష్ట్రపతి భవన్‌ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ -
శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు
తిరుపతి : శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు వచ్చాయి. యామిని అనే భక్తురాలు క్యూలో నిలుచుని శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకుంది. ఎంతో పవిత్రమైన ప్రసాదాన్ని ఆరగిద్దామని లడ్డూను తుంచుగా అందులో బొగ్గు పలుకులు వచ్చాయి. దీంతో ఆ భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. లడ్డూలో బొగ్గు పలుకులు వచ్చిన విషయాన్ని టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న టీటీడీ ఆరోగ్య శాఖ అధికారిణి శర్మిష్టా బూందీ పోటును శనివారం తనిఖీ చేశారు. అక్కడి పోటు అధికారురులతో పాటు తయారీ దారులను బొగ్గు పలుకులు ఎలా వచ్చాయని శర్మిష్టా ఆరా తీశారు. అయితే బూందీ మాడటం వల్లే బొగ్గు పలుకులుగా మారిందని అక్కడి సిబ్బంది వివరించారు. దీంతో శర్మిష్ట మీడియాతో మాట్లాడుతూ లడ్డూల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ నాణ్యత విషయంలో రాజీ వుండదన్నారు. బూందీ ఎక్కువగా మాడిపోవడం వల్లే నల్లగా బొగ్గు పలుకులుగా మారాయన్నారు. అవి లడ్డూలో కలవడం వల్లే బొగ్గుగా కనిపించిందని ఆమె తెలిపారు. కాగా గతంలోనూ లడ్డూలో జెర్రి, ఇనుప నట్లు, బోల్టులు వచ్చిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె , కథక్ నర్తకి శర్మిష్ట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. ఆ పార్టీ మూడో విడత విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు లభించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తున్నారు.