షీనా బోరా కేసులో సీబీఐ ఛార్జిషీట్
ముంబై: షీనా బోరా హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో ప్రధాన నిందితులైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ సింగ్ లపై 1000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను గురువారం సీబీఐ నమోదు చేసింది. ముంబై సరిహద్దులోని రాయ్‌గఢ్ అడవిలో లభ్యమైన మృతదేహం షీనాబోరా(24)దే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిర్ధారించి నివేదికను సీబీఐ అధికారులకు సమర్పించింది. ఈ నేపథ్యంలో సీబీఐ నిందితులపై ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.