'బీజేపీలోకి కలాం మనవడు'
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి ఒకరు బీజేపీలో చేరారు. కలాం అన్న మనవడు ఏపీజే షేక్ సలీం సోమవారం బీజేపీలో చేరారు. అబ్దుల్ కలాం చనిపోయేవరకు కలాంతో సలీం ఉన్నారు. ఢిల్లీలోని కలాం నివాసంలో అబ్దుల్ కలాంతోపాటు సలీం కొనసాగారు.