ఈ నెల 23న టెట్: శేషుకుమారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (23వ తేదీ) 1,574 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) నిర్వహించనున్నట్లు టెట్ కన్వీనర్ శేషుకుమారి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తంగా 3,67,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపరు–1 పరీక్షకు 1,11,647 మంది, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపరు–2 పరీక్షకు 2,56,265 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.