shilpaShetty
-
ఈమె ఫేమస్ హీరోయిన్.. 49 ఏళ్లంటే మీరు నమ్ముతారా? (ఫొటోలు)
-
డైనమిక్ కమ్‌బ్యాక్
సుమారు పదమూడేళ్ల తర్వాతఫుల్ లెంగ్త్ రోల్లో నటించడానికి రెడీ అవుతున్నారు శిల్పాశెట్టి. దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్గా సత్తా చాటారామె. ఇప్పుడు ‘నికమ్మా’ అనే యాక్షన్ ఫిల్మ్‌లో ఓ కీలక పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు శిల్పా. ఈ చిత్రంలో అభిమన్యు దాసాని, షెర్లీ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘నా కెరీర్లో ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఆడియన్స్‌కు నా కొత్త అవతారాన్ని చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని శిల్పాశెట్టి అన్నారు. ‘‘శిల్పాశెట్టి మా సినిమాతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఆమె పాత్ర డైనమిక్‌గా ఉంటుంది’’ అన్నారు షబ్బీర్‌ఖాన్ అన్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్‌లో ఉన్నారు శిల్పా. హాలిడేస్ ఎంజాయ్ చేసి, ముంబై తిరిగి రాగేనే ‘నికమ్మా’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఓమ్ శాంతి ఓమ్’ (2007), దోస్తానా (2008), ధీక్షియా వుమ్ (2014) చిత్రాల్లో శిల్పా నటించినప్పటికీ వాటిలో అతిథి పాత్రలే. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుండటం ఆమె అభిమానులకు తీయని వార్తే. -
యోగా గురువుగా మారిన శిల్పాశెట్టి
-
టీమిండియా క్రికెటర్ ఇంట్లో హీరోయిన్ సందడి!
వడోదర: బాలీవుడ్ నటి సుందరి శిల్పాశెట్టి టీమిండియా క్రికెటర్ ఇంట్లో సందడి చేసింది. శిల్ప గుజరాత్ లోని వడోదరకు ఆదివారం వెళ్లింది. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్ మన్ యూసఫ్ పఠాన్ ను కలుసుకుంది. మిత్రుడు పఠాన్ ఇంటికి వెళ్లాను అని స్నేహితుడితో ఓ ఫొటో అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. యూసఫ్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడిపింది. గతంలోనూ యూసప్ కుటుంబసభ్యులను పలుమార్లు ఆమె కలుసుకుంది. స్నేహితుడి తల్లి ఎంతో అప్యాయతతో తనకు భోజనం పెట్టిందని.. ఆమె ఎంతగానో ప్రేమతో వడ్డిస్తుంటే కాదనలేక అంతా తినేశానని పొడుగుకాళ్ల సుందరి చెప్పింది. యూసఫ్ పఠాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఓ జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్ లు ఆడాడు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ జట్టుకు సహ యజమానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో శిల్పాశెట్టి ఆ క్రికెటర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జట్టుపై రెండేళ్లపాటు నిషేధం ఉంది. -
కేక పుట్టించిన ఢిల్లీ ఫ్యాషన్ వీక్