shine
-
అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో మెరిసిన బ్యూటీ క్వీన్స్
-
ఆస్కార్ పార్టీలో మెరిసిన తారలు
-
మిల మిల మెరిసే దుస్తులలో మాధూరి దీక్షిత్.. ఫొటోలు
-
100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..
భారత బైక్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్‌లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే మోడల్ పేరుతో 100 సీసీ ఇంజన్‌తో హోండా కంపెనీ కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! హోండాకు సంబంధించి దేశంలో 125సీసీ ఆపైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే 100సీసీ బైక్‌ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉంది. 100 సీసీ రేంజ్ బైక్‌ల అమ్మకాల్లో హీరో కంపెనీకి తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్పెండర్ బైక్‌లు. ఈ నేపథ్యంలో వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా బాగా పాపులరైన షైన్ పేరుతో 100 సీసీ మోటర్ సైకిల్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.64,900 (ఎక్స్‌షోరూం). అంటే హీరో స్ల్పెండర్ ప్లస్ కంటే తక్కువే.. హోండా షైన్ 100 సీసీ ప్రత్యేకతలు హోండా షైన్ 100 సీసీ బైక్ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 సంవత్సరాలు సాధారణ వారంటీ కాగా సంవత్సరాల ఎక్స్టెండెట్ వారంటీ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పొడవాటి సీటు (677 మి.మీ), చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో కూడిన ట్యాంక్ ఉన్నాయి. ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలుండదు. హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్‌తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్)ను ఈ 100సీసీ బైక్‌లోనూ చేర్చారు. ఇక డిజైన్ విషయానికొస్తే హోండా షైన్ 125 ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అలాయ్ వీల్స్ తదితర చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
రైనోస్టోన్ మాస్క్.. వెలిగిపోండిక
ఫేస్‌మాస్క్‌ల కాలం ఇది. ఎప్పుడూ ఒకే స్టైల్‌వి ధరించాలన్నా బోర్‌గా ఫీలయ్యే కాలం. అందుకే డిజైనర్లు వీటిలో విభిన్నరకాల మోడల్స్‌తో మెరిపిస్తున్నారు. కొన్ని ముత్యాలు, ఇంకొన్ని రంగురాళ్లు.. అవీ కాదంటే కొన్ని రత్నాలతో సింగారించి ఇలా మెరిపిస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలను చీరలపై సింగారించారా.. అని పొగిడే కాలం పోయి మాస్క్ మీద మెరిపించారా.. అనకుండా ఉండలేరు. పార్టీవేర్ మాస్క్‌గా ఈ రైనోస్టోన్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ధరలు స్టోన్స్, డిజైన్ బట్టి ఉన్నాయి. ప్లెయిన్ శాటిన్ ఫ్యాబ్రిక్‌ను మూడు పొరలుగా తీసుకొని, మాస్క్‌ను కుట్టి, రైనోస్టోన్స్ అతికించినా పార్టీవేర్ మాస్క్ రెడీ అన్నమాట. డ్రెస్‌కు మ్యాచింగ్ అయ్యేలానూ డిజైన్ చేసుకోవచ్చు. -
షైన్ ఆస్పపత్రి ఘటనలో బైయిల్కు వీలులేని సెక్షన్
-
శిశువు ప్రాణాలు కోల్పోతే...బెయిలబుల్ కేసా
సాక్షి, హైదరాబాద్: షైన్ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఒక శిశువు ప్రాణం కోల్పోతే నిందితులపై 304(ఏ) బెయిలబుల్ కేసు పెట్టడమేమిటని పోలీసుల తీరుపై రంగా రెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తపరచింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్‌ను తన కున్న అధికారాలతో ఇన్చార్జి మేజిస్ట్రేట్ రెండో అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ కవితాదేవి ఎఫ్ఐఆర్లో 304 పార్ట్(2)నాన్‌బెయిలబుల్‌గా మార్పుచేశారు. నిర్లక్ష్యంతో వ్యవహరించి శిశువు ప్రాణాలు పోడానికి కారణమైన నిందితులపై బెయిల బుల్ సెక్షనునమోదుచేయడం సమంజసం కాదని పోలీసులకు చురకలంటించారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇన్చార్జి మేజిస్ట్రేట్ ఎఫ్ఐఆర్లో మార్చిన 304 పార్ట్(2) ప్రకారం నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల పాటు శిక్షపడే అవకాశం ఉంది.షైన్ ఆసుపత్రి ఎండీ సునీల్‌కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురు సిబ్బందిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. నిందితుల తరఫున న్యాయవాది తమ క్లైంట్ల కు బెయిల్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉండగా మేజిస్ట్రేటు తీసుకున్న నిర్ణయం వారిని విస్మయానికి గురిచేసింది. గతంలో హైదరా బాద్‌లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో చిన్నారి రమ్య మృతిచెందిన సంఘటన నుంచి పోలీసులు ఇలాంటి కేసుల్లో నాన్ బెయిల బుల్ సెక్షన్నే నమోదు చేస్తున్నారు. -
అడుగడుగునా ఉల్లంఘనలే..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లోని షైన్ ఆస్పత్రి యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లఘించినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి బృందం గుర్తించింది. భవనంతో సహా అందులోని వార్డులు, ఐసీయూ విభాగాలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి గురువారం ఆమె తుది నివేదికను అందజేశారు. ఘటన తర్వాత మంగళవారం ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. సెల్లార్ సహా జీ+3తో కూడిన ఈ భవనం లో అత్యవసర ద్వారం లేకపోవడమే కాకుండా ప్రమాదం జరిగిన మూడో అంతస్తు పైకప్పు నిబంధనలకు విరుద్ధం గా థర్మాకోల్ షీట్స్‌తో ఏర్పాటు చేసినట్లు గుర్తిం చింది. 20 పడకలకు అనుమతి పొందిన ఈ ఆస్పత్రిలో అనధికారికంగా 58 పడకలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొంది. 12 ఇంక్యూబేటర్లు, రెండు ఫొటో థెరపీ యూనిట్లు ఉండగా.. వీటిలో ఆరు ఇంక్యూబేటర్లు, రెండు ఫొటో థెరపీ యూనిట్లు పాడైపోయినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు ఫైర్మాక్ డ్రిల్స్ నిర్వహించిన దాఖలాలు కూడా లేనట్లు పేర్కొంది. సీఈఐజీ ప్రాథమిక విచారణ నిర్వహణ లోపం వల్లే రిఫ్రిజిరేటర్లో పేలుడు సంభవించి షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయం(సీఈఐజీ) ధృవీకరించింది. ఎల్బీనగర్లోని షైన్ ఆస్పత్రిని సీఈఐజీ అధికారులు తనిఖీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నట్లు ప్రకటించారు. -
నిలకడగా చిన్నారుల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: షైన్ ఆస్పత్రి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన చిన్నారుల వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించిన షైన్ ఆస్పత్రి యాజమాన్యం ఇప్పుడు ముఖం చాటేసింది. ఆస్పతి ఘటనపై ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. పోలీసులకు సైతం ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డి కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ఆస్పత్రుల్లో చిన్నారులకు చికిత్స ప్రమాద సమయంలో వివిధ ఆస్పత్రిలకు తరలిం చిన చిన్నారులంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్ ఉప్పల్‌లోని శ్రీధ ఆస్పత్రికి తర లించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలల హక్కుల కమిషన్ విచారణ అగ్నిప్రమాద ఘటనలో చిన్నారి మృతిచెందడాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్‌రావ్,అపర్ణ, బృందాకర్లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం మంగళవారం ఆస్పత్రిని సందర్శించి విచారించారు. అన్ని విభాగాల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సభ్యులు తెలిపారు. ఆస్పత్రిని సందర్శించిన అదనపు డైరెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్ మంగళవారం షైన్ ఆస్పత్రిని సందర్శించారు. దుర్ఘటనపై ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షైన్ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. తనతో పాటు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మిని కమిటీలో ఉన్నారన్నారు. ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి ప్రాథమికంగా ఒక రిపోర్టు అందజేయనున్నట్లు చెప్పారు. -
అగ్నికి ఆజ్యం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆపై విస్మరించడం బల్దియాకు పరిపాటిగా మారింది. నగరంలో ఫైర్ సేఫ్టీ లేని సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. తాజాగా సోమవారం ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ షార్ట్ సర్క్యూట్‌తో ఇంక్యుబేటర్ పేలి మంటలు చెలరేగడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రి భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడంతోనే దుర్ఘటన జరిగిందని, దీనికి సెట్‌బ్యాక్ కూడా లేదని తేలింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే కాదు.. నగరంలోని చాలా హాస్పిటల్స్‌లోనూ అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేవు. సిటీలో మొత్తం 1,600లకు పైగా ఆస్పత్రులు ఉండగా... అసలు వాటిలో ఎన్నింటికి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లున్నాయనే లెక్కలు జీహెచ్ఎంసీ దగ్గర కూడా లేవంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, బార్లు తదితర రద్దీ ఎక్కువగా ఉండే వాటిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతిఏటా రెన్యూవల్ చేయించుకోవాలి. కానీ వీటికి సంబంధించి జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు 50 వేలు గ్రేటర్ పరిధిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన భవనాలు దాదాపు 50వేలు ఉన్నాయి. నిర్మాణ అనుమతితో పాటే ప్రొవిజనల్ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవడం గతంలో తప్పనిసరిగా ఉండేది. జీహెచ్ంఎసీ 6–15 మీటర్ల ఎత్తు వరకు వాణిజ్య భవనాలకు, 18 మీటర్ల ఎత్తు వరకు నివాస భవనాలకు ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లున్నాయో లేదో పరిశీలిస్తుంది. అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం చూస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని వాటికి నిర్మాణ సమయంలోనే ప్రొవిజనల్ ఫైర్ సేఫ్టీ అవసరం లేదని పాత నిబంధన సవరించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యాక సైతం ఫైర్ సేఫ్టీ తీసుకుంటున్నవారు అత్యల్పంగా మాత్రమే ఉన్నారు. ఇక ఏటేటా రెన్యూవల్స్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రకటనలకే పరిమితం గ్రేటర్‌తో పాటు దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నప్పటికీ... ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని వాటి అనుమతులు రద్దు చేయించే అంశాన్ని సైతం ఆరేడేళ్ల క్రితం పరిశీలించినప్పటికీ... ఆ తర్వాత విస్మరించారు. ఫైర్ సేఫ్టీ తనిఖీల సమయంలోనే భవన నిర్మాణ అనుమతి, ట్రేడ్ లైసెన్సు, ఆస్తి పన్ను చెల్లింపు తదితర అంశాలనూ పరిశీలించాలని దాదాపు ఏడాదిన్నర క్రితం నిర్ణయించారు. నిబంధనలతోనే... నగరంలో 2009 కంటే ముందు నిర్మించిన స్కూళ్లకు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ అవసరం లేదని, యాజమాన్యాలు స్వీయ ధ్రువీకరణలను డీఈఓకు అందజేస్తే సరిపోతుందనే జీవో ఉందని సంబంధిత అధికారి తెలిపారు. అలాగే 2009 తర్వాత నిర్మించిన వాటికి సైతం చుట్టూ 6 మీటర్ల సెట్‌బ్యాక్ ఉంటేనే ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ ఇవ్వాలనే నిబంధన ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. సిబ్బంది లేమి.. వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై తనిఖీలు చేయాలని మున్సిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ విభాగంలో జీహెచ్ఎంసీకి తగిన యంత్రాంగం లేకపోవడంతో ఆ పని పూర్తి కాలేదు. ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు మంజూరైన పోస్టులు తప్ప.. ఆ తర్వాత పెరగనేలేదు. ఇద్దరు డీఎఫ్ఓలు, ఐదుగురు ఎస్ఎఫ్ఓలకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ విభాగం బాధ్యతలను ఈవీడీఎం డైరెక్టర్‌కు అప్పగించాక, తొలి దశలో బార్లు, పబ్బులపై దృష్టిసారించారు. ఆస్పత్రుల తనిఖీలు మలిదశలో చేయాలని భావిస్తున్నారు. దశలవారీగా తనిఖీలు.. ఈవీడీఎం విభాగానికి ఫైర్ సేఫ్టీ బాధ్యతలు అప్పగించాక దశల వారీగా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా తొలిదశలో బార్లు, పబ్‌లకు నోటీసులు జారీ చేశాం. రెండో దశలో స్కూళ్లు, మూడో దశలో ఆసత్రులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫైర్ సేఫ్టీ లేని ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ఎన్ని ఆస్పత్రులకు ఫైర్ సేఫ్టీ లేదో తెలుసుకునేందుకు శనివారం నుంచి డాక్యుమెంట్ల పరిశీలన చేపట్టి 10–15 రోజుల్లో పూర్తి చేస్తాం. ఏర్పాట్లు చేసుకునేందుకు తగిన సమయం, అవసరమైన వారికి సామగ్రి సమకూర్చే చర్యలు కూడా చేపడతాం. అప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోని వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇంత పెద్ద నగరంలో అన్నింటిలో తనిఖీలు ఒకేసారి సాధ్యం కాదు. అందుకే దశలవారీగా ప్రణాళిక రూపొందించాం. ఒకసారి రంగంలోకి దిగాక తూతూమంత్రంగా కాకుండా పటిష్టంగా అమలు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అగ్నిమాపక అనుమతుల విషయంపై విచారణ చేస్తాం. – విశ్వజిత్ కాంపాటి, ఈవీడీఎం డైరెక్టర్ -
‘ఆంధ్రారోమ్’లో క్రిస్మస్ కాంతులు
వేడుకలకు ముస్తాబైన బాలయేసు దేవాలయం ఫిరంగిపురం : ఆంధ్రారోమ్‌గా ప్రసిద్ధి చెందిన ఫిరంగిపురంలోని బాలయేసు కథెడ్రల్ దేవాలయం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విచారణ గురువు బెల్లంకొండ జయరాజు నేతృత్వంలో జరిగే వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ప్రార్థనలు చేసుకొని మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. కార్మెల్భవన్తో పాటు సెయింట్ పాల్స్ హైస్కూల్ ఆవరణలో భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి సైతం వేలాది మంది భక్తులు క్రిస్మస్ పర్వదినానికి తరలివస్తున్నారు. కులమతాలకతీతంగా గ్రామంలో క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటారు. బంధువులు, స్నేహితుల రాకతో ప్రతి ఇల్లూ కోలాహలంగా మారింది. ఆలయంలో కొవ్వొత్తుల సమర్పించిన అనంతరం కొండపైన ఉన్న కార్మెల్‌మాతను దర్శించుకుంటారు. నేటి నుంచి ప్రత్యేక ప్రార్థనలు.. 24వతేదీ అర్ధరాత్రి జరిగే దివ్యపూజాబలి కార్యక్రమంలో బిషప్ తిప్పాబత్తిన భాగ్యయ్య పాల్గొని వేడుకలను ప్రారంభిస్తారు. 25న ఉదయం బాలయేసు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం గ్రామ వీధుల నుంచి బాలయేసు ప్రతిమను ఊరేగింపుగా కొండమెట్ల వరకు ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో పెద్ద మొత్తంలో బాణసంచా కాలుస్తారు. పండుగపై పెద్దనోట్ల ప్రభావం... పెద్దనోట్ల ప్రభావం పండుగపై పడింది. ఏటా 22వతేదీ నాటికి పలు రకాల బొమ్మల దుకాణాలు విరివిగా వచ్చేవి. గ్రామంలో కూడా 10 రోజుల ముందు నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలుతో కిరాణా దుకాణాలు కిటకిటలాడేవి. దుస్తుల షాపుల సైతం వెలవెలబోతున్నాయి. -
నగలకు మెరుగు పెడతామని..
లక్సెట్టిపేట్: బంగారు నగలకు మెరుగు పేరుతో దుండగులు నగలతో ఉడాయించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక గాంధీచౌక్ ఏరియాలో బంగారు నగలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరించారు. అదే ప్రాంతానికి చెందిన అంజలి, పద్మ అనే గృహిణులు తమ రెండు ఉంగరాలతో పాటు రెండు తులాల గొలుసును మెరుగు కోసం వారికి ఇచ్చారు. మెరుగు పెట్టే నెపంతో ఆగంతకులు వాటిని తమ దగ్గర ఉంచుకుని, నకిలీవి గృహిణులకు ఇచ్చి అక్కడి నుంచి మాయమయ్యారు. మోసపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.