ship yard
-
నేవీ చేతికి విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురువారం నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది. ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్తో రూపొందాయి. ఫిక్స్డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది. ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. -
మతి పోయేలా.. ‘మలేనా’.. ఖర్చు రూ.2500 కోట్లు, మరెన్నో విశేషాలు
పేద్ద.. క్రూయిజ్ ఓడ నీళ్లలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓ బిల్డింగే అలా కదిలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ ఓడలను అంతలా అద్భుతంగా నిర్మిస్తుంటారు. రోడ్రిగ్యుయెజ్ డిజైన్ అనే కంపెనీ కూడా తామేం తీసిపోలేదంటూ కళ్లు చెదిరే ఓ ఓడ డిజైన్‌ను రూపొందించింది. 110 మీటర్ల పొడవు.. 26 మీటర్ల ఎత్తున్న అతిపెద్ద ఈ ఓడను పక్కనుంచి చూస్తే ఓ లగ్జరీ హోటలేనా అనిపించేట్టు ఉంటుంది. ఈ డిజైన్‌తో ఓడను నిర్మించాలంటే ఓడలో వాడే వస్తువులు, నిర్మించే కంపెనీని బట్టి దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఓడకు ‘మలేనా’ అని పేరు పెట్టింది. ఓడలో మొత్తం 11 క్యాబిన్లు ఉంటాయి. వీటన్నింటిలో కలిపి 24 మంది ప్రయాణించొచ్చు. ఓడ ప్రధాన డెక్‌లో 6 వీఐపీ క్యాబిన్లు ఉంటాయి. లోయర్ డెక్‌లో 4 డబుల్ క్యాబిన్ డెక్‌లు, ఒక యజమాని అపార్ట్మెంట్ ఉంటాయి. ఇందులో హాట్ టబ్, డైనింగ్ ప్రాంతం ఉంటుంది. లోయర్ డెక్లోనే 9 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రెండు ఇన్ఫినిటీ పూల్స్, వీటితో పాటు సన్ బెడ్స్ ఉంటాయి. అలాగే ఏడుగురు కూర్చునేలా బార్ ఉంటుంది. లోయర్ డెక్ నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అప్పర్ డెక్ వస్తుంది. ఇక్కడ ఓ పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది. 24 మంది కలిసి కూర్చొని తినవచ్చు. అప్పర్ డెక్‌లో ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఏసీహెచ్ 160 లేదా అలాంటి పరిమాణంలోని హెలికాప్టర్లు దీనిపై ల్యాండ్ చేయవచ్చు. (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) నిర్మాణానికే నాలుగైదేళ్లు ఓడలో అన్నింటికన్నా పైన సన్ డెక్ ఉంటుంది. దీన్నే పార్టీ డెక్ అని కూడా అంటారు. ఇక్కడ మరో హాట్ టబ్, కూర్చునేందుకు ఓ ప్రాంతం, ఓ బార్ కూడా ఉంటాయి. బోటు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంధనాలతో కలిసి నడుస్తుంది. బోటును నిర్మించడానికి దాదాపు 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని కంపెనీ యజమాని చెప్పారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ మాత్రమే అయినా ఓడ నిర్మాణానికి ఓ షిప్ యార్డ్‌తో, నిర్మించాలనుకుంటున్న వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నామని డిజైన్ కంపెనీ చెప్పింది. (చదవండి: లాక్‌డౌన్‌తో ఆగమాగం .. చైనీయుల ఆకలి కేకలు, అయినా తగ్గేదే లే!) – సాక్షి సెంట్రల్ డెస్క్ -
గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితం..
శ్రీకాకుళం: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందినవారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఏపీ నుంచి నేవీ హెలికాప్టర్, తమిళనాడు నుంచి డోర్నియర్ విమానాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను సీదిరి అప్పలరాజు పర్యవేక్షించారు. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు. సురక్షితంగా బయట పడ్డ మత్స్యకారులు వీరే 1. కోడ సోమేష్ బోట్ డ్రైవర్ 2. కోడ జగన్నాధం 3. మోస సూర్యనారాయణ 4. అంబటి నీలకంఠం 5. నిట్ట జోగారావు 6. కామేష్ 7. రాజు 8. శివాజి 9. బావయ్య 10. రవి 11. అప్పారావు 12. బాబు -
పోర్ట్‌లో సింహాలా గుంపు.. వైరల్ వీడియో
గాంధీనగర్: క్రూర మృగాలు చాలా వరకు అడవులలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొసారి ఆహారం కోసం, నీటి జాడను వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు కోకొల్లలు. సాధారణంగా సింహాన్ని జూపార్కు బోనులో ఉన్నప్పుడు చూడటానికే చాలా మంది భయపడిపోతుంటారు. దాని గాండ్రింపు, ఆకారం, పెద్దదైనా జూలు చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది. అయితే, అలాంటి సింహాలు జనావాసాల్లోకి వస్తే.. ఇంకేమైనా ఉందా!.. అయితే, తాజాగా ఇలాంటి సంఘటన గుజరాత్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాలు.. సింహాలా గుంపు తన పిల్లలతో కలిసి అడవికి దగ్గరగా ఉన్న పిపావవ్ ఓడరేవులోకి ప్రవేశించాయి. అంతటితో ఆగకుండా సింహాలు, వాటి పిల్లలు గాండ్రిస్తు పోర్ట్‌లో అటూ ఇటూ తిరిగాయి. ఈగుంపును చూసిన అక్కడి కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది భయంతో వణికిపోయారు. వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘నగర పర్యటనకు వచ్చిన సివంగి గ్యాంగ్..’, ‘వామ్మో.. వాటిని చూస్తేనే భయం వేస్తుంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో సింహాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వాటికి అనుకూలంగా సహజ ఆవాసాలు ఏర్పాటు చేశారు. గుజరాత్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020లో సింహాల జనాభా 29 శాతం పెరిగింది. అదే విధంగా, గిర్ అడవిలో 674 సింహాలు ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రతి ఐదేండ్లకు ఒకసారి సింహాల సంఖ్యను లెక్కిస్తారు. -
బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడుదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళలో 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రోకి భారీగా నిధులు ఇక బడ్జెట్లో మెట్రోలైట్, మైట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు, కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు.. బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు కేటాయించారు. ఇక దేశంలో లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
పోర్టు కోసం పోరు
కావలి: జిల్లాలో వెనుకబడిన కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లా ప్రజలను ఊరిస్తున్న పోర్టు కమ్ షిప్ యార్డు సాధనకు కావలి కేంద్రంగా పోరాటాలకు రంగం సిద్ధమవుతోంది. పోర్టు కమ్ షిప్ యార్డు ఏర్పాటుకు రామాయపట్నం ప్రాంతం అనుకూలమని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే, 2011 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల పోర్టు నిర్మాణం నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఇక్కడ పోర్టు నెలకొల్ప డానికి గల అవకాశాలు, వనరులపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైట్స్ సంస్థ ప్రతి నిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నెల్లూరు–ప్రకాశం జిల్లాల నడుమ కావలి తీరానికి అతి సమీపంలో గల రామాయపట్నం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్టు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో పోర్టు సాధన దిశగా పోరుబాట పట్టేం దుకు కార్యచరణ సిద్ధమవుతోంది. ప్రతిపాదనలు ఇలా.. దేశంలోని తూర్పు సముద్ర తీరప్రాంతంలో రెండు భారీ ఓడరేవులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 2001లో విధాన నిర్ణయం తీసుకుంది. వస్తువుల ఎగుమతి, దిగుమతులతోపాటు ఓడల తయారీ, మరమ్మతులకు అనువుగా పశ్చిమ బెంగాల్లో ఒకటి, మన రాష్ట్రంలో ఒకటి చొప్పున పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మించేందుకు తలపెట్టింంది. పశ్చిమ బెంగాల్ మాత్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ తీరం ఇందుకు అనువుగా ఉంటుందని వెనువెంటనే సిఫార్సులు పంపించింది. అదే సంవత్సరంలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రానికి వస్తే విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం తీర ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయాలంటూ ఆయా ప్రాంతాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణానికి ప్రదేశం ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై నిపుణులు కమిటీ వివిధ ప్రాంతాలను పరిశీలించి రామాయపట్నం తీరం దీనికి అనుకూలంగా ఉందని తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఎంపీ మెలికతో.. అప్పట్లో తిరుపతి ఎంపీగా ఉన్న చింతా మోహన్ దుగరాజుపట్నంలో ఓడరేవు నిర్మించాలంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ సమర్పించారు. ఉత్తర భారతానికి చెందిన కొందరు ఎంపీలతో సంతకాలు చేయించి మరీ అర్జీ ఇవ్వడంతోపాటు తనకు గల పరిచయాలతో లాబీయింగ్ చేయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దుగరాజుపట్నంలో భారీ ఓడరేవు నిర్మిస్తామని 2013 మే నెలలో ప్రకటించింది. రామాయపట్నంలో నిర్మించాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్పించిన లేఖను బుట్టదాఖలు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రామాయపట్నంలో పోర్టు నిర్మాణ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మొత్తానికి పోర్టు నిర్మాణ ప్రతిపాదన మరుగున పడింది. 2015 జూలైలో కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించారు. తొలి విడతలో రూ.6,091 కోట్లు వెచ్చించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, అందువల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని స్పష్టంగా ప్రకటించారు. రామాయపట్నం ప్రత్యేకతలివీ జాతీయ రహదారి, రైల్వేట్రాక్‌లకు కేవలం ఐదు కిలోమీ టర్ల సమీపంలోనే రామాయపట్నం ఉంది. సాగరమాల పథకం కింద అభివృద్ధి చేస్తున్న బకింగ్‌హాం కెనాల్ కూ డా దీనికి అందుబాటులో ఉంది. రామాయటపట్నంకు సమీపంలో కావలి పట్టణం ఉండటం కలిసొచ్చే అంశం. ఎంపీ మేకపాటి ప్రస్తావనతో.. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ పోర్టు సాధన కోసం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పోర్టులు, ట్రాన్స్‌పోర్టు స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉండటంతో మూడేళ్లుగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాయపట్నంలోనూ పోర్టు నిర్మించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర, ప్రత్యుత్తరాలు లేకపోయినా నేరుగా కేంద్ర ప్రభుత్వమే దీనిపై ఒక స్పష్టత వచ్చేందుకు తన మార్గాన తాను చేసుకోవాల్సిన పనిని చక్కబెట్టుకునేలా చేస్తున్నారు. పోరాటాలకు కార్యాచరణ ప్రణాళిక పోర్టును సాధిస్తేనే కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు కావలిని ఆనుకుని ఉన్న ప్రకాశం జిల్లాలోని ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పోర్టు ఏర్పాటే శరణ్యమనే ఆలో చన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోరుబాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ఈ అంశంపై చాలా పట్టుదలగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి పోరాటాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
ఇతర నగరాల్లో రియల్ దూకుడు!
అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏకైక ఆశాదీపం... పరిశ్రమలతో నిండిన విశాఖే. సింగపూర్‌ను పోలిన వనరులు, సౌకర్యాలూ ఇక్కడున్నాయి. చుట్టూ సముద్రం, భారీ నౌకలు కూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు, చమురు కంపెనీలు, షిప్‌యార్డ్, విమాన సేవలు, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు, వేల కోట్ల ఫార్మా ఎగుమతులు, ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు, ఏడాది పొడవునా బారులు తీరే పర్యాటకులు ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం అంటే. ఏడాదిగా విశాఖలో స్థిరాస్తి ధరల్లో కనీసం 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని క్రెడాయ్ విశాఖపట్నం సెక్రటరీ కోటేశ్వరరావు చెప్పారు. 2006లో రూ.25 వేలున్న గజం స్థలం ధర ఇప్పుడు రూ.50 వేలకు పైగానే పలుకుతోందని పేర్కొన్నారు. సిటీ నుంచి 15 కి.మీ. దూరంలో ఉండే మధురవాడ, ఎండాడ, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,500గా, నర్సింహానగర్, అక్కయపాలెం, అబీద్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.3,500లు, బీచ్‌రోడ్, బాలాజీనగర్, పాండురంగాపురం వంటి ప్రాంతాల్లో రూ.4000గా ఉందని తెలిపారు. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా విశాఖలో ధరలు పెరిగాయని, మరో ఆరేడు నెలల్లో ధరలు స్థిరపడే అవకాశముందని ఆయన చెప్పారు. ఐటీ జోరు.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఢోకాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు వచ్చేది విశాఖకే. ఇప్పటికే ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, 90 ఫార్మా కంపెనీలున్నాయి. వీటి వార్షిక టర్నోవర్ ఏటా రూ.1,450 కోట్లుగా ఉంది. ప్రత్యేక హోదా కారణంగా భారీస్థాయిలో పన్ను మినహాయింపులు లభిస్తాయని కనుక కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మరో 50 కంపెనీలు విశాఖకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రుషికొండలో మూడు ఐటీ సెజ్‌లు ఏర్పాటు కానున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధికి ఢోకాలేదు.. విశాఖ నుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు ఆధారిత కంపెనీలు భారీగా రానున్నాయి. పది మండలాల్లో విస్తరించనున్న ఈ జోన్లో వివిధ కంపెనీలు రానున్నాయి. పీసీపీఐఆర్ కంపెనీలకు పన్ను రాయితీలు వర్తిస్తుండగా ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్ పెరగనుంది. వైజాగ్, గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి, భీమిలిలోనూ పోర్టులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సిటీ నుంచి 20 కి.మీ. దూరంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భవనాలూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే అటవీ భూమిని సైతం డీ నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మరో 5 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రాజధాని.. ‘విశాఖపట్నం’ జనాభా: 21 లక్షలు విస్తీర్ణం: 550 చ.కి.మీ. ఐటీ, ఫార్మా కంపెనీలు: 160 ఎస్ఈజెడ్లు: 4, పోర్టులు: 2 స్థిరాస్తి ధరలు 40 శాతం వరకూ పెరిగాయి {పాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ ఉంది.