Shiv Sena MPs
-
శివసేన ఎంపీలకు బెర్తులు ఖరారు
న్యూఢిల్లీ: బీజేపీ, శివసేనల మధ్య చోటు చేసుకున్న వివాదం సద్దుమణిగిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. మోడీ కేబినెట్ తొలి విస్తరణలో చేరేది లేదని భీష్మించుకుని శివసేన దిగి వచ్చింది. ప్రధాన నరేంద్ర మోడీ ఇచ్చి ఆదివారం మధ్యాహ్నం ఇచ్చిన అల్పాహార విందుకు శివసేన పార్టీ సీనియర్ నేత సురేష్ ప్రభు హాజరయ్యారు. కేబినెట్ విస్తరణలో ప్రభుకు కేబినెట్ ర్యాంకు ఇవ్వాలని మోడీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పార్టీకి చెందిన అనిల్ దేశాయ్‌కి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ఉదయం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో అసెంబ్లీ స్థానాల విషయంలో బీజేపీ, శివసేనల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో దాదాపు రెండు దశాబ్దాల పొత్తుకు ఆ రెండు పార్టీలు చరమగీతం పాడాయి. ఈ నేపథ్యంలో మోడీ తొలి కేబినెట్ విస్తరణలో చేరేందుకు శివసేన నిరాకరించింది. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగి... చర్చలు జరిపింది. దీంతో ఆ చర్చలు సఫలీకృతమైనాయి. దీంతో మోడీ కేబినెట్లో శివసేనకు రెండు బర్త్‌లకు ఖరారైయ్యాయి. -
మోదీ తేనేటి విందుకు శివసేన ఎంపీలు హాజరు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ విందుకు శివసేన ఎంపీలు హాజరయ్యారు. అయితే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విందుకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతల గురించి ఎంపీలతో ప్రధాని మోదీ పంచుకోనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, ఎంపీ మోడల్ విలేజ్ పథకాలను గురించి వివరించనున్నారని కేంద్ర ప్రచార, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అంతకుముందు తెలిపారు. ఆయా పథకాలపై సంబంధింత మంత్రులు ప్రజెంటేషన్ ఇస్తారని వెల్లడించారు. ఈ పథకాలను విజయవంతం చేయాలని ఎంపీలను మోదీ కోరనున్నారు. -
'మా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది'
ముంబై: తమ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. ఇతర మతాల పట్ల తమ పార్టీకి ఎటువంటి ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. శివసేన ఎంపీలు ఢిల్లీలో ముస్లింతో బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నించి అతడి ఉపాసన దీక్షను భగ్నం చేశారని వచ్చిన ఆరోపణలపై థాకరే స్సందించారు. 'ఇది శివసేన గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నం. హిందుత్వ వాదులుగా ఉనప్పటికీ ఇతర మతాల పట్ల మాకు ద్వేషభావం లేదు' అని ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు. మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో శివసేన ఎంపీలు బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో నిరసన వ్యక్తమవుతోంది. -
'చపాతి' ఘటనపై అద్వానీ అసంతృప్తి
న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన 'చపాతి' ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్య చర్య కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో బలవంతంగా శివసేన ఎంపీలు చపాతి తినింపించిన ఘటనపై ఆయనీ విధంగా స్పందించారు. తమకు మహారాష్ట్ర వంటకాలు పెట్టలేదనే ఆగ్రహంతో శివసేన ఎంపీలు ముస్లిం కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించే ప్రయత్నం చేశారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. -
'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్
-
'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్
న్యూఢిల్లీ: శివసేన ఎంపీలు ముస్లిం కార్మికుడితో బలవంతంగా చపాతి తినిపించిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే పలువురు విపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విమర్శించారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉండగానే ఈ గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్ సమిత్రా మహాజన్ సర్దిచెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా 'చపాతి' ఘటనపై అట్టుడికింది. ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్ లో తమకు మహారాష్ట్ర వంటకాలు వండిపెట్టలేదన్న కారణంతో ఆగ్రహానికి గురైన 11 మంది ఎంపీలు ముస్లిం మతస్థుడైన కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించారు. అతడి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేశారు. ఈ వీడియో వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)