Shivraj Kumar
-
పునీత్ లేడంటే తట్టుకోలేకపోతున్నాం: శివరాజ్‌కుమార్ ఆవేదన
Puneeth Rajkumar 11th Day Death Ceremony: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 11 రోజుల పుణ్యతిథిని కుటుంబసభ్యులు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధికి సోమవారం ఉదయం భార్య అశ్విని, కూతుర్లు వందితా, ధృతి, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఇతర కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పూజలు చేశారు. పునీత్‌కు ఇష్టమైన 30 రకాల శాకాహార, మాంసాహార వంటకాలను సమాధి వద్ద ఉంచారు. సదాశివనగరలోని పునీత్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నదానం చేస్తున్న శివరాజ్‌కుమార్ తమ్ముడు కాదు కొడుకు: శివ రాజ్‌కుమార్ పునీత్ లేడంటే తట్టుకోలేకపోతున్నామని అన్న శివరాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాధి వద్ద అభిమానులకు అన్నదానం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. పునీత్ తమ్ముడు కాదు, కొడుకు వంటివాడు. కొడుకు పోయాడు అని కన్నీరుపెట్టారు. పునీత్ పద్మశ్రీ కాదు.. అమరశ్రీ. అందరి మనస్సులో ఉండిపోయాడు. పునీత్ ఎక్కడికీ వెళ్లలేదు అని అన్నారు. పునీత్ తండ్రికి తగిన తనయునిగా పేరు తెచ్చుకున్నారన్నారు. అభిమానులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని మనవి చేశారు. కాగా, పునీత్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీఎం బొమ్మై తెలిపారు. చదవండి: (పునీత్ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు) సతీమణి అశ్విని, కూతుళ్లు తరలివచ్చిన ప్రముఖులు సీనియర్ నటి బి.సరోజదేవి, రంగాయణ రఘు, రవిశంకర్‌గౌడ, అవినాశ్, మాళవిక, దర్శకుడు హేమంత్ రావ్, సీనియర్ నటుడు దత్తణ్ణ, సీనియర్ దర్శకుడు ఓ సాయి ప్రకాశ్, చిత్రా శెణై, భగవాన్, దొడ్డణ్ణ, ఎమ్మెల్యే రోషన్ బేగ్, దునియా విజయ్‌తో పాటు వేలాదిగా అభిమానులు పునీత్ సమాధిని దర్శించుకున్నారు. చదవండి: (పునీత్ పేరుతో పాఠశాల, ఆస్పత్రి) -
భలే భజరంగీ
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘భజరంగీ 2’. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భావన కథానాయికగా నటించారు. జయన్న ఫిలిమ్స్ బ్యానర్‌పై జయన్న, భోగేంద్ర నిర్మించారు. శివరాజ్ కుమార్ పుట్టినరోజు (జూలై 12) సందర్భంగా ఆదివారం ‘భజరంగీ–2’ టీజర్ విడుదల చేశారు. 2013లో ఘనవిజయం సాధించిన ‘భజరంగీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భజరంగీ–2’ తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ స్పందన చూసి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక–నిర్మాతలు. టీజర్‌కు వచ్చిన స్పందన గురుంచి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన స్పందనకి అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
అమీ ఆగయా
‘ది విలన్’ సినిమా కోసం బెంగళూరులో ల్యాండ్ అయ్యారు హీరోయిన్ అమీ జాక్సన్. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, సుదీప్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న కన్నడ సినిమా ‘ది విలన్’. శ్రీకాంత్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీకాంత్‌ది విలన్ రోల్ అని సమాచారం. మిథున్ చక్రవర్తికి కన్నడంలో ఇది తొలి చిత్రం. ఇటీవలే ఇద్దరు హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్‌లకు వేరు వేరుగా టీజర్స్‌ను కట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోన్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు అమీ జాక్సన్. సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
అయినా మంచి భర్తే!
భార్య కాలికి దెబ్బతగిలి హస్పిటల్లో జాయిన్ అయితే.. ఏ భర్త అయినా చూడకుండా ఉంటాడా? పోనీ.. రెండేళ్లుగా ఇంటిని పట్టించుకోకపోవడమే కాకుండా.. ఒక్క పండగని కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చేసుకోలేకపోతే.. ఆ భర్త ‘మంచివాడు’ అవుతాడా? కాదు కదా. అయినా ఇప్పుడు చెప్పబోతున్న దర్శకుడు ప్రేమ్ మాత్రం మంచివాడే. భార్యను పట్టించుకునే తీరిక అతనికి లేదు. ఫ్యామిలీతో పండగలు చేసుకునే ఖాళీ లేదు. ఎందుకలా? అంటే.. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది విలన్’ కోసం. శివరాజ్ కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. న్యూ ఇయర్ స్పెషల్‌గా టీజర్‌ను లాంచ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల వీలుపడలేదట. ఇందుకు ప్రేమ్∙సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చెప్పారాయన. ‘‘బ్యాలెన్స్ టాకీ పార్ట్‌ను, ఫోర్ సాంగ్స్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఫోర్ డిఫరెంట్ స్టూడియోస్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ కల్లా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. మల్టీస్టారర్ సినిమా కావడంతో రెండు టీజర్స్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘నా భార్య రక్షిత కాలికి గాయమైనప్పుడు నేను హస్పిటల్‌కి వెళ్లలేదు. ఇంట్లో పండగ సంబరాలు జరుపుకుని రెండేళ్లయింది. ఒక్కరోజు కూడా హాలీడే తీసుకోకుండా ‘ది విలన్’ సినిమా కోసం వర్క్ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రేమ్ మంచి భర్త అంటే ఒప్పుకుంటారు కదా. -
శాండిల్‌వుడ్‌కు లావణ్య త్రిపాఠి
నటి లావణ్య త్రిపాఠి తాజాగా శాండిల్‌వుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. ఇప్పటికే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ఉత్తరప్రదేశ్ బ్యూటీ చాలా కాలం క్రితమే కోలీవుడ్‌లో బ్రహ్మ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడంతో అమ్మడిని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు జంప్ చేసింది. అక్కడ నాగార్జున వంటి ప్రముఖ హీరోతో పాటు, నాని, శర్వానంద్, శిరీష్, నాగచైతన్య వంటి యువ హీరోలతోనూ జతకట్టే అవకాశాలను దక్కించుకుని మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. నాగచైతన్యతో రొమాన్స్ చేసిన వేడుక చూద్దాం రారండోయ్ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా మాయవన్ అనే చిత్రంతో కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యి ఆ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది. సందీప్‌కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత సీవీ.కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై నటి లావణ్య త్రిపాఠి చాలా ఆశలు పెట్టుకుంది. తాజాగా శాండిల్‌వుడ్‌లోకి రంగప్రవేశం చేసింది. అక్కడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, సుధీప్ కలిసి నటిస్తున్న దివిలన్ అనే చిత్రంలో లావణ్య నటిస్తోంది. ఆరంభంలో హిందీ సీరియళ్లలో నటించిన ప్రస్తుతం మూడు పదుల వయసుకు చేరువైతోందన్నది గమనార్హం. ఇంకా పెళ్లి ఊసెత్తకుండా నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తోంది. -
ఈసారి వర్మ ఐడియా... వీరప్పన్ జీవితం
పారే నది లాగా రోజుకో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శుక్రవారం మరో కొత్త ప్రాజెక్ట్ వివరం బయటపెట్టారు. నిన్న గాక మొన్ననే సెలైంట్ సినిమా తీయనున్నట్లు పేర్కొన్న వర్మ ఇప్పుడు ఒక నిజజీవిత కథను ఎంచుకున్నారు. పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను హతమార్చిన వ్యక్తి జీవితంపై సినిమాకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి అనుకుంటున్న పేరు - ‘కిల్లింగ్ వీరప్పన్’. విశేషం ఏమిటంటే, ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్ (కన్నడ సూపర్‌స్టార్ స్వర్గీయ రాజ్‌కుమార్ కుమారుడు) అందులో వీరప్పన్‌ను కడతేర్చిన వ్యక్తిగా కనిపించనున్నారు. వీరప్పన్ మీద కాక, వీరప్పన్‌ను చంపిన వ్యక్తి మీద సినిమా ఏమిటని అనుకొనేవారికి, వర్మ తనదైన వివరణ కూడా ఇచ్చారు. ‘‘వీరప్పన్ మీద సినిమా తీయాలని ఎన్నో ఏళ్ళుగా నా కోరిక. ఎట్టకేలకు నాకు సరైన స్క్రిప్టు లభించింది. ప్రపంచంలోనే అరుదైన నేర చరిత్ర అతనిది. అమెరికా, చైనాలలో కూడా అతనికి దీటైన నేరస్థుడు మరొకరు లేరు. వీరప్పన్ వాస్తవ కథ కోసం అత్యంత రహస్యవర్గాల నుంచి సమాచారం సేకరించా. నేరసామ్రాజ్య నేత దావూద్ ఇబ్రహీమ్ కన్నా వంద రెట్ల నాటకీయ వీరప్పన్ జీవితంలో ఉంది. మూడు రాష్ర్టప్రభుత్వాలు అతణ్ణి పట్టుకోవడానికి 15 ఏళ్ళ కాలంలో దాదాపు 600 కోట్ల పైగా ఖర్చు చేశాయి. అలాంటి వ్యక్తిని ఒకే ఒక్కడు హతమార్చాడు. ఆ వ్యక్తి మీద ఈ సినిమా ఉంటుంది’’ అని వర్మ పేర్కొన్నారు. వీరప్పన్ కథతో పోలిస్తే తాను ఇప్పటిదాకా తీసిన నేరసామ్రాజ్య చిత్రాలన్నీ చిన్నపిల్లలాట లాంటివని ఆయన అన్నారు. చిత్రం ఏమిటంటే, వీరప్పన్ అప్పట్లో కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి, ఆనక వదిలిపెట్టారు. తీరా ఇప్పుడు స్వర్గీయ రాజ్‌కుమార్ కుమారుడైన శివ్‌రాజ్ కుమారే వెండితెరపై వీరప్పన్‌ను కడతేర్చిన వ్యక్తిగా నటించడం విశేషం. ‘‘రియల్ లైఫ్‌లో కుమారుడైన ఒక వ్యక్తి, రియల్ లైఫ్ విలన్‌పై రీల్ లైఫ్‌లో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఓ ఉదాహరణ’’ అని వర్మ వ్యాఖ్యానించారు. ప్రతి పనికీ తనదైన లాజిక్ వర్మ సొంతం కదూ! -
శాండల్‌వుడ్ పిలిచింది.. వాలిపోయింది!
-
డబ్బింగ్ వద్దే వద్దు...
ముక్తకంఠంతో నినదించిన సినీ కళాకారులు డబ్బింగ్‌కు వ్యతిరేకంగా నేడు శాండిల్‌వుడ్ బంద్ సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని శాండిల్‌వుడ్ కళాకారులు నిన దించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ చిత్రాలను అనుమతించాలనే కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ చళువళి వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజ్ ఆదివారమిక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాండల్‌వుడ్‌కు చెందిన నటీ నటులు, సంగీత దర్శకులు, కొందరు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ... కన్నడిగులైన వారందరికీ కన్నడ భాషపై మమకారం ఉండాలని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ని అనుమతిస్తే ఇక్కడున్న వ ందలాది మంది నటీనటులు, కన్నడ సినీ పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది టెక్నీషియన్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. డబ్బింగ్ సంస్కృతిని కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ ఎప్పుడో వ ్యతిరేకించారని ఆయన బాటలోనే ఇప్పటి సినీ కళాకారులు నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డబ్బింగ్‌కు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా తాము వారిని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అనంతరం నటుడు రవిచంద్రన్ మాట్లాడుతూ...ఇతర చిత్రాలను నేరుగా విడుదల చేస్తుంటేనే కన్నడ చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని పేర్కొన్నారు. ఇక అలాంటి పరిస్థితుల్లో డబ్బింగ్‌కు కూడా అనుమతిస్తే కన్నడ సినీ పరిశ్రమ పూర్తిగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు కేరళలో విడుదలై అక్కడి మళయాళీ నటుల చిత్రాలను దెబ్బతీస్తున్నాయని, తమిళ చిత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో డబ్బింగ్ చేయబడి టాలీవుడ్ మార్కెట్‌పై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే తాము శాండల్‌వుడ్‌లోకి డబ్బింగ్ సంస్కృతిని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్ మాత్రమే కాక రీమేకింగ్కి కూడా వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కన్నడ చళువళి వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజు మాట్లాడుతూ... కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ విధానాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు (సోమవారం) సినీ కళాకారులు బంద్ పాటించనున్నారని తెలిపారు. నగరంలోని ఎస్బీఎం సర్కిల్ నుంచి వేలాది మంది సినీ కళాకారులు ర్యాలీగా బయలుదేరి సెంట్రల్ కాలేజ్ ఆవరణకు చేరుకొని అక్కడ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నటీ నటులు యష్, పూజాగాంధీ, రాధికా పండిట్, శృతి, హేమా చౌదరి, భారతీ విష్ణువర్ధన్, శశికుమార్, జగ్గేష్, సంగీత దర్శకులు గురుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.