shooter Abhinav Bindra
-
భారత పతాకధారిగా బింద్రా
రియో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా షూటర్ అభినవ్ బింద్రా వ్యవహరిస్తాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఒకే ఒక్క అథ్లెట్ బింద్రా. రియో తనకు ఐదో ఒలింపిక్స్. రియో ఒలింపిక్స్ తన కెరీర్లో ఆఖరి ఈవెంట్ అని, దీని తర్వాత రిటైర్ అవుతున్నట్లు బింద్రా తెలిపాడు. -
రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటికే షూటింగ్లో గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వి చండిలా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బింద్రా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఈసారితో ఐదోసారి అవుతుంది. -
ఐఓఏ తీరుపై బింద్రా ధ్వజం
న్యూఢిల్లీ: చార్జిషీట్ దాఖలైన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పట్టించుకోకపోవడాన్ని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా తప్పుపట్టాడు. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పట్టుదలతో ఉండాలని సూచించాడు. ఆదివారం జరిగిన ఐఓఏ జీబీఎంలో రెండేళ్లకు పైగా శిక్ష పడినవారినే ఎన్నికలకు దూరంగా ఉంచాలని సభ్యులు తీర్మానించిన విషయం తెలిసిందే. ‘ఇప్పటికే ఈ విషయంలో గట్టిగా ఉండాల్సిందిగా నేను ఐఓసీని అడిగాను. భారత క్రీడారంగానికి, అథ్లెట్లకు ఈ నిబంధన మేలు చేస్తుంది. ప్రత్యేక జీబీఎంకు హాజరైన ఐఓఏ సభ్యుల్లో 50 శాతం కన్నా ఎక్కువ మందిపై కోర్టులో కేసులున్న విషయం ఐఓసీ అర్థం చేసుకోవాలి. అయితే ఐఓఏ తీసుకున్న నిర్ణయం నన్ను నిరాశపరిచినా ఆశ్చర్యానికి గురి చేయలేదు. కానీ ఇంత పెద్ద దేశం ఐఓసీ నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యిందని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు చాలా మంది ఇతర దేశ అథ్లెట్లు అడిగినప్పుడు అవమానంగా అనిపిస్తుంటుంది’ అని బింద్రా పేర్కొన్నాడు.