Shop belt
-
కప్పం కట్టు... బెల్టు షాపు పెట్టు
బెల్టుషాపు నిర్వహణకు వేలంపాట రూ. 1.53లక్షలకు దక్కించుకొన్న ఆమ్మకం దారుడు చక్రం తిప్పుతున్న టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి కె.కోటపాడు మండలం సూదివలసలో బాగోతం ఇదీ ‘గ్రామంలో బెల్టు షాపు కేటాయించేందుకు వేలంపాట నిర్వహిస్తున్నారహో!... ఆసక్తి ఉన్న వారు పాటలో పాల్గొనండి. ఎక్కువ మొత్తానికి పాడినవారు ఏడాదిపాటు దర్జాగా నడుపుకోవచ్చహో!’ ఇదీ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. అదేమిటీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు కదా అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఎన్నికలు అయిపోయాయి కదా. ఇప్పుడు హామీలతో పనేమిటని టీడీపీ నేతలు భావిస్తున్నట్టున్నారు. బరితెగించేసి బెల్టు షాపుల ఏర్పాటుకు గ్రామాల్లో దండోరా వేసి మరీ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ని లుస్తున్న కె.కోటపాటు మండలం సూదివలసలో ప్రస్తుత పరిస్థితి ఇదీ... కె.కోటపాడు: మండలంలోని సూదివలసలో ఓ స్థానిక ప్రజాప్రతినిధికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది. ప్రభుత్వం మద్యం దుకాణాలను టెండర్లు పిలుస్తోంది కదా! తాను బెల్టు షాపునకు ఎందుకు అలా చేయకూడదు అని భావించారు. అధికారిక మద్యం దుకాణానికి అయితే ప్రభుత్వానికి డిపాజిట్టు చెల్లిస్తారు. అదే బెల్టు షాపునకు అయితే తనకు కప్పం కడతారు కదా అని ఆశించారు. అనిపించిందే తడవుగా గ్రామంలో బెల్టు షాపు కేటాయింపునకు వేలం కోసం గ్రామంలో దండోరా వేయించారు. ఆసక్తి ఉన్నవారు వేలం పాటలో పాల్గొనవచ్చని చాటించారు. అనుకున్న విధంగానే ఈ నెల 16న గ్రామంలోని రచ్చబండ సాక్షిగా వేలంపాటను నిర్వహించారు. పదిమందికిపైగా పాల్గొన్న ఆ బహిరంగ వేలంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి రూ.1,50,500కు పాటపాడుకున్నారు. ఆ మొత్తాన్ని ఈ నెల 21న చెల్లించాలని ఆ ప్రజాప్రతినిధి గడువు విధించారు. అప్పటి నుంచి బెల్టు షాపు యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చని... ఎక్సైజ్ అధికారులు ఇతరత్రా ఇబ్బందులు లేకుండా తాను చూసుకుంటానని గ్రామస్తుల సమక్షంలోనే భరోసా ఇచ్చేశారు. దాంతో అధిక మొత్తానికి వేలం పాడిన వ్యక్తి గ్రామంలో ఉన్న ఓ చిన్న పాకలో బెల్టు షాపు నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం నుంచి ఇది అనధికారికంగా తెరుచుకోనుంది. ఆందోళనలో గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధి నిర్వాకంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాన్ని తన సొంత జాగీరుగా భావించి తన కమీషన్ కక్కుర్తి కోసం బెల్టు షాపు చిచ్చు పెట్టడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని తన వద్ద ప్రస్తావించిన వారిపై ఆ ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన మాట ప్రకారమే అంతా జరుగుతుందని ఇష్టం లేని వాళ్లు గ్రామం విడిచిపోవాలని ఆయన హెచ్చరిస్తుండటం గమనార్హం. దాంతో గ్రామస్తులకు పాలు పోవడం లేదు. బెల్టు షాపు వల్ల కుటుంబాలలో తగాదాలు ఏర్పడతాయని, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ మహిళలు వాపోతున్నారు. గ్రామంలో బెల్ట్ షాపు లేకుండా ఎక్సైజ్ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సర్పంచ్ యాళ్ల సింహాచలం నాయుడు వద్ద ప్రస్తావించగా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. బెల్టు షాపులు ఎప్పుడూ ఉన్నవే కదా అని చెబుతూనే ఈ నెల 16న తాము తీర్థం నిర్వహణ కోసమే సమావేశమయ్యామని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించగా బెల్ట్ షాపు వేలంపాట విషయం తనకు తెలియదన్నారు. -
ఎక్కడా బెల్టుషాపులే ఉండరాదు
చిత్తూరు (సెంట్రల్) : జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు ఉండరాదని, దీనిపై అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బెల్టుషాపులు, నాటుసారా, బయట రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అక్రమ మద్యం గురించి సమగ్రంగా చర్చించారు. బెల్టుషాపులను ప్రోత్సహించే మద్యంషాపుల డీలర్ల లెసైన్సులను రద్దు చేయాలని, బెల్టుషాపులు నిర్వహించే వారిపై ప్రస్తుతం నమోదు చేస్తున్న కేసులు చాలవని తెలిపారు. వీరిపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. బెల్టుషాపులు నిర్వహించకుండా గ్రామస్థాయి మహిళా కమిటీలను చైతన్యం చేయాలని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. నిత్యం గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించాలని, బయట రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై నిఘా పెంచాలని, నాటుసారా అరికట్టేందుకు ఆయా ప్రాంతాలపై అనుమానిత మెరుపుదాడులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా, డీఆర్వో శేషయ్య, తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ చంద్రానాయక్, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -

మళ్లీ అదే మోసం...
మద్యం బెల్టు షాపులకు తలుపులు తెరిచిన నాటి సీఎం నారా చంద్రబాబునాయుుడు ఇప్పుడు ఆ బెల్టు షాపుల్ని ఎత్తివేస్తావుని హామీలిచ్చి వురోసారి వుహిళల్ని మోసం చేయుబోతున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వుద్య నిషేధ సవుయుంలో అక్రవు వుద్యం వ్యాపారం చేసిన తెలుగుదేశం నాయుకుల్ని పార్టీ నుంచి వెలివేయూలి. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వూర్చేస్తావుంటున్న బాబు.. వుద్యానికి బానిసలై వురణించడంతో వారి భార్యలు వితంతువులుగా వూరడంపై ఏం జవాబు చెబుతారు? వారికి జీవి తాలు ఏంకావాలి? మద్యానికి దాసులవ్వడంతో చాలా వుంది వుధ్యవయుసులోనే చనిపోతున్నారు. ప్రజల జీవితాలు, ఆరోగ్యంపై దెబ్బతీయుడం దారుణం. వుద్యం వూఫియూను శిక్షించే ప్రయుత్నాలు చంద్రబాబు ఏనాడూ చేయులేదు. అక్రవు వుద్యం ఏరులై పారుతోందని చెప్పి.. ఎన్నికల హామీని తుంగలోకి తొక్కి.. వుద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబుకు బెల్టు షాపులపై వివుర్శ చేసే అర్హత కూడా లేదు. - పశ్య పద్మ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం