చిత్తూరు (సెంట్రల్) : జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు ఉండరాదని, దీనిపై అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బెల్టుషాపులు, నాటుసారా, బయట రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అక్రమ మద్యం గురించి సమగ్రంగా చర్చించారు.
బెల్టుషాపులను ప్రోత్సహించే మద్యంషాపుల డీలర్ల లెసైన్సులను రద్దు చేయాలని, బెల్టుషాపులు నిర్వహించే వారిపై ప్రస్తుతం నమోదు చేస్తున్న కేసులు చాలవని తెలిపారు. వీరిపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. బెల్టుషాపులు నిర్వహించకుండా గ్రామస్థాయి మహిళా కమిటీలను చైతన్యం చేయాలని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు.
నిత్యం గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించాలని, బయట రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై నిఘా పెంచాలని, నాటుసారా అరికట్టేందుకు ఆయా ప్రాంతాలపై అనుమానిత మెరుపుదాడులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా, డీఆర్వో శేషయ్య, తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ చంద్రానాయక్, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడా బెల్టుషాపులే ఉండరాదు
Published Sat, Aug 9 2014 3:56 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement