- డీఐపీసీలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఔత్సాహికుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సి ద్ధార్థ్‌జైన్ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన డీఐపీసీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కో సం వచ్చిన దరఖాస్తులు, రహదారులు భవనాలశాఖ అధికారులు ప్రతిపాదిం చిన గ్రోత్‌కారిడార్‌పై చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సమావేశం తరువాత వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 19 పెండింగ్‌లో ఉన్నాయని, వీటి ని సంబంధిత అధికారులు వెంటనే క్లియర్ చేసి పరిశ్రమల స్థాపనకు కృషి చే యాలన్నారు. అలాగే రహదారులు, భ వనాలశాఖ అధికారులు రూ.61 కోట్ల అంచనాలతో రూపొందించిన గ్రోత్‌కారి డార్‌తో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ప్రధానంగా శ్రీసిటీ నుం చి సత్యవేడు అక్కడ నుంచి పుత్తూరు మీదుగా చిత్తూరు వరకు ఉన్న రోడ్డును విస్తరిస్తారన్నారు. దీంతో పరిశ్రమలు వి స్తరించే అవకాశముంటుందన్నారు.
అ లాగే మన్నవరం పారిశ్రామికవాడ (వాంపల్లె) నుంచి శ్రీకాళహస్తి, వాంపల్లె నుంచి ఏర్పేడు వరకు శ్రీకాళహస్తి టూ తడా, బీఎన్ కండ్రిగ నుంచి సూళూరుపేట ఈ నాలుగు రోడ్లను పూర్తి స్థాయి లో విస్తరించడం వలన పరిశ్రమలు ఏర్పడుతాయని, వీటికి చెన్నై , బెంగళూ రు తదితర నగరాలతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనలను ఆర్‌అండ్‌బీ ఇప్పటికే ప్రభుత్వానికి పం పిందని, వీటిని త్వరగా ఆమోదించాల ని ప్రభుత్వానికి డీఐపీసీ ద్వారా తీర్మా నం చేసి పంపాలని సూచించారు. జి ల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగేశ్వరరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, డీపీవో ప్రభాకర్‌రావు, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.