siddharthjain
-
పారిశ్రామిక అనుమతులు త్వరగా మంజూరు చేయాలి
డీఐపీసీలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఔత్సాహికుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సి ద్ధార్థ్జైన్ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన డీఐపీసీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కో సం వచ్చిన దరఖాస్తులు, రహదారులు భవనాలశాఖ అధికారులు ప్రతిపాదిం చిన గ్రోత్కారిడార్పై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సమావేశం తరువాత వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 19 పెండింగ్‌లో ఉన్నాయని, వీటి ని సంబంధిత అధికారులు వెంటనే క్లియర్ చేసి పరిశ్రమల స్థాపనకు కృషి చే యాలన్నారు. అలాగే రహదారులు, భ వనాలశాఖ అధికారులు రూ.61 కోట్ల అంచనాలతో రూపొందించిన గ్రోత్కారి డార్‌తో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ప్రధానంగా శ్రీసిటీ నుం చి సత్యవేడు అక్కడ నుంచి పుత్తూరు మీదుగా చిత్తూరు వరకు ఉన్న రోడ్డును విస్తరిస్తారన్నారు. దీంతో పరిశ్రమలు వి స్తరించే అవకాశముంటుందన్నారు. అ లాగే మన్నవరం పారిశ్రామికవాడ (వాంపల్లె) నుంచి శ్రీకాళహస్తి, వాంపల్లె నుంచి ఏర్పేడు వరకు శ్రీకాళహస్తి టూ తడా, బీఎన్ కండ్రిగ నుంచి సూళూరుపేట ఈ నాలుగు రోడ్లను పూర్తి స్థాయి లో విస్తరించడం వలన పరిశ్రమలు ఏర్పడుతాయని, వీటికి చెన్నై , బెంగళూ రు తదితర నగరాలతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనలను ఆర్అండ్బీ ఇప్పటికే ప్రభుత్వానికి పం పిందని, వీటిని త్వరగా ఆమోదించాల ని ప్రభుత్వానికి డీఐపీసీ ద్వారా తీర్మా నం చేసి పంపాలని సూచించారు. జి ల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగేశ్వరరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, డీపీవో ప్రభాకర్‌రావు, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాలులేని కుటుంబాలను గుర్తించండి
చిత్తూరు (సెంట్రల్): మండల స్థాయిలో ఈ నెల 15వ తేదీ నుంచి జేఎంఎల్‌బీసీ సమావేశాలను నిర్వహించి బ్యాంకు ఖాతాలు ప్రారంభించని కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరంలో నిర్వహించిన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. మిషన్మోడ్ కింద సమగ్ర ఆర్థిక చేకూర్పును అమలు చేసే దిశగా బ్యాంకర్లు గ్రామస్థాయిలో క్యాంపులు పెట్టి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలన్నారు. బ్రాంచ్ మేనేజర్లు మండలి స్థాయిలో ఎంపీడీఓల సమన్వయంతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 15వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కొత్త బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటుచేసి ఆర్థిక చేకూర్పుకు సహకరించాలన్నారు. ప్రభుత్వపథకాల్లో భాగంగా 2014-15 సంవత్సరానికి మెప్మా ద్వారా రూ.125 కోట్లు, రాజీవ్ యువశక్తి కింద రూ.6 కోట్లు ఆర్థిక చేకూర్పు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 164లో రైతు కుటుంబానికి పంట రుణాలు, వ్యవసాయానికి బంగారు రుణాలను రూ.1.5లక్షల వరకు, డ్వాక్రా గ్రూపులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులు వేరుశెనగ పంటకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సుధాకరరావు, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ కిషన్‌ప్రసాద్, ఆర్బీఐ ఏజీఎం కులకర్ని, ఎస్బీఐ ఏజీఎం బ్రహ్మం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎక్కడా బెల్టుషాపులే ఉండరాదు
చిత్తూరు (సెంట్రల్) : జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు ఉండరాదని, దీనిపై అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బెల్టుషాపులు, నాటుసారా, బయట రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అక్రమ మద్యం గురించి సమగ్రంగా చర్చించారు. బెల్టుషాపులను ప్రోత్సహించే మద్యంషాపుల డీలర్ల లెసైన్సులను రద్దు చేయాలని, బెల్టుషాపులు నిర్వహించే వారిపై ప్రస్తుతం నమోదు చేస్తున్న కేసులు చాలవని తెలిపారు. వీరిపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. బెల్టుషాపులు నిర్వహించకుండా గ్రామస్థాయి మహిళా కమిటీలను చైతన్యం చేయాలని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. నిత్యం గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించాలని, బయట రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై నిఘా పెంచాలని, నాటుసారా అరికట్టేందుకు ఆయా ప్రాంతాలపై అనుమానిత మెరుపుదాడులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా, డీఆర్వో శేషయ్య, తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ చంద్రానాయక్, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడా బెల్టుషాపులే ఉండరాదు
చిత్తూరు (సెంట్రల్) : జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు ఉండరాదని, దీనిపై అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బెల్టుషాపులు, నాటుసారా, బయట రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అక్రమ మద్యం గురించి సమగ్రంగా చర్చించారు. బెల్టుషాపులను ప్రోత్సహించే మద్యంషాపుల డీలర్ల లెసైన్సులను రద్దు చేయాలని, బెల్టుషాపులు నిర్వహించే వారిపై ప్రస్తుతం నమోదు చేస్తున్న కేసులు చాలవని తెలిపారు. వీరిపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. బెల్టుషాపులు నిర్వహించకుండా గ్రామస్థాయి మహిళా కమిటీలను చైతన్యం చేయాలని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. నిత్యం గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించాలని, బయట రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యంపై నిఘా పెంచాలని, నాటుసారా అరికట్టేందుకు ఆయా ప్రాంతాలపై అనుమానిత మెరుపుదాడులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా, డీఆర్వో శేషయ్య, తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ చంద్రానాయక్, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.