గసాల సాగుపై ఎక్సైజ్ దాడులు
పుంగునూరు: చిత్తూరు జిల్లాలో అక్రమంగా సాగు చేస్తున్న గసగసాల పంటలపై మంగళ వారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చౌడేపల్లి మండలం బోయకుండ గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి ఆగుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రైతులు, వ్యాపారులు కూడా ఉన్నారు. జిల్లాలోని సోమల, చౌడేపల్లి, పుంగనూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో పంట సాగవుతోందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ పంట సాగుకు అనుమతి లేదని వారు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది మంగళవారం ఉదయం దాడులు చేశారు. కాగా గసాల సాగుకు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే అనుమతి ఉన్నట్టు తెలుస్తోంది.