short surcuit
-
ఆ ఊరికి షాక్ కొట్టింది!
సాక్షి, ప్రకాశం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జిల్లాలోని ఓ ఊరిలో దాదాపు 80 కుటుంబాల ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నగర పంచాయతీ 16వార్డు పామురుపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామంలోని 80 కుటుంబాలకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం అయ్యాయి. ప్రతి ఇంట్లో ఫ్యాన్, ఫ్రిజ్, టీవీ, సెల్ ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బార్లో అగ్ని ప్రమాదం; ఐదుగురి మృతి
సాక్షి, బెంగళూరు: ముంబైలో పబ్‌లో అగ్నిప్రమాదం జరిగి 14 మంది మృతి చెంది పదిరోజులైనా కాకముందే మరో మహానగరంలోనూ బార్ అండ్ రెస్టారెంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు కలాసిపాళ్యలోని కైలాస్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం తెల్లవారుజామున చెలరేగిన మంటల కారణంగా అందులో పనిచేసే ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతులను తుమకూరుకు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హాసన్‌కు చెందిన మంజునాథ్, మండ్యకు చెందిన కీర్తిగా గుర్తించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ఇరుకైన ద్వారంతో ఈ బార్ ఉంది. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా అక్కడే నిద్రిస్తున్న ఐదుగురు బయటకు వెళ్లలేక బాత్రూమ్లో దాక్కున్నారు. పొగకు ఊపిరాడక వారంతా ప్రాణాలు విడిచినట్లుగా భావిస్తున్నామనీ, పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదం జరిగిన వెంటనే బార్ యజమాని వీఆర్ దయాశంకర్‌ను అరెస్టు చేశారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో నిలిచిన గరీబ్‌రథ్
విశాఖపట్టణం: వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో బుధవారం ఉదయం నిలిచిపోయింది. జీ-11 బోగీపైన ఉండే రేకు ఒకటి కరెంట్ లైనుకు తాకటంతో షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రైలు ఆగిపోయినట్లు సమాచారం. ఆ బోగీపై స్వల్పంగా మంటలు రేగటంతో భయపడిన ప్రయాణికులు కిందికి దిగిపోయారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.