సాక్షి, ప్రకాశం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జిల్లాలోని ఓ ఊరిలో దాదాపు 80 కుటుంబాల ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నగర పంచాయతీ 16వార్డు పామురుపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామంలోని 80 కుటుంబాలకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం అయ్యాయి. ప్రతి ఇంట్లో ఫ్యాన్, ఫ్రిజ్, టీవీ, సెల్ ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment