శ్రీ సుయతీంద్ర తీర్థులు కన్నుమూత
మంత్రాలయం : ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థులు కన్నుముశారు. కొంత కాలంగా మూత్రపిండాలు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన గత 15 రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. సుయతీంద్ర తీర్ధులకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ సుయతీంద్ర తీర్థులు మంత్రాలయం రాఘవేంద్ర మఠానికి 39వ పీఠాధిపతి.
కర్ణాటకలోని గదగ్ జిల్లా పేటే ఆలూరులో అనంతాచార్య-యమునాబాయి దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు సుశీలేంద్రాచార్. బీఏ, బీఈడీ పూర్తి చేసిన ఆయన... బెంగళూరులోని భారతీయ సంస్కృతి విద్యాపీఠంలో విశేష సేవలందించారు. 2006లో సుశమీంద్ర తీర్థుల ఆధ్వర్యంలో సన్యాసం స్వీకరించి రాఘవేంద్రస్వామి మఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. 2009లో మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అటు... సుయతీంద్ర తీర్థుల మరణవార్తతో మంత్రాలయం మౌన రోదనలో మునిగిపోయింది. గ్రామ ప్రజలు, భక్తులు అశ్రు నివాళి అర్పిస్తున్నారు.