Shrikant Sharma
-
‘అసెంబ్లీలో ఎమ్మెల్యేల విజిల్స్’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించాయని మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున విపక్ష ఎమ్మెల్యేలు ప్రవరించిన తీరు నిరాశ కలిగించిందని మంత్రి శ్రీకాంత్ శర్మ అన్నారు. గవర్నర్ రామ్ నాయక్ ప్రసంగిస్తుండగా ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు గందరగోళం సృష్టించారు. గవర్నర్‌పైకి పేపర్లు విసిరి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ‘సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన అవమానకరంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు నిర్విరామంగా ఈలలు వేశారు. విపక్ష సభ్యుల వైఖరి యూపీ ప్రజలను అవమానించేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఆధ్వరంలో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడం అత్యంత దురదృష్టకరం. సోషలిస్ట్ సిద్ధాంతకర్త రామ్మనోహర్ లోహియా బతికివుంటే అసెంబ్లీలో ఈరోజు ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు చూసి కన్నీళ్లు పెట్టుకునివుండేవార’ని శ్రీకాంత్ శర్మ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఈవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. విపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గబోదని స్పష్టం చేశారు. -
మంత్రులకు కొత్త సీఎం 15 రోజుల గడువు
లక్నో: కాన్షీరాం స్మృతి ఉప్వన్లో ఆదివారం యూపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మంత్రులకు కొన్ని విషయాలను ఉపదేశించారు. ఆ విషయాలను యూపీ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ లక్నోలో మీడియా సమావేశంలో వెల్లడించారు. యూపీ రాష్ట్ర మంత్రులందరూ తమకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించినట్లు చెప్పారు. కేవలం 15 రోజులు గడువులోగా సీఎం కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులలో ఎవరికైనా మంత్రులు తమ ఆస్తుల పూర్తి సమాచారాన్ని అందించాలని సీఎం సూచించినట్లు శ్రీకాంత్ శర్మ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిన వెంటనే వేడుకలు, ఆర్భాటాలు చేస్తూ ఎవరికీ ఇబ్బంది కలిగించ వద్దని తన మద్దతుదారులను హెచ్చరించిన యోగి.. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత.. అనవసర వ్యాఖ్యలు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిదని కేబినెట్ మంత్రులకు సూచించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా నడుచుకోవద్దని, అది ఎవరికీ మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ వివరించారు. కొత్త సీఎం యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే. -
‘ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు’
-
‘ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు’
లక్నో: ఉత్తరప్రదేశ్ లో వందశాతం గెలుపు తమదేనని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు రాంగోపాల్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా వార్తా చానళ్లు కొద్ది రోజుల క్రితమే ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను మార్చినట్టు తమ దగ్గర సమాచారం ఉందని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ తో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని బీజేపీ నాయకుడు శ్రీకాంత్ శర్మ ప్రశ్నించారు. అవసరమైతే బీఎస్పీతో చేతులు కలుపుతామని సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించడం వెనుక ఒత్తిడి ఉందని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా తమ కూటమే విజయం సాధిస్తుందని ఎస్పీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.