shrirampur
-
సమ్మె సైరన్
సింగరేణిలో 6 నుంచి 10 వరకు జాతీయ కార్మిక సంఘాల పిలుపు సమ్మెకు గుర్తింపు సంఘం దూరం శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు సమ్మెలో పాల్గొనాలని జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూ సీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ పిలుపునిచ్చా రు. ఈ మేరకు సింగరేణిలో కార్మికులను సన్నద్ధం చేస్తున్నాయి. మూడు నెలల క్రితం సుప్ట్రీం కోర్టు రద్దు చేసిన 214 బొగ్గు బ్లాకులకు కేంద్రం ఈ వేలం ద్వారా విక్ర యిం చేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడంతో జాతీయ సం ఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ప లు మార్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో వర్కర్‌టూ రూల్‌కు పిలుపునివ్వగా కేంద్రం ప్రభుత్వ చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిచగా వాయిదా వేశా యి. మళ్లీ నవంబర్ 14న సమ్మె పిలుపువ్వగా కేంద్ర బొ గ్గు మంత్రిత్వ శాఖ జాతీయ సంఘాలతో చర్చలు జరి పిన తరువాతే ముందుకు పోతామని అప్పటి దాక బొగ్గుబ్లాకుల జోలికి వెళ్లమని చెప్పడంతో సమ్మెను వాయిదా వేశాయి. ఉన్నట్టుండి ఆర్డినెన్స్ తేవడంపై జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఉత్పత్తిపై ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి ఉత్పత్తి లక్ష్యం 55 మిలి యన్ టన్నులు. ఇంకా మూడు నెలల సమయమే మిగిలి ఉంది. డిసెంబర్ 31 నాటికి 4 మిలియన్ టన్నుల లోటు ఉంది. దీనిని భర్తీ చేసుకుంటే మిగిలి ఉన్న లక్ష్యం పూర్తి చేయాలి. ఈ కీలక సమయంలో సమ్మె పిలుపు రావడం తో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. మరో పక్క రాష్ట్రంలో విద్యుత్ సమస్య అధికంగా ఉన్న దృష్ట్యా థ ర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు డిమాండ్ అధికంగా ఉంది. సమ్మె జరిగితే రోజుకు కంపెనీ 2 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి నష్టపోవాల్సి వస్తుంది. దీంతో మరింత లోటు ఏర్పడి వార్షిక లక్ష్యం చేరుకోవడం మరింత ఇబ్బం దిగా మారుతుంది. ఈ క్రమంలో కార్మికులు సమ్మె వైపు వెళ్లకుండా అమసరమైన చర్యలు చేపట్టడానికి యాజమాన్యం ఉపక్రమించింది. సమ్మె వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ విస్తృత ప్రచారం చేయడానికి నిర్ణయించింది. గుర్తింపు సంఘం వ్యతిరేకం సమ్మెను గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తోంది. సమ్మెలో కార్మికులు పాల్గొనవద్దని ఆ యూనియన్ నేత లు ప్రకటించారు. కార్మికులను విధుల్లోకి దించాలన్నా, వద్దనాలన్నా గుర్తింపు సంఘం ఎంతో ప్రభావితం చే స్తుంది. బొగ్గు బ్లాకులపై ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత సమ్మెకు పిలుపునివ్వడం ఎంత వరకు సమంజసమని టీ బీజీకేఎస్ నేతలు అంటున్నారు. నవంబర్ 24న సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు తాము మద్దతిచ్చామని, సమ్మె అర్ధంతరంగా విరమించినప్పుడు ఎందుకు విరమించారో కార్మికులకు గానీ, లేదా మాకు గానీ కనీసం స మాచారం ఇవ్వలేదని పేర్కొంటున్నారు. కార్మికుల డి మాండ్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పం దిస్తూనే ఉందని, సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తికి నష్టం చేసి విద్యుత్ సమస్యను పెంచడం మంచిది కాదంటున్నారు. ప్రధాన డిమాండ్లు సుప్రీం కోర్టు రద్దు చేసిన 214 కోల్‌బ్లాక్‌ను కోల్ఇండియా లేదా సింగరేణికి కేటాయించాలి. సింగరేణి కార్మికులకు పెన్షన్ 40 శాతానికి పెంచాలి. సీలింగ్ ఎత్తివేయాలని. వీఆర్ఎస్ డిపెండెంట్లకు, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలి. వీటితోపాటునోటీసులో మొత్తం 17 డిమాండ్లు ఉన్నాయి. ఎన్టీపీసీ ఉద్యోగుల మద్దతు సమ్మెకు ఎన్టీపీసీ ఉద్యోగుల మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా ఎలక్ట్రికల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాబర్‌సలీంపాషా చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాబర్సలీంపాషాను ఆదివారం ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వెంకట్రావ్ పరామర్శించారు. అనంతరం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని తన నివాసంలో పాషా మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థకు బొగ్గు గని కార్మికులతో ఎనలేని సంబంధాలు ఉన్నాయని, గని కార్మికుల సమ్మెకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మద్దతు తెలుపనున్నామని తెలిపారు. విజయవంతం చేయాలి శ్రీరాంపూర్/జ్యోతినగర్/రుద్రంపూర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, బొగ్గుగనుల ప్రవేటీకరణకు నిరసనగా, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న బొగ్గుగని కార్మికుల సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లపల్లి రీజియన్ శ్రీరాంపూర్, రామగుండం రీజియన్ జ్యోతినగర్, కొత్తగూడెం రీజియన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో నాయకులు సమ్మెకు దారితీసిన కారణాలను వివరించారు. కేంద్రం ప్రభుత్వం చర్చల పేరుతో మోసం చేసి నేడు బొగ్గు బ్లాకులపై అర్ధంతరంగా ఆర్డినెన్స్ తెచ్చిందని ధ్వజమెత్తారు. కోల్ఇండియాలో ఇప్పటికే 10 శాతం వాటాలు ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి పోయాయని, మరో 11 శాతం డిసిన్వెస్ట్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఐదు రోజుల ఈ సమ్మెకు కోల్ఇండియాలో అధికారుల సంఘమైన సీఎంఓఏఐ మద్దతిచ్చిందని, సింగరేణిలోని అధికారుల సంఘం కూడా మద్దతు తెలపాలని కోరారు. శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, కొత్తగూడెంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దమ్మలపాటి శేషయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లట్టి జగన్మోహన్రావు, సీఐటీయూ నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వర్లు, జ్యోతినగర్‌లో ఐఎన్టీయూసీ ఆర్జీ-1ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి, నడిపెల్లి అభిశేక్రావు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు ఉత్పత్తికి వర్షం దెబ్బ
శ్రీరాంపూర్ : జిల్లాలో శనివారం కురిసిన వర్షంతో బొగ్గు ఉత్పత్తి తీవ్ర విఘాతం కలిగింది. రోజంతా కురిసిన వర్షం వల్ల బెల్లంపల్లి రీజియన్‌లోని మూడు డివిజన్లలో గల 4 ఓసీపీల్లో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రే క్ పడింది. టన్నుబొగ్గు ధర సుమారు రూ.2 వేల చొప్పున లెక్కేసినా సింగరేణికి సుమారు రూ.మూడున్నర కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్వారీలో మైనింగ్ ఆపరేషన్స్‌ను పూర్తిగా నిలిపివేశారు. టిప్పర్లను, డంపర్లను క్వారీ నుంచి ఉపరితలానికి తరలించారు. క్వారీలో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అధిక సామర్థ్యం గల పంపులతో బయటికి తోడేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓసీపీల్లో ఓబీ పనులు చేసే కాం ట్రాక్టర్లు కూడా పనులు పూర్తిగా నిలిపివేశారు. అన్ని ఓసీపీల్లో ఓవర్ బర్డెన్ మట్టి పనులు ఆగిపోయాయి. అయితే భూగర్భ గనుల్లో ఉత్పత్తికి ఎలాంటి ఆటకం లేదు. ఇదీ పరిస్థితి బెల్లంపల్లి డివిజన్ పరిదిలో మూడు ఓసీపీలు ఉన్నాయి. డొర్లి 1, డొర్లి 2, కైరీగూడ ఉండగా ఇందులో డొర్లి 2లో ఓబీ సమస్యతో కొంత కాలంగా పనులు ఆపేశారు. మిగిలి రెండు ఓసీపీలను పరిశీలిస్తే డొర్లి 1 ఓసీపీ నెలవారి ఉత్పత్తి లక్ష్యం 1.18 లక్షల టన్నులుగా ఉంది. రోజు వారిగా రావాల్సిన 4 వేల టన్నుల బొగ్గు వర్షంతో పూర్తిగా ఆగిపోయింది. కైరిగూడ ఓపీపీలో నెలవారి ఉత్పత్తి లక్ష్యం 1.75 లక్షల టన్నులుగా ఉంది. దీంతో రోజు వారిగా సాధించాల్సిన 5500 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఇక మందమర్రి ఏరియాలో ఉన్న ఏకై క ఆర్కేపీ ఓసీపీ 1లో రోజు వారీ ఉత్పత్తి 2,500 టన్నులు పూర్తిగా నష్టపోయింది. శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. నెలవారీ ఉత్పత్తి లక్ష్యం 1.8 లక్షల టన్నులు కాగా వర్షంతో రోజు వారీగా ఉత్పత్తి చేయాల్సిన 6 వేల టన్నులకు బ్రేక్ పడింది. దీంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఈ నాలుగు ఓసీపీల్లో కలిపి మొత్తం 18 వేల టన్నుల బొగ్గు వర్షంతో ఉత్పత్తి రాకుండా పోయింది. దీంతో సుమారు రూ.3.6 కోట్ల నష్టం కంపెనీకి వాటిల్లింది. కాగా, ఉపరితలంలో స్టాక్ చేసిన బొగ్గును తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా వర్షం పూర్తిగా తగ్గి కనీసం 3 గంటల పొడి వాతవరణం ఉంటేనే ఓసీల్లో ఉత్పత్తి పునరుద్ధరణ సాధ్యమవుతుందరి అధికారులు పేర్కొంటున్నారు. -
మట్టి దందా
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: సింగరేణిలో మట్టి బంగారమవుతోంది.. అక్రమంగా మట్టి దందా చేసే వారికి కాసులు కురిపిస్తోంది. ఫలితంగా సింగరేణికి కోట్లలో నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వ గనులు, భూగర్భ శాఖ నిబంధనలను విరుద్ధంగా సింగరేణి అధికారులు ఓసీపీ మట్టిని బయటికి తీసుకుపోవడానికి అనుమతి ఇస్తున్నారు. కంపెనీ అధికారులకు అధికారం లేకున్నా అనుమతి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో భవిష్యత్తులో బ్యాక్ఫిల్లింగ్కు పనికి వచ్చే కోట్ల రూపాయల మట్టి బయటికి తరలిపోతోంది. కంపెనీ అధికారుల నిర్వాహకం వల్లే ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. వ్యాపార కేంద్రంగా శ్రీరాంపూర్ ఓసీ శ్రీరాంపూర్‌లో ఉన్న ఏకైక ఓపెన్‌కాస్టు గని మట్టి వ్యాపారానికి కేంద్రంగా మారింది. నిత్యం వందలాది లారీల మట్టి బయటికి వెళ్తోంది. ఓపెన్ కాస్టులో బొగ్గును తీయడానికి ముందు పైన ఉన్న మట్టిని తొలగిస్తారు. ఈ మట్టి తీయడానికి ప్రత్యేక ఓబీ కాంట్రాక్టర్ ఉంటాడు. ఓసీపీలో మట్టి ఎంత వచ్చిన దాన్ని దాచి బొగ్గు నిల్వలు అయిపోయాక ఏర్పడ్డ ఖాళీల్లో నింపాలి. దీన్నె బ్యాక్‌ఫిల్లింగ్ అంటారు. ఇది ప్రభుత్వ నిబంధన. అయితే అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. బయటి వ్యక్తులు కూడా మట్టిని తీసుకుపోవడానికి అనుమతి ఇస్తున్నారు. దీంతో మంచిర్యాల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగరేణి మట్టి వ్యాపారం జోరుగు సాగుతోంది. మట్టి వ్యాపారం చేసే కాంట్రాక్టర్లు ఓపెన్ కాస్టు భూనిర్వాసితులను ముందు పెట్టి వారి ఇంటి అవసరాలకు, ఇతర అవసరాలకని జీఎం లేదా ఓసీపీ ప్రాజెక్ట్ అధికారికి దరఖాస్తు చేస్తున్నారు. వారు అడిగిందే తడవుగా అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో మట్టిని కాంట్రాక్టర్లు ఇళ్ల, భవన నిర్మాణాలకు, భూముల ఫ్లాటింగ్ అవసరాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో లారీ టిప్పు సుమారు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోంది. నిత్యం వందలాది లారీలు గోదాముల నిర్మాణానికి.. ఎస్సార్పీ1 గనికి, ఊరు శ్రీరాంపూర్‌కు మధ్య కరీంనగర్‌కు చెందిన ఓ బడా కాంట్రాక్టరు ధాన్యం గోదాములు నిర్మిస్తున్నాడు. కోట్ల విలువైన ఈ గోదాముల నిర్మాణంలో బేస్మెంట్, లోతుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడం కోసం ఓసీపీ మట్టిని వినియోగిస్తున్నారు. నిత్యం వందలాది లారీలు ఇక్కడికి మట్టి చేరవేస్తున్నాయి. అంతే కాకుండా సింగరేణి షేల్ (బొగ్గుతో వచ్చే వ్యర్థ పదార్థం) కూడా సరఫరా అవుతున్నది. ఓ కోల్ ట్రాన్సుపోర్టు కాంట్రాక్టరు, మరో వ్యక్తికి వీటిని తీసుకుపోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. సింగరేణి అధికారులకు అర్హత లే కున్నా.. ఇదిలా ఉంటే మట్టిని కంపెనీ బయటికి తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వడానికి సింగరేణి అధికారులకు ఎలాంటి అనుమతి లేదు. ప్రభుత్వ మైనింగ్, భూగర్భ శాఖ అధికారులే నిబంధనలకు ఇది విరుద్ధం. కాని అధికారులు పట్టించుకోకుండా వ్వవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాకుండా ఓసీపీలో బ్యాక్‌ఫిల్లింగ్ కోసం పైన వచ్చిన మట్టినే తిరిగి నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లకు అప్పన్నంగా అప్పగించిన అధికారులు భవిష్యత్‌లో బ్యాక్ఫిల్లింగ్కు మట్టిని ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెడిపోతున్న రోడ్లకు ఎవరు బాధ్యతులు.. ఎస్సార్పీ 1 నుంచి రాయల్ గార్డెన్ వరకు సింగరేణి రూ.33 లక్షలు వెచ్చించి షేప్ నిధులతో వేసిన థార్ రోడ్డు గోదాముల నిర్మాణానికి మట్టి చేరవేస్తున్న లారీలతో పూర్తిగా చెడిపోయింది. నస్పూర్, షిర్కే కాలనీ కార్మికులకు నిత్యం గనులకు డ్యూటీలకు వెళ్లడానికి ఇదే రోడ్డు దిక్కు. రాత్రి పగలు నడుస్తున్న లారీలతో దుమ్ము, ధూళీతో రోడ్డుపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు మట్టిలో బైక్‌లు జారీ పడి గాయాలపాలవుతున్నారు. సింగరేణి కి అధికారం లేదు. - ప్రదీప్‌కుమార్, ఏడీ, గనుల, భూగర్భ శాఖ మట్టిని బయటికి ఇవ్వడానికి సింగరేణి అధికారులకు ఎలాంటి అధికారం లేదు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. బ్యాక్ పిల్లింగ్ కోసం మాత్రమే ఓసీపీ మట్టిని వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. ఇంటి అవసరాల కోసమంటేనే అనుమతి.. - జె.సూర్యదాస్, ప్రాజెక్ట్ అధికారి ఇంటి అవసరాల కోసం మట్టి కావాలని కోరిన నిర్వాసితులకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. పక్కదారి పట్టిందని తెలిస్తే అనుమతులు రద్దు చేస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగేటట్లు వ్యవహరిస్తే చర్య తీసుకుంటాం.