సమ్మె సైరన్ | Strike Siren in singareni National Labors Unions | Sakshi
Sakshi News home page

సమ్మె సైరన్

Published Mon, Jan 5 2015 3:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

సమ్మె సైరన్ - Sakshi

సమ్మె సైరన్

 సింగరేణిలో 6 నుంచి 10 వరకు
 జాతీయ కార్మిక సంఘాల పిలుపు
 సమ్మెకు గుర్తింపు సంఘం దూరం
 
 శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు సమ్మెలో పాల్గొనాలని జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూ సీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్ పిలుపునిచ్చా రు. ఈ మేరకు సింగరేణిలో కార్మికులను సన్నద్ధం చేస్తున్నాయి. మూడు నెలల క్రితం సుప్ట్రీం కోర్టు రద్దు చేసిన 214 బొగ్గు బ్లాకులకు కేంద్రం ఈ వేలం ద్వారా విక్ర యిం చేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడంతో జాతీయ సం ఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ప లు మార్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో వర్కర్‌టూ రూల్‌కు పిలుపునివ్వగా కేంద్రం ప్రభుత్వ చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిచగా వాయిదా వేశా యి. మళ్లీ నవంబర్ 14న సమ్మె పిలుపువ్వగా కేంద్ర బొ గ్గు మంత్రిత్వ శాఖ జాతీయ సంఘాలతో చర్చలు జరి పిన తరువాతే ముందుకు పోతామని అప్పటి దాక బొగ్గుబ్లాకుల జోలికి వెళ్లమని చెప్పడంతో సమ్మెను వాయిదా వేశాయి. ఉన్నట్టుండి ఆర్డినెన్స్ తేవడంపై జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారు.
 
 ఉత్పత్తిపై ప్రభావం
 ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి ఉత్పత్తి లక్ష్యం 55 మిలి యన్ టన్నులు. ఇంకా మూడు నెలల సమయమే మిగిలి ఉంది. డిసెంబర్ 31 నాటికి 4 మిలియన్ టన్నుల లోటు ఉంది. దీనిని భర్తీ చేసుకుంటే మిగిలి ఉన్న లక్ష్యం పూర్తి చేయాలి. ఈ కీలక సమయంలో సమ్మె పిలుపు రావడం తో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. మరో పక్క రాష్ట్రంలో విద్యుత్ సమస్య అధికంగా ఉన్న దృష్ట్యా థ ర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు డిమాండ్ అధికంగా ఉంది. సమ్మె జరిగితే రోజుకు కంపెనీ 2 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి నష్టపోవాల్సి వస్తుంది. దీంతో మరింత లోటు ఏర్పడి వార్షిక లక్ష్యం చేరుకోవడం మరింత ఇబ్బం దిగా మారుతుంది. ఈ క్రమంలో కార్మికులు సమ్మె వైపు వెళ్లకుండా అమసరమైన చర్యలు చేపట్టడానికి యాజమాన్యం ఉపక్రమించింది. సమ్మె వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ విస్తృత ప్రచారం చేయడానికి నిర్ణయించింది.
 
 గుర్తింపు సంఘం వ్యతిరేకం
 సమ్మెను గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తోంది. సమ్మెలో కార్మికులు పాల్గొనవద్దని ఆ యూనియన్ నేత లు ప్రకటించారు. కార్మికులను విధుల్లోకి దించాలన్నా, వద్దనాలన్నా గుర్తింపు సంఘం ఎంతో ప్రభావితం చే స్తుంది. బొగ్గు బ్లాకులపై ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత సమ్మెకు పిలుపునివ్వడం ఎంత వరకు సమంజసమని టీ బీజీకేఎస్ నేతలు అంటున్నారు. నవంబర్ 24న సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు తాము మద్దతిచ్చామని, సమ్మె అర్ధంతరంగా విరమించినప్పుడు ఎందుకు విరమించారో కార్మికులకు గానీ, లేదా మాకు గానీ కనీసం స మాచారం ఇవ్వలేదని పేర్కొంటున్నారు. కార్మికుల డి మాండ్లపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పం దిస్తూనే ఉందని, సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తికి నష్టం చేసి విద్యుత్ సమస్యను పెంచడం మంచిది కాదంటున్నారు.
 
 ప్రధాన డిమాండ్లు
     సుప్రీం కోర్టు రద్దు చేసిన 214 కోల్‌బ్లాక్‌ను కోల్‌ఇండియా లేదా సింగరేణికి కేటాయించాలి.
     సింగరేణి కార్మికులకు పెన్షన్ 40 శాతానికి పెంచాలి.
        సీలింగ్ ఎత్తివేయాలని.
     వీఆర్‌ఎస్ డిపెండెంట్‌లకు, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
     వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలి. వీటితోపాటునోటీసులో మొత్తం 17 డిమాండ్లు ఉన్నాయి.
 
 ఎన్టీపీసీ ఉద్యోగుల మద్దతు
 సమ్మెకు ఎన్టీపీసీ ఉద్యోగుల మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా ఎలక్ట్రికల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాబర్‌సలీంపాషా చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాబర్‌సలీంపాషాను ఆదివారం ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వెంకట్రావ్ పరామర్శించారు. అనంతరం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని తన నివాసంలో పాషా మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థకు బొగ్గు గని కార్మికులతో ఎనలేని సంబంధాలు ఉన్నాయని, గని కార్మికుల సమ్మెకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మద్దతు తెలుపనున్నామని తెలిపారు.
 
 విజయవంతం చేయాలి
 శ్రీరాంపూర్/జ్యోతినగర్/రుద్రంపూర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, బొగ్గుగనుల ప్రవేటీకరణకు నిరసనగా, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న బొగ్గుగని కార్మికుల సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లపల్లి రీజియన్ శ్రీరాంపూర్, రామగుండం రీజియన్ జ్యోతినగర్, కొత్తగూడెం రీజియన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో నాయకులు సమ్మెకు దారితీసిన కారణాలను వివరించారు. కేంద్రం ప్రభుత్వం చర్చల పేరుతో మోసం చేసి నేడు బొగ్గు బ్లాకులపై అర్ధంతరంగా ఆర్డినెన్స్ తెచ్చిందని ధ్వజమెత్తారు.
 
 కోల్‌ఇండియాలో ఇప్పటికే 10 శాతం వాటాలు ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి పోయాయని, మరో 11 శాతం డిసిన్వెస్ట్‌మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఐదు రోజుల ఈ సమ్మెకు కోల్‌ఇండియాలో అధికారుల సంఘమైన సీఎంఓఏఐ మద్దతిచ్చిందని, సింగరేణిలోని అధికారుల సంఘం కూడా మద్దతు తెలపాలని కోరారు. శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, కొత్తగూడెంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దమ్మలపాటి శేషయ్య, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లట్టి జగన్మోహన్‌రావు, సీఐటీయూ నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వర్లు, జ్యోతినగర్‌లో ఐఎన్టీయూసీ ఆర్జీ-1ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి, నడిపెల్లి అభిశేక్‌రావు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement