strike Siren
-
సింగరేణిలో సమ్మె సైరన్
శ్రీరాంపూర్ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు. జేఏసీ కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సమ్మె సైరన్
-
రైల్వే, ఆర్టీసీ సమ్మె సైరన్
♦ ఈ నెల 23న ఆర్టీసీలో ఒకరోజు సమ్మె.. ♦ రైల్వేలో జూలై 11 నుంచి సమ్మె అటు రైలు కూతకు, ఇటు బస్సు హారన్‌కు సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు సమ్మెలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఒక రోజు సమ్మెకు 7 సంఘాలతో కూడిన ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వగా... వచ్చే నెల 11వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు రైల్వే ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు తపాలా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కూడా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ రాయ్‌కు సమ్మె నోటీసు అందజేశారు. - సాక్షి, హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు నోటీసు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది దేశవ్యాప్తంగా వచ్చేనెల 11 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేలో కార్మిక సంఘాలు జీఎం రవీంద్రగుప్తాకు గురువారం సమ్మె నోటీసు అందజేశాయి. ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంఘం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు ఆధ్వర్యంలో దాదాపు 3 వేల మంది కార్మికులు రైల్ నిలయానికి తరలివచ్చారు. కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధపడినట్లు ఈ సందర్భంగా శంకరరావు చెప్పారు. ఇక ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవయ్య ఆధ్వర్యంలో కార్మికులు వచ్చి సమ్మె నోటీసు అందజేశారు. రైల్వే కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంటు, సర్వీసులో కనీసం 5 సార్లు పదోన్నతులు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న డిమాండ్లతో సమ్మెకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో ఒక రోజు సమ్మె ఈ నెల 23న ఒక రోజు సమ్మె చేయనున్నట్లు 7 కార్మిక సంఘాలతో కూడిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. వేతన సవరణ బకాయిలతోపాటు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌తో సమ్మెకు సిద్ధపడింది. కార్మిక సంఘాల నేతలు గత నెల 16న జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతం రాకపోవటంతో సమ్మెకు దిగుతున్నారు. అయితే ఇదే సమయంలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మికశాఖ నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో ఎన్నికల ప్రక్రి య, ప్రచారానికి సమయం ఉండదన్న ఉద్దేశంతో నిరవధిక సమ్మె యోచన విరమించుకున్నట్లు కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. వేతన సవరణతో ఆర్టీసీపై పడిన భారాన్ని భరించేందుకు నెలకు రూ.75 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం, దీనికి సంబంధించి గత 6 నెలల బకాయిలు రూ.450 కోట్లు చెల్లింపు, వేతన సవరణకు సంబంధించి బ కాయిల రెండో విడత చెల్లింపు, 2012కు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు, 2013 నుంచి బకాయిల బాండ్ల విడుదల డిమాండ్లుగా సమ్మెకు దిగుతున్నట్టు జేఏసీ నేతలు పేర్కొన్నారు. హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారు వేతన సవరణతో పెరిగిన జీతాల ఖర్చు నెలకు 75 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారని.. కానీ ఆ హామీని తుంగలో తొక్కారని ఆర్టీసీ కార్మిక జేఏసీ విమర్శించింది. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి, ఎన్ఎంయూ చైర్మన్ కమాల్‌రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి వి.ఎస్.రావు తదితరులు మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కారించాలన్న డిమాండ్‌తో నోటీసు ఇచ్చి ఇన్ని రోజులైనా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు వెళుతున్నామని చెప్పారు. సీఎం సమక్షంలో కార్మికులతో జరిగిన ఒప్పందాలు రెండేళ్లవుతున్నా అమలు కాకపోవడం దారుణమన్నారు. -
సమ్మె సైరన్
సింగరేణిలో 6 నుంచి 10 వరకు జాతీయ కార్మిక సంఘాల పిలుపు సమ్మెకు గుర్తింపు సంఘం దూరం శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు సమ్మెలో పాల్గొనాలని జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూ సీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ పిలుపునిచ్చా రు. ఈ మేరకు సింగరేణిలో కార్మికులను సన్నద్ధం చేస్తున్నాయి. మూడు నెలల క్రితం సుప్ట్రీం కోర్టు రద్దు చేసిన 214 బొగ్గు బ్లాకులకు కేంద్రం ఈ వేలం ద్వారా విక్ర యిం చేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడంతో జాతీయ సం ఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ప లు మార్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో వర్కర్‌టూ రూల్‌కు పిలుపునివ్వగా కేంద్రం ప్రభుత్వ చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిచగా వాయిదా వేశా యి. మళ్లీ నవంబర్ 14న సమ్మె పిలుపువ్వగా కేంద్ర బొ గ్గు మంత్రిత్వ శాఖ జాతీయ సంఘాలతో చర్చలు జరి పిన తరువాతే ముందుకు పోతామని అప్పటి దాక బొగ్గుబ్లాకుల జోలికి వెళ్లమని చెప్పడంతో సమ్మెను వాయిదా వేశాయి. ఉన్నట్టుండి ఆర్డినెన్స్ తేవడంపై జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఉత్పత్తిపై ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి ఉత్పత్తి లక్ష్యం 55 మిలి యన్ టన్నులు. ఇంకా మూడు నెలల సమయమే మిగిలి ఉంది. డిసెంబర్ 31 నాటికి 4 మిలియన్ టన్నుల లోటు ఉంది. దీనిని భర్తీ చేసుకుంటే మిగిలి ఉన్న లక్ష్యం పూర్తి చేయాలి. ఈ కీలక సమయంలో సమ్మె పిలుపు రావడం తో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. మరో పక్క రాష్ట్రంలో విద్యుత్ సమస్య అధికంగా ఉన్న దృష్ట్యా థ ర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు డిమాండ్ అధికంగా ఉంది. సమ్మె జరిగితే రోజుకు కంపెనీ 2 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి నష్టపోవాల్సి వస్తుంది. దీంతో మరింత లోటు ఏర్పడి వార్షిక లక్ష్యం చేరుకోవడం మరింత ఇబ్బం దిగా మారుతుంది. ఈ క్రమంలో కార్మికులు సమ్మె వైపు వెళ్లకుండా అమసరమైన చర్యలు చేపట్టడానికి యాజమాన్యం ఉపక్రమించింది. సమ్మె వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ విస్తృత ప్రచారం చేయడానికి నిర్ణయించింది. గుర్తింపు సంఘం వ్యతిరేకం సమ్మెను గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తోంది. సమ్మెలో కార్మికులు పాల్గొనవద్దని ఆ యూనియన్ నేత లు ప్రకటించారు. కార్మికులను విధుల్లోకి దించాలన్నా, వద్దనాలన్నా గుర్తింపు సంఘం ఎంతో ప్రభావితం చే స్తుంది. బొగ్గు బ్లాకులపై ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత సమ్మెకు పిలుపునివ్వడం ఎంత వరకు సమంజసమని టీ బీజీకేఎస్ నేతలు అంటున్నారు. నవంబర్ 24న సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు తాము మద్దతిచ్చామని, సమ్మె అర్ధంతరంగా విరమించినప్పుడు ఎందుకు విరమించారో కార్మికులకు గానీ, లేదా మాకు గానీ కనీసం స మాచారం ఇవ్వలేదని పేర్కొంటున్నారు. కార్మికుల డి మాండ్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పం దిస్తూనే ఉందని, సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తికి నష్టం చేసి విద్యుత్ సమస్యను పెంచడం మంచిది కాదంటున్నారు. ప్రధాన డిమాండ్లు సుప్రీం కోర్టు రద్దు చేసిన 214 కోల్‌బ్లాక్‌ను కోల్ఇండియా లేదా సింగరేణికి కేటాయించాలి. సింగరేణి కార్మికులకు పెన్షన్ 40 శాతానికి పెంచాలి. సీలింగ్ ఎత్తివేయాలని. వీఆర్ఎస్ డిపెండెంట్లకు, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలి. వీటితోపాటునోటీసులో మొత్తం 17 డిమాండ్లు ఉన్నాయి. ఎన్టీపీసీ ఉద్యోగుల మద్దతు సమ్మెకు ఎన్టీపీసీ ఉద్యోగుల మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా ఎలక్ట్రికల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాబర్‌సలీంపాషా చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాబర్సలీంపాషాను ఆదివారం ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వెంకట్రావ్ పరామర్శించారు. అనంతరం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని తన నివాసంలో పాషా మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థకు బొగ్గు గని కార్మికులతో ఎనలేని సంబంధాలు ఉన్నాయని, గని కార్మికుల సమ్మెకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మద్దతు తెలుపనున్నామని తెలిపారు. విజయవంతం చేయాలి శ్రీరాంపూర్/జ్యోతినగర్/రుద్రంపూర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, బొగ్గుగనుల ప్రవేటీకరణకు నిరసనగా, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న బొగ్గుగని కార్మికుల సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లపల్లి రీజియన్ శ్రీరాంపూర్, రామగుండం రీజియన్ జ్యోతినగర్, కొత్తగూడెం రీజియన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో నాయకులు సమ్మెకు దారితీసిన కారణాలను వివరించారు. కేంద్రం ప్రభుత్వం చర్చల పేరుతో మోసం చేసి నేడు బొగ్గు బ్లాకులపై అర్ధంతరంగా ఆర్డినెన్స్ తెచ్చిందని ధ్వజమెత్తారు. కోల్ఇండియాలో ఇప్పటికే 10 శాతం వాటాలు ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి పోయాయని, మరో 11 శాతం డిసిన్వెస్ట్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఐదు రోజుల ఈ సమ్మెకు కోల్ఇండియాలో అధికారుల సంఘమైన సీఎంఓఏఐ మద్దతిచ్చిందని, సింగరేణిలోని అధికారుల సంఘం కూడా మద్దతు తెలపాలని కోరారు. శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, కొత్తగూడెంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దమ్మలపాటి శేషయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లట్టి జగన్మోహన్రావు, సీఐటీయూ నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వర్లు, జ్యోతినగర్‌లో ఐఎన్టీయూసీ ఆర్జీ-1ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి, నడిపెల్లి అభిశేక్రావు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
చర్చలు విఫలం!
సాక్షి, చెన్నై : ఎన్ఎల్సీ యాజమాన్యం, కార్మికుల మధ్య సాగిన చర్చలు విఫలమయ్యాయి. యాజమాన్యం నడ్డి విరిచేందుకు సమ్మె తప్పదని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బుధవారం అర్ధరాత్రి లేదా, గురువారం నుంచి సమ్మె బాట పట్టే రీతిలో కార్మిక సంఘాలు సంప్రదింపుల్లో మునిగాయి. కడలూరు జిల్లా నైవేలిలోని లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. ఇక్కడ నేల బొగ్గు తవ్వకాలు, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ సాగుతుండడంతో కార్మికులు తరచూ ఆందోళనబాట పట్టడం పరిపాటిగా మారింది. ఏడాదికోమారు సమ్మె సైరన్‌ను తప్పనిసరిగా కార్మిక సంఘాలు మోగిస్తూనే వస్తున్నాయి. ఇందుకు కారణం యాజమాన్య వైఖరి, 20 ఏళ్లకు పైగా ఇందులోని పది వేల మంది కార్మికులు ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, అలవె న్సులు ప్రకటించాలన్న డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచినా ఫలితం శూన్యం. ఇది వరకు యాజమాన్యంతో చర్చలు జరుపుతూ వచ్చిన కార్మిక సంఘాలు, చివరకు కార్మిక సంక్షేమ అధికారి సమక్షంలో చర్చలకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు 15 సార్లు చర్చలు జరిగాయి. అయితే, ఎన్ఎల్సీ యాజమాన్యం మాత్రం మెట్టు దిగలేదు. సమ్మె అనివార్యం కావడంతో గత నెల పది కార్మిక సంఘాలు సంయుక్తంగా సమ్మె నోటీసు జారీ చేశాయి.చర్చలు విఫలం : కార్మిక సంఘాలు సమ్మె నోటీసు జారీ చేయడంతో పాటుగా రోజుకో రూపంలో నిరసనలకు దిగడంతో యాజమాన్యం తగ్గింది. పుదుచ్చేరిలోని కార్మిక సంక్షేమ అధికారి సమక్షంలో చర్చలకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం తొమ్మిది కార్మిక సంఘాలు ఈ చర్చలకు హాజరయ్యాయి. అయితే, పట్టు వదలని విక్రమార్కుడిలాగా యాజమాన్యం వ్యవహరించడంతో ఆ సంఘాలు చర్చల్ని బహిష్కరించి బయటకు వచ్చాయి. చర్చలు విఫలమయ్యాయని, బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించాయి. అదే సమయంలో జీవా ఒప్పంద కార్మికులు చర్చలకు దూరంగా ఉండడంతో, వారితో కార్మిక సంక్షేమ అధికారి సమక్షంలో బుధవారం బుజ్జగింపు యత్నాలు జరిగాయి. అయితే, ఆ చర్చలు సైతం విఫలం కావడంతో సమ్మెకు రెడీ అవుతున్నామని జీవా ఒప్పంద కార్మిక సంఘం ప్రకటించింది. అయితే, సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి చేపట్టాలా..? లేదా, గురువారం నుంచి చేపడుదామా...? అన్న విషయంగా కార్మిక సంఘాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. రాత్రి జరగనున్న పది సంఘాలు సంయుక్త సమావేశం అనంతరం సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. రంగంలోకి బలగాలు: కార్మికులు సమ్మె సైరన్ మోగించనుండడంతో నైవేలి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కేంద్ర బలగాల్ని రంగంలోకి దించారు. కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న పక్షంలో ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం ఉదయం నుంచే నైవేలిలోని ఎన్ఎల్సీ ప్రధాన కార్యాలయం, నగర కార్యాలయం, భూగర్భ కార్యాలయం, మూడు విద్యుత్ యూనిట్లకు సంబంధించిన ఆ కార్యాలయాలన్నీ తమ ఆధీనంలోకి కేంద్ర భద్రతా బలగాలు తీసుకున్నాయి. కార్మికులు ఆందోళనలు, నిరసనలకు యత్నించినా, నేలబొగ్గు తవ్వకాల ప్రదేశాలు, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల వైపుగా వెళ్లేందుకు యత్నించినా అడ్డుకునే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. కార్మికులు సమ్మె బాట పట్టినా, విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండబోదని, నేలబొగ్గు నిల్వ పుష్కలంగా ఉన్నట్టు ఎన్ఎల్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, ఎన్ఎల్సీ కార్మిక సంఘాల నాయకులు, సుకుమార్, పరమ శివన్‌లు మీడియాతో మాట్లాడుతూ, ఎన్ఎల్సీ లాభాల బాటలో పయనిస్తోందని వివరించారు. ఒప్పంద కార్మికులు రేయింబవళ్లు ఏళ్ల తరబడి శ్రమించే ఈ సంస్థ లాభాలను ఆర్జిస్తూ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. అయితే, ఒప్పంద కార్మికుల సంక్షేమం మీద యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. అందుకే సమ్మె సైరన్ మోగించే తీరాలన్న నిర్ణయానికి వచ్చామని ప్రకటించారు. -
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యోగ గళం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోల నినాదాలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్తంభించిన కార్యకలాపాలు బోసిపోయిన కలెక్టరేట్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: మళ్లీ సమ్మె సైరన్ మోగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యోగుల గళం గర్జించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో మళ్లీ పని స్తంభించిపోయింది. ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు మేరకు సమ్మె మళ్లీ మొదలైంది. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు గురువారం ఉదయం విధులను బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి ఆందోళనతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. గ్రామ కార్యాలయాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు అన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు లేక ఆఫీసులు బోసి పోయాయి. పాడేరులో ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. పీవో వి.వినయ్‌చంద్‌ను కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేపడుతున్న సమ్మెకు సహకరించాలని కోరారు. ఎన్జీవో నేతలు, పలు శాఖల ఉద్యోగులు పాడేరు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. పాతబస్టాండ్‌లో రాస్తారోకో చేపట్టి రాష్ట్ర విభజన చర్యలను నిరసించారు. కాగా ఎన్జీవోల సమ్మెతోఅంగన్వాడీ లింక్ వర్కర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇబ్బంది పడ్డారు. ట్రైకార్ పథకంలో రుణాలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారు నిరాశతో వెనుతిరిగారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రెవెన్యూ అధికారులు పెన్ డౌన్ చేయగా సిబ్బంది పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. అనకాపల్లిలోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. కార్యాలయాలకు తాళాలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎపీఎన్జీవోలు, ఏపీఆర్ఎస్ఏ, పంచాయతీ రాజ్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించారు. ఉన్నతాధికారులు మినహా తహశీల్దార్ నుంచి కింది స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ సమ్మెలో పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చినా విధులకు హాజరుకాకుండా రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాలే కాకుండా జిల్లా కలెక్టరేట్లో సెక్షన్లకు తాళాలు వేశారు. నిత్యం జనాలతో కిటకిటలాడే కలెక్టర్ కార్యాలయం గురువారం బోసి పోయింది. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్లోనే టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇతర నాయకులు, తహశీల్దార్లు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను శుక్రవారం కలిసి సమ్మె విషయాన్ని చెప్పనున్నారు. బలవంతంగా మూసివేత ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం ఉదయం నగరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ తిరిగారు. డీఈఓ, కమర్షియల్ ట్యాక్ ఆఫీస్‌లలో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. కార్యాలయాలను మూసివేశారు. అలాగే ఇతర శాఖలకు కూడా వెళ్లి కార్యాలయాలన్నింటినీ మూయించారు. గ్రామీణ జిల్లాలో గ్రామ కార్యాలయాల నుంచి మండల తహశీల్దార్ ఆఫీస్‌ల వరకు మొత్తం మూత పడడంతో పాలన స్తంభించిపోయింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు విధులను బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. మున్ముందు మరిన్ని శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు చెబుతున్నారు. ఆ నలుగురికీ మినహాయింపు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె బాట నుంచి నలుగురు తహశీల్దార్లకు వినహాయిం పు ఇచ్చారు. ఈ నలుగురూ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పోకుండా ఉండేందుకు రెవెన్యూ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గాజువాక తహశీల్దార్ వి.సింహాద్రిరావు, ఆనందపురం తహశీల్దార్ నెహ్రూబాబు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ తహశీల్దార్ వై.పి.ఎస్.రాణి, కలెక్టరేట్లో ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీస్ స్పెషల్ తహశీల్దార్ ఎన్.వి.సూర్యనారాయణలు గురువారం విధులు నిర్వర్తించారు. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జరిగిన సమ్మెలో వీరు పాల్గొన్నారు. -
గ్రేటర్లో సమ్మె సైరన్
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ సేవలన్నీ శుక్రవారం నుంచీ నిలిచిపోనున్నాయి. జీహెచ్ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు ఇరవైవేల మంది నిరవధికంగా విధులకు డుమ్మాకొట్టి సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా చెత్త తరలింపు.. వీధులూడ్చటం.. దోమల నివారణ మందులు చల్లడం.. తదితర సేవలన్నీ స్తంభించనున్నాయి. మునిసిపల్ పరిపాలన, పట్ణణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ మేరకు ఈ నెల 10వ తేదీ నాటికి ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనం నెలకు రూ.16,500కి పెంచాల్సి ఉండగా పెంచలేదని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, గౌరవాధ్యక్షుడు అమరేందర్‌లు విలేకరులకు తెలిపారు. మెగాసిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తదితర హామీలు అమలుకు నోచుకోనందున గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మెలో పాల్గొననున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు, పారిశుధ్య విభాగంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఈఎఫ్‌ఏలకు ఇంధన అలవెన్సు, కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, రెయిన్కోట్లు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సదుపాయాలు తదితరమైనవి యూనియన్ డిమాండ్లలో ఉన్నాయి. కొనసాగుతున్న ఇంజనీర్ల నిరసన మరోవైపు సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవమానానికి నిరసనగా జీహెచ్ఎంసీ ఇంజనీర్లు ప్రారంభించిన నిరసన కొనసాగుతోంది. గురువారం సామూహిక సెలవులతో విధులకు హాజరుకాని ఇంజనీర్లు.. శుక్రవారం సైతం సామూహిక సెలవు పెట్టి గైర్హాజరు కానున్నట్లు తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
సాక్షి, తిరుపతి: విద్యుత్ ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృత చేస్తున్నారు. గురువారం నుంచి సమ్మెలోకి వెళ్తుండడంతో బుధవారం త మ సిమ్‌కార్డులను ఎస్పీడీసీఎల్ కంపెనీకి వెనక్కి పంపారు. డిస్కం పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యోగులు సిమ్‌కార్డులను ఎస్ఈలకు అందజేశారు. జిల్లాలో 500కు పైగా సిమ్‌కార్డులను ఉద్యోగులు వెనక్కి ఇచ్చారు. తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు కూడా 150 మందికి పైగా సిమ్‌కార్డులు వెనక్కి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోనూ 250 మంది విద్యుత్ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సిమ్‌కార్డులను వెనక్కి ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 300కు పైగా సిమ్‌కార్డులు ఎస్ఈకి అందజేశారు. నేటి నుంచి సమ్మె: డిస్కం పరిధిలోని ఆరు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె సైరన్ మోగించనున్నారు. ప్రధానంగా తిరుపతి, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు నగరాల్లో సమ్మె ప్రభావం కనపడనుంది. ఎల్టీ సర్వీసులతో పాటు పారిశ్రామికంగా ఎక్కువ హెచ్‌టీ సర్వీసులు ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సమ్మెతో పరిశ్రమలకు పెద్ద దెబ్బ తగలనుంది. సమ్మెలో భాగంగా మొదట సర్వీసు మెయింటెన్స్ వంటి పనులకు సంబంధించి విధులకు గైర్హాజరు కానున్నారు. ఆ తర్వాత విడతల వారీగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేసేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వాణిజ్య సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. వీటికి కూడా విద్యుత్ సరఫరా నిలి పేసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో డిస్కం సీఎండీ హెచ్‌వై దొర అత్యవసర సర్వీసులైన ఆస్పత్రులు, హోటళ్లు, తిరుమల టీటీడీ అవసరాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే విద్యు త్ ఉద్యోగుల జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేసి ఉన్నారు. నేడు సీఎంతో చర్చలు: ట్రాన్స్‌కో, డిస్కం విద్యుత్ ఉద్యోగ సంఘాలతో సీఎం బుధవారం సాయంత్రం 4 గంటలకు జరపాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. సీఎంతో చర్చల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య, ఇతర నాయకులు హైదరాబాద్ వెళ్లారు.