sidda ramaiah government
-
మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. జూన్ నుంచి వారికి ఉచిత బస్సు ప్రయాణం
బెంగళూరు: కర్ణాటక మహిళలకు ఊరట లభించింది. కొత్తగా కొలువు తీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. జూన్ 1 నుంచి మహిళలందరూ టికెట్టు కొనుగోలు చేయకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆర్టీసీ ఎండీలతో సమావేశమైన అనంతరం మీడియా సమక్షంలో మంగళవారం ప్రకటించారు. నో అబ్జెక్షన్స్.. రాష్ట్రంలోని మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఇందుకు ఎలాంటి షరతులు లేవని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలోనూ తాము ఎలాంటి షరతులు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేబినెట్ సమావేశం బుధవారం నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఖర్చులను సీఎంకు సమర్పించనున్నట్లు చెప్పారు. సీఎం సిద్ధరామయ్య కూడా రవాణా శాఖ ప్రధాన కార్యదర్శితో ఇప్పటికే ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకా ప్రజలు గణవిజయాన్ని అందించారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి:పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు -
ఇది పైసా వసూల్ సర్కారు
సాక్షి,బెంగళూరు: ‘‘కర్ణాటకలో సిద్దరా మయ్య ప్రభుత్వం ఉందని కొందరు అనుకుంటున్నారు. కానీ, ఇక్కడ నడిచేది ‘సీదా రూపయ్యా సర్కారు’ అని ప్రజలు భావిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇక్కడ డబ్బు లేనిదే ఏ పనీ జరగదనీ, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీలు లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప 75వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం దావణగెరెలో నిర్వహించిన భారీ సభలో ఆయన మాట్లాడారు. ఎలాంటి మేలూ చేయని సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలను సంతృప్తి పరచటం, అసంతృప్త నాయకులకు వసూళ్లలో వాటాలివ్వటం అనే రెండు పనులను మాత్రం చేస్తోందని దుయ్యబట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు, మంత్రుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడుల్లో బయటపడిన బంగారం, డబ్బుల కట్టలు ఎవరి సొమ్మని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని పది శాతం కమీషన్ ప్రభుత్వం అని విమర్శించిన ప్రధాని.. ఆ సమాచారం తప్పని,, అవినీతి అంతకుమించి ఉంటుందని తెలిసిందని అన్నారు. ఈ వ్యవహారం కర్ణాటకలో అందరికీ తెలుసన్నారు. స్వచ్ఛ భారత్, వాటర్‌షెడ్, స్మార్టు సిటీల కోసం కేంద్రం ఇస్తున్న వేలాది కోట్ల నిధులను ప్రభుత్వం వినియోగించుకోవటం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకునే బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా బలమైన లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. మంగళవారం యడ్యూరప్ప పుట్టినరోజు కూడా కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఈ నెలలో ఇది మూడోది. -
సిద్ధుకు వార్షిక పరీక్ష !
సర్కార్ పనితీరుపై ‘14న సమన్వయ సమితి’ భేటీ బెంగళూరుకు రానున్న కేంద్ర మంత్రి ఆంటోని సంక్షేమ పథకాల అమలు నివేదికలు తెప్పించుకుంటున్న మంత్రులు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ‘సమన్వయ సమితి’ రూపంలో పరీక్షను ఎదుర్కొనబోతోంది. ఈనెల 14న బెంగళూరులో జరగబోయే సమన్వయ సమితి సమావేశానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ఆంటోనితో పాటు కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్ సింగ్ హాజరవుతున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య ఏడాది పాలనలో ఆయనతో పాటు మంత్రుల పనితీరు, వ్యవహార శైలిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరును సంబంధిత మంత్రులతో కలిసి సమీక్షించనున్నారు. కరువు నివారణ పనులు, తాగునీటి ఎద్దడి నివారణకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ జోక్యం చేసుకోవడం.. ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శించడం.. అదే రీతిలో సీఎం సైతం గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంశాలు ఈ సమితి సమావేశంలో ప్రధాన ంగా చర్చకు వచ్చేఅవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రుల మధ్య బేధాభిప్రాయాలు, అందుకు దారితీసిన కారణాలపై కూడా సమితి చర్చించనుంది. అభివృద్ధి పథకాలతో ఎంత మంది లబ్ధి పొందారు.. తదితర విషయాలను కూడా సంబంధిత మంత్రులు సమితి సభ్యులకు వివరించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఇప్పటికే మంత్రులు తమతమ శాఖల ప్రగతిపై నివేదిక తయారు చేసుకుని తుది మెరుగులు దిద్దే పనిలో తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సమన్వయ సమితి సమావేశంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీ పరంగా కూడా ఈ ఏడాది కాలంలో వచ్చిన మార్పులపై చర్చించనున్నారు. కొంతమంది మంత్రుల పనితీరుపై గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి శాఖలను మార్చే విషయం, మంత్రి మండలిలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల భర్తీపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ పదవిలో ఉండటం లేదా దిగిపోవడం రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలపై ఆధారపడి ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కూడా సమితి సభ్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. -
సిద్ధు సర్కారుపై లేఖల యుద్ధం
సాక్షి, బెంగళూరు : సిద్ధరామయ్య ప్రభుత్వంపై రాష్ట్రంలో లేఖల యుద్ధం జరుగుతోంది. విపక్షాలే కాకుండా స్వపక్షంలోని సభ్యులు కూడా రాష్ట్రంలో పాలన గాడితప్పిందని పేర్కొంటూ ఆయనకు స్వయంగా లేఖలు రాస్తున్నారు. మరికొందరు ఈ విషయమై ఇంకొఅడుగు ముందుకువేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టా నానికే లేఖలను అందజేస్తున్నారు. మంత్రులు ప్రజలకే కాదు శాసనసభ్యులకు కూడా అందుబాటులో ఉండటం లేదని అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి ముఖ్యమంత్రికే లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు కూడా పూర్తి సిద్ధు సర్కారుపై లేఖల యుద్ధం కాకుండానే కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ కూడా సిద్ధు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు ప్రభుత్వ విధానాల వల్ల త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. మంత్రుల స్థానంలో ఉన్న కొంతమంది నాయకులు పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జర్చించడానికి విధానసౌధ, వికాససౌధలోని మంత్రుల కార్యాలయాలకు ఎప్పుడు వెళ్లినా ‘సమయం లేదు’ అన్న సమాధానం వస్తోందన్నారు. ఇక ముఖ్యమంత్రి స్థాన ంలో ఉండి మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సిన సిద్ధరామయ్య ఆ వైపుగా కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని మాలికయ్య గుత్తేదార్ నిష్టూరమాడారు. దీంతో రాష్ట్రంలో పాలన గాడితప్పుతోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుం డా మంత్రిమండలిలో సీనియర్ నాయకులకు తప్పక స్థానం కల్పించాలని సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎనిమిది పేజీల లేఖ... రాష్ట్రంలో వైద్య విధానం గాడితప్పిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు సంబంధిత మంత్రి యూటీ ఖాదర్‌కు విపక్షనాయకుడు హెచ్.డీ కుమారస్వామి ఈనెల 13న ఎనిమిది పేజీల లేఖ రాశారు. నాణ్యతా పరీక్షల్లో విఫలమైన కంపెనీల మందులను రాష్ట్రంలో విక్రయాలకు అనుమతించడమే కాకుండా వాటినే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వితరణ చేస్తున్నారన్నారు. ఈ విషయమై బెల్గాం సమావేశాల్లో చర్చించాలని పట్టుపట్టినా సమయం లేదంటూ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభించిందన్నారు. ప్రజల ప్రాణాలకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాలపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై లేఖల యుద్ధం చేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.