సాక్షి, బెంగళూరు : సిద్ధరామయ్య ప్రభుత్వంపై రాష్ట్రంలో లేఖల యుద్ధం జరుగుతోంది. విపక్షాలే కాకుండా స్వపక్షంలోని సభ్యులు కూడా రాష్ట్రంలో పాలన గాడితప్పిందని పేర్కొంటూ ఆయనకు స్వయంగా లేఖలు రాస్తున్నారు. మరికొందరు ఈ విషయమై ఇంకొఅడుగు ముందుకువేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టా నానికే లేఖలను అందజేస్తున్నారు. మంత్రులు ప్రజలకే కాదు శాసనసభ్యులకు కూడా అందుబాటులో ఉండటం లేదని అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి ముఖ్యమంత్రికే లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు కూడా పూర్తి
సిద్ధు సర్కారుపై లేఖల యుద్ధం
కాకుండానే కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ కూడా సిద్ధు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు ప్రభుత్వ విధానాల వల్ల త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. మంత్రుల స్థానంలో ఉన్న కొంతమంది నాయకులు పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జర్చించడానికి విధానసౌధ, వికాససౌధలోని మంత్రుల కార్యాలయాలకు ఎప్పుడు వెళ్లినా ‘సమయం లేదు’ అన్న సమాధానం వస్తోందన్నారు. ఇక ముఖ్యమంత్రి స్థాన ంలో ఉండి మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సిన సిద్ధరామయ్య ఆ వైపుగా కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని మాలికయ్య గుత్తేదార్ నిష్టూరమాడారు. దీంతో రాష్ట్రంలో పాలన గాడితప్పుతోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుం డా మంత్రిమండలిలో సీనియర్ నాయకులకు తప్పక స్థానం కల్పించాలని సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎనిమిది పేజీల లేఖ...
రాష్ట్రంలో వైద్య విధానం గాడితప్పిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు సంబంధిత మంత్రి యూటీ ఖాదర్‌కు విపక్షనాయకుడు హెచ్.డీ కుమారస్వామి ఈనెల 13న ఎనిమిది పేజీల లేఖ రాశారు. నాణ్యతా పరీక్షల్లో విఫలమైన కంపెనీల మందులను రాష్ట్రంలో విక్రయాలకు అనుమతించడమే కాకుండా వాటినే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వితరణ చేస్తున్నారన్నారు. ఈ విషయమై బెల్గాం సమావేశాల్లో చర్చించాలని పట్టుపట్టినా సమయం లేదంటూ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభించిందన్నారు. ప్రజల ప్రాణాలకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాలపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై లేఖల యుద్ధం చేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
సిద్ధు సర్కారుపై లేఖల యుద్ధం
Published Mon, Jan 20 2014 2:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement