siddepeta distric
-
బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు : హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట : రాష్ర్ట ప్రజలందరికీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబసమేతంగా సిద్ధిపేటలోని కోమటి చెరువు వద్ద జరుగుతున్న బతుకమ్మ సంబురాలను వీక్షించారు. ఇతర దేశాల్లోనూ ఘనంగా పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉన్నా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ప్రజలు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారన్నారు. తెలంగాణలో వర్షాలు బాగా పడటంతో చెరువులు నిండుకుండటా మారి కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మంత్రి హరీష్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. (సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కల్వకుంట్ల కవిత) -
’బర్త్‌డే కేక్’ కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, సిద్దిపేట: నాలుగు నెలల క్రితం సిద్ధిపేట జిల్లాలో బర్త్‌డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయిన తండ్రీకొడుకుల కేసులో మిస్టరీ వీడింది. పాపమంతా కేకు తయారు చేసిన బేకరీ యజమానిదేనని తేలింది. కాలం చెల్లిన రసాయనాలతో కేకు తయారు చేయటం వల్లే తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ పరీక్షలతో తేలింది. ఆస్తి తగాదాల కారణంగా బాబాయే కేకులో విషంపెట్టి చంపాడన్న ఆరోపణలు వాస్తవం కాదని తేలింది. (‘కేక్’ బాధితుల ఇంట మరో విషాదం) ఐనాపూర్ ఘటనతో ఆందోళన.. సిద్దిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఇస్తారిగల్ల రవీందర్, అతని కుమారుడు రాంచరణ్ 2019 సెప్టెంబర్ 4వ తేదీన కేక్ తినడం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కొమురవెల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేక్ నమూనాలను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో అందులో ఎలాంటి విష ప్రయోగం జరగలేదని.. కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలు, రసాయానాలు వాడి ఎలాంటి శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన కేక్ తినడంతో వారిలో ఫంగస్, ఇన్ఫెక్షన్ సోకి శరీరంలో విష పదార్థంగా మారడంతో వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో సిద్దిపేటలోని బేకరీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన జిల్లా వాసులు జిల్లాలోని పలు హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీల్లో కల్తీ పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని, కాలం చెల్లిన తర్వాత కూడా విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. (కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!) శాంపిల్స్తోనే సరి.. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్లో ఇడ్లీలో బొద్దింక వచ్చిందని వినియోగదారుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు ఆ హోటల్‌ను సీజ్ చేశారు. కానీ మరుసటి రోజు నామమమాత్రం జరిమానాతో సరిపెట్టడంతో హోటల్ నిర్వాహకులు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని హోటళ్లలో రాత్రి మిగిలిపోయిన మాంసం, ఇతర తినుబండారాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, మరుసటి రోజు మసాలాలు, పుడ్ కలర్స్, ఇతర రసాయానాలను వాడి గుర్తు పట్టలేకుండా ఘుమఘమలాడిస్తూ వినియోగదారులకు వడ్డిస్తున్నారు. వీటిని అడఫా దడఫా ఆహార భద్రతా అధికారి తనిఖీలు చేస్తున్నప్పటికీ శాంపిల్స్ సేకరణతోనే సరిపెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. (కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు) 197 శాంపిల్స్.. 27 కేసులు నమోదు.. జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌సెంటర్లు, బిర్యానీసెంటర్లు, పాల విక్రయకేంద్రాలు, సూపర్మార్కెట్లు, రోడ్డు పక్కన ఆహర పదార్థాలను విక్రమయించే బండ్లు, పండ్ల విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 2017 నుంచి 2019 డిసెంబర్ వరకు 179 ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆహార పదార్థాల విషయంలో కల్తీ జరిగిందని ఫలితాలు వచ్చిన రిపోర్టుల ఆధారంగా 27 కేసులు నమోదు చేశారు. ఇందులో 17 కేసుల్లో నిర్వాహకులకు రూ. 3,55,000 జరిమానా విధించారని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా ఆహార భద్రతా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జిల్లాలో సక్రమంగా ఉండకపోవడంతోపాటు, ఎవ్వరో ఫిర్యాదు చేస్తే కానీ తనిఖీలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆహార భద్రతా అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, తరుచూ తనిఖీలు నిర్వహించేలా ఆదేశించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.. జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయించే వారు తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటల్, బేకరీ, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు తమ వ్యాపారాన్ని నిర్వహించాలి. గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. –రవీందర్రావు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిద్దిపేట -
ప్రేమజంట ఆత్మహత్య
కొండపాక (గజ్వేల్): పెళ్లి విషయంలో పెద్దలను ఎదిరించే ధైర్యం లేక ఓ ప్రేమజంట వారు చదువుకున్న పాఠశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మం డలంలోని లకుడారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లకుడారం గ్రామానికి చెందిన మంజ మల్లయ్య–నర్సవ్వల రెండో కుమారుడు కనకయ్య (21), రాచకొండ మడేలు–రేణుకల రెండో కుమార్తె తార (19)లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరు ప్రేమించుకుంటున్న విషయం రెండేళ్ల కిందట తెలియడంతో తార కుటుంబీకులు కనకయ్యపై దాడి చేసి పంచాయితీ పెట్టి అప్పట్లో రూ.30 వేల వరకు జరిమానా వేశారు. ఇద్దరూ కలుసుకోరాదని, మాట్లాడుకోరాదని మందలించారు. అయినప్పటికీ వారు ప్రేమాయ ణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దర్నీ కలవనీయరని భావించిన వారు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాలు వెతకడం మొదలు పెట్టారు. గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి సమీ పంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తర గతి గదిలో వీరు ముందుగా పురుగుల మందు తాగి తర్వాత ఉరేసుకున్నారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఉరేసుకున్న విషయాన్ని గమనించారు. దీంతో గ్రామంలో విషయం చెప్పడంతో మృతుల కుటుంబీకులు ఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
సిద్దిపేటలోకి వెళ్లేది లేదు
హుస్నాబాద్‌లో ఆందోళన తీవ్రతరం నల్లజెండాలతో విద్యార్థుల భారీ ప్రదర్శన టైర్లకు నిప్పు.. పోలీసుల లాఠీచార్జి ఎంపీ, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనానికి యత్నం హుస్నాబాద్: హుస్నాబాద్, కోహెడను సిద్దిపేటలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హుస్నాబాద్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు నల్ల జెండాలతో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అఖిలపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే సతీష్‌కుమార్, ఎంపీ వినోద్‌కుమార్ దిష్టి బొమ్మలను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫ్లెక్సీలు, సిద్దిపేట జిల్లా మ్యాప్‌ను దహనం చేశారు. అనంతరం టైర్లకు నిప్పు పెట్టేందుకు యత్నించారు. సిద్దిపేట బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు డిస్ట్రిక్ట్ గార్డ్స్ అత్యూత్సాహం ప్రదర్శించి ఆందోళన కారులపై లాఠీ ఝలిపించారు. ఆగ్రహించిన పలువురు ‘పోలీసు జులుం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. స్పందించిన సీఐ ప్రశాంత్‌రెడ్డి, ఎసై ్స ఎర్రల కిరణ్ డిస్ట్రిక్ గార్డ్స్ నుంచి లాఠీలు లాకున్నారు. పోలీసుల లాఠీచార్జీలో మాజీ ఎంపీపీ, విద్యార్థి సంఘాల నాయకులు స్వల్పంగా గాయపడ్డారు.