Siddharth Roy Movie
-
సిద్దార్థ్ రాయ్.. ఆ సీన్ వల్ల 15 రోజులు అనారోగ్యంతో..: హీరోయిన్
అతడు చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సిద్దార్థ్ రాయ్. వి.యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐరావతం ఫేమ్ తన్వి నేగి హీరోయిన్గా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్టాక్ లభిస్తోంది. అయితే కలెక్షన్లు మాత్రం బానే వస్తున్నాయని చెప్తున్నాడు హీరో దీపక్. తాజాగా హీరోయిన్ తన్వి నేగి ఈ సినిమా షూటింగ్లో ఎదురైన ఇబ్బందిని బయటపెట్టింది. సిద్దార్థ్ రాయ్ మూవీలో నీటి లోపల నటించాల్సిన సన్నివేశం ఒకటుంది. డిసెంబర్లో చిక్‌మంగళూరులో జలపాతంలో కిస్ సీన్ చిత్రీకరించారు. అప్పుడు 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందనుకుంటా! ఎంతో చలిలో ఆ సన్నివేశం షూట్ చేశారు. ఆ సీన్ తర్వాత నేను అనారోగ్యానికి లోనయ్యాను. 15 రోజులు సిక్ అయ్యాను. సినిమా చూసిన జనాలు ఆ ముద్దు సన్నివేశం బాగుందని చెప్తున్నారు. కానీ అక్కడలా యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు అని నవ్వేసింది తన్వి నేగి. చదవండి: ఆస్పత్రిలో డెలివరీకి ముందు డ్యాన్స్ చేసిన నటి.. తర్వాత... -
'అర్జున్ రెడ్డి' మాదిరే ఈ సినిమాను కూడా ఇబ్బంది పెట్టిన సంగీత దర్శకుడు
సంగీత దర్శకుడు రథన్‌పై నూతన దర్శకుడు వి. యశస్వి ఫైర్ అయ్యాడు. తాను తెరకెక్కించిన 'సిద్ధార్థ్ రాయ్' సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్‌పై యశస్వి పలు ఆరోపణలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి అయ్యాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల విడుదల విషయంలో చాలా ఆలస్యమైంది. దీనికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు రథన్ అని యశస్వి ఫైర్ అయ్యాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన రథన్.. అవుట్ పుట్ విషయంలో తనని బాగా ఇబ్బంది పెట్టాడని యశస్వి వాపోయాడు. అతను మంచి టెక్నీషియనే కావచ్చు కానీ అతని వల్ల సినిమా నలిగిపోతుంది. ఆయన గొడవ పడేందుకే మాట్లాడుతాడు. సినిమా గురించి ఏదైనా సమస్య వచ్చి అతనితో మాట్లాడితే చాలా ఎక్కువగా గొడవ పడుతాడు. రథన్ అనే వ్యక్తి ఒక సినిమాను పూర్తి వరకు తీసుకొచ్చి చివరి క్షణంలో వదిలేస్తాడు. రీరికార్డింగ్ విషయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడు.. అదే హైదరాబాద్‌లో ఉంటే చాలా గొడవలు జరిగేవి. అని చెప్పారు. గతంలో రథన్ తీరుపై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో కూడా రథన్ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సందీప్ రెడ్డి వంగా గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అతను టెక్నీషియన్ అంటూనే దర్శక,నిర్మాతలను బాగా ఇబ్బందులకు గురిచేస్తాడని ఆయన తెలిపారు. రథన్ ఇప్పటి వరకు తెలుగులో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, హుషారు, పాగల్, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 'సిద్ధార్థ్ రాయ్' చిత్రం ఫిబ్రవరి 23న విడుదలకు రెడీగా ఉంది. ట్రైలర్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుకు తెస్తుంది. అతడు సినిమాలో బాల నటుడిగా అలరించిన దీపక్ సరోజ్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. -
ఆ రెండు సినిమాలతో ‘సిద్ధార్థ్ రాయ్’ కి సంబంధమే లేదు: దీపక్ సరోజ్
‘‘సిద్ధార్థ్ రాయ్’లో నా లుక్ చూసి ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల్లా ఉంటుందేమో అనిపించవచ్చు.. కానీ, ‘సిద్ధార్థ్ రాయ్’ కథకీ, ఆ చిత్రకథలకీ ఏ విషయంలోనూ పోలిక లేదు’’ అన్నారు దీపక్ సరోజ్. బాలనటుడు దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన్వీ నేగి హీరోయిన్. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా దీపక్ సరోజ్ మాట్లాడుతూ– ‘‘బాల నటుడిగా ‘మిణుగురులు’లో నా పాత్రకి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి, ఫ్యామిలీ బిజినెస్‌లోకి వచ్చాను. యశస్విగారు చెప్పిన ‘సిద్ధార్థ్ రాయ్’ కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. నా ప్రతిభను చూపించే అవకాశం ఈ మూవీ రూపంలో దొరికింది. నా పాత్రను ఒక సవాల్‌గా తీసుకుని చేశాను. ప్రస్తుతం రెండు కొత్త చిత్రాలు ఒప్పుకున్నాను’’ అన్నారు. -
మా పవర్ స్టార్ ను డైరెక్షన్ చేశారు..!
-
Siddharth Roy: హీరోగా ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్.. ‘అర్జున్ రెడ్డి’ని మించేలా ఉందే!
టాలీవుడ్లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా మారుతున్నారు. పలు సినిమాల్లో బాల నటుడిగా అదరగొట్టిన తేజ సజ్జ.. హను-మాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అతడే దీపక్ సరోజ్. ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. ఒక సీన్ గురించి చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమా గుర్తింది కదా?. అందులో ఓ సన్నివేశంలో ఓ బుడ్డోడు బ్రహ్మానందం పొట్టపై పంచ్ ఇచ్చి.. ‘మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా..’అని అంటాడు. ఆ బుడ్డోడి పేరే దీపక్ సరోజ్. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్ దగ్గర పని చేసిన వి యశస్వి.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన్వి నేగి హీరోయిన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో క్యారెక్టర్ అయితే ‘అర్జున్ రెడ్డి’ మాదిరి ఉంది. ‘మై కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ డిఫెరెంట్.. దిస్ ఈజ్ సిద్ధార్ధ్ రాయ్.. మై ఏజ్ 21 , హైట్ 5.9, వెయిట్ 69 ..ఐ లాస్ట్ మై వర్జినిటీ అట్ ది ఏజ్ ఆఫ్ 17’ అనే బోల్డ్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో పుట్టుకతోనే మేధావి. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇందు(హీరోయిన్) వస్తుంది. ఆ తర్వాత అతని జీవితం మారిపోతుంది. జైలుకు కూడా వెళ్తాడు. బిచ్చగాళ్ల దగ్గర ఉన్న ఫుడ్‌ని కూడా దొంగిలించినట్లు ట్రైలర్లో చూపించారు. అసలు సిద్ధార్థ్ ఎందుకలా మారాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ చూస్తే మాత్రం ఇంటిమేట్ సీన్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సీన్స్ అయితే ‘అర్జున్ రెడ్డి’ని మించి పోయాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.