టాలీవుడ్‌లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా మారుతున్నారు. పలు సినిమాల్లో బాల నటుడిగా అదరగొట్టిన తేజ సజ్జ.. హను-మాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అతడే దీపక్ సరోజ్. ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. ఒక సీన్ గురించి చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమా గుర్తింది కదా?. అందులో ఓ సన్నివేశంలో ఓ బుడ్డోడు బ్రహ్మానందం పొట్టపై పంచ్ ఇచ్చి.. ‘మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా..’అని అంటాడు. ఆ బుడ్డోడి పేరే దీపక్ సరోజ్. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్ దగ్గర పని చేసిన వి యశస్వి.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన్వి నేగి హీరోయిన్.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో క్యారెక్టర్ అయితే ‘అర్జున్ రెడ్డి’ మాదిరి ఉంది. ‘మై కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ డిఫెరెంట్.. దిస్ ఈజ్ సిద్ధార్ధ్ రాయ్.. మై ఏజ్ 21 , హైట్ 5.9, వెయిట్ 69 ..ఐ లాస్ట్ మై వర్జినిటీ అట్ ది ఏజ్ ఆఫ్ 17’ అనే బోల్డ్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో పుట్టుకతోనే మేధావి. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇందు(హీరోయిన్) వస్తుంది. ఆ తర్వాత అతని జీవితం మారిపోతుంది. జైలుకు కూడా వెళ్తాడు. బిచ్చగాళ్ల దగ్గర ఉన్న ఫుడ్‌ని కూడా దొంగిలించినట్లు ట్రైలర్‌లో చూపించారు. అసలు సిద్ధార్థ్ ఎందుకలా మారాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ చూస్తే మాత్రం ఇంటిమేట్ సీన్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సీన్స్ అయితే ‘అర్జున్ రెడ్డి’ని మించి పోయాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment