అతడు చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సిద్దార్థ్ రాయ్. వి.యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐరావతం ఫేమ్ తన్వి నేగి హీరోయిన్‌గా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌టాక్ లభిస్తోంది. అయితే కలెక్షన్లు మాత్రం బానే వస్తున్నాయని చెప్తున్నాడు హీరో దీపక్.
తాజాగా హీరోయిన్ తన్వి నేగి ఈ సినిమా షూటింగ్‌లో ఎదురైన ఇబ్బందిని బయటపెట్టింది. సిద్దార్థ్ రాయ్ మూవీలో నీటి లోపల నటించాల్సిన సన్నివేశం ఒకటుంది. డిసెంబర్‌లో చిక్‌మంగళూరులో జలపాతంలో కిస్ సీన్ చిత్రీకరించారు. అప్పుడు 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందనుకుంటా! ఎంతో చలిలో ఆ సన్నివేశం షూట్ చేశారు. ఆ సీన్ తర్వాత నేను అనారోగ్యానికి లోనయ్యాను. 15 రోజులు సిక్ అయ్యాను. సినిమా చూసిన జనాలు ఆ ముద్దు సన్నివేశం బాగుందని చెప్తున్నారు. కానీ అక్కడలా యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు అని నవ్వేసింది తన్వి నేగి.
చదవండి: ఆస్పత్రిలో డెలివరీకి ముందు డ్యాన్స్ చేసిన నటి.. తర్వాత...
Comments
Please login to add a commentAdd a comment