siddhartha reddy
-
‘యువత, విద్యార్థులంతా వైఎస్ జగన్‌కు అండగా నిలబడాలి’
సాక్షి, కర్నూలు : రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి ప్రభుత్వాన్ని పారదోలి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యువత, విద్యార్థులంతా అండగా నిలబడాలని నందికొట్కూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయి ప్రత్యేక హోదాను విస్మరించారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని అందులో వైఎస్సార్సీపీదే బలమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ఫీరియింబర్స్‌మెంట్ పథకం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగకరమైందనీ, నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. చంద్రబాబు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విద్యార్థి లోకం జగన్ వెంటే ఉందన్నారు. -
ముస్లింలపై బాబుకు సవతి ప్రేమ
నందికొట్కూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముస్లింలపై సవతి ప్రేమ చూపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. నందికొట్కూరు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఐజయ్య విలేకరులతో మాట్లాడారు. ముస్లింలపై అక్రమ కేసులు బనాయించి వారిని భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న నంద్యాల ఉప ఎన్నికలలో మసీదులలో ఉన్న ఇమామ్‌లకు జీతాలు ఇస్తాను అని హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ముస్లింలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వారు భయపడరని, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ముస్లిం సోదరులను విడుదల చేసి కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నారా హమారా-టీడీపీ హమారా అనే కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని స్థానిక సీఐకి వినతిపత్రం సమర్పించారు. -
రాజకీయ సన్యాసి సర్వేలు చేయించటమా?
నిజామాబాద్ : రాజకీయంగా ఎదుర్కోలేకనే చతికిలపడి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు సర్వేలేందుకని వైఎస్సార్ సీపీ ఎల్లారెడ్డి ఇన్చార్జి పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి విమర్శించారు. లగడపాటి తన ఆస్తులను కాపాడుకునేందుకు తప్పుడు సర్వేలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, లగడపాటి టీడీపీ అధికారంలోకి వస్తుందని తప్పుడు సర్వేలతో దుష్ర్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. లగడపాటి తిక్క ఉన్న లెక్కలేని మనిషి అని విమర్శించారు. జగన్‌ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. సినిమాల్లో బొమ్మలాట ఆడే వ్యక్తి ప్రజల కోసం శ్రమించే వ్యక్తిని విమర్శించడమేంటని సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. ప్రజారాజ్యం పేరిట పార్టీ స్థాపించిన చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంగ్రెస్ కు అమ్ముడు పోయారని ఆరోపించారు. యువరాజ్యం స్థాపించిన పవన్ యువకులను చైతన్యం చేస్తానని టీడీపీ, బీజేపీలను చైతన్యం చేస్తున్నారన్నారు. ఆయనకు తిక్క, లెక్కలు లేవుగాని అధికార దాహం ఉందన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టిన పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతామన్న భయంతో పార్టీ పెట్టకుండా ఇతరులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు.