
సాక్షి, కర్నూలు : రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి ప్రభుత్వాన్ని పారదోలి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి యువత, విద్యార్థులంతా అండగా నిలబడాలని నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయి ప్రత్యేక హోదాను విస్మరించారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని అందులో వైఎస్సార్‌సీపీదే బలమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ఫీరియింబర్స్‌మెంట్ పథకం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగకరమైందనీ, నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. చంద్రబాబు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విద్యార్థి లోకం జగన్ వెంటే ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment