Siddhi Vinayak Temple
-
ముంబైలో సిద్ధి వినాయక ఆలయం రామ్ చరణ్ పూజలు..ఫోటోలు వైరల్
అయ్యప్ప స్వామికి రామ్ చరణ్ పెద్ద భక్తుడు. ప్రతి ఏడాది ఆయన అయ్యప్ప స్వామి మాలను స్వీకరించి దీక్ష తీసుకుంటాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న మాలను స్వీకరించడం మాత్రం మర్చిపోరు. ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్ష చేయటాన్ని విడిచి పెట్టలేదు. ఈ ఏడాది కూడా రామ్ చరణ్ దీక్షను తీసుకున్నాడు. తాజాగా ఈ దీక్షను ఆయన ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంత నిష్టగా ఉంటారో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఈ సమయంలో రామ చరణ్ కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అభిమానులను ఆకర్షించింది. ఒక వైపు వృతిపరమైన విషయాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను బ్యాలెన్స్ చేయటంలో రామ్ చరణ్ తన అంకిత భావాన్ని ప్రదర్శించారు. -
గణపతి బప్పా మోరియా..గానా షురూ హో గయా!
రెండు రోజుల్లో బొజ్జ గణపయ్య కుడుములు తినడానికి రెడీ అవుతున్నాడు. కడుపు నిండా పిండి వంటలు ఆరగించి, భక్తులు పాడే పాటలకు పరవశించనున్నాడు. ఈసారి స్పెషల్ ఏంటంటే.. అమితాబ్ బచ్చన్ పాడే హారతి పాటను వినాయకుడు వినబోతున్నాడు. అమితాబ్ ఏంటి? హారతి పాట ఏంటి? అనుకుంటున్నారా? ముంబైలో సిద్ధివినాయక టెంపుల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్. అక్కడ కొలువు దీరిన వినాయకుడి కోసం అమితాబ్ బచ్చన్ హారతి పాట పాడారు. గతంలో హనుమాన్ చాలీసా కూడా పాడారాయన. ఇప్పుడు పాడిన వినాయకుడి పాట గురించి అమితాబ్ మాట్లాడుతూ - ‘‘సిద్ధివినాయక టెంపుల్ అధికారులు ఎప్పట్నుంచో నన్ను హారతి పాట పాడమని అడుగుతున్నారు. ఈ పాట పాడటం నాకు ఆనందంగా ఉంది. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ పాట వేస్తారా? లేక మిగతా సమయాల్లోనా? అని నేనడగలేదు. ఈ పాటకు సంబంధించిన కొంత భాగాన్ని గుడిలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ పాట వీడియో రూపంలో కూడా రానుంది. పాటను రికార్డ్ చేసేశారు కాబట్టి, ఇక చిత్రీకరించడమే ఆలస్యం. దర్శకుడు సూజిత్ సర్కార్ ఈ పాటను షూట్ చేయనున్నారు. రోహన్-వినాయక్ స్వరపరచిన ఈ పాట సీడీ రూపంలో మార్కెట్లోకి రానుంది. అలాగే ఇంటర్నెట్లో కూడా పాట లభ్యమవుతుంది. అమితాబ్ పాడిన ఈ హారతి పాట హాట్ కేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
సిద్ధి వినాయకునికి ‘ఉగ్ర’ ముప్పు
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఒక బృందం ముంబైలో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదివరకే సిద్ధివినాయక మందిరం ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉంది. తాజా హెచ్చరికల మేరకు మరింత ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్ధివినాయక మందిరంతోపాటు నక్షత్రాల హోటళ్లలో బసచేసిన విదేశీ పర్యాటకులకు మరింత భద్రత కల్పించారు. నగరంలో అక్కడక్కడ నాకాబందీలు ప్రారంభించారు. గతంలో జరిగిన 26/11 సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరానికి వచ్చే అన్ని రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను క్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారు.