sight
-
రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్ క్రూయిజ్ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్ని నిర్వహస్తున్న ఎక్సోటివ్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ రాజ్సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది. పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ చిరాంద్ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్లోని పాట్నా, జార్ఖండ్లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్ క్రూయిజ్కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
రాజస్థాన్ అడవుల్లో పులిపిల్లలు..
న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో పర్యాటకులకు పులిపిల్లలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణ ప్రేమికులకు, అధికారులకు ప్రత్యేక వార్తగా మారింది. ఇండియాలో క్రమంగా పులుల సంఖ్య పెరగడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్ళిన కొందరు పర్యాటకులకు రెండు పులి పిల్లలు కనిపించాయి. దీంతో వన్యప్రాణ ప్రేమికులు సహా అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ శుభ పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇండియాలోని రాజస్థాన్ రణతంబోర్ రిజర్వ్ అడవుల్లో పులి కూనలు కనిపించడంతో అధికారులు సంబరాలు జరిపారు. పార్కులోని జోన్ 5 కు చెందిన కచిడా ఏరియాలోని ధకడా ప్రాంతంలో టూరిస్టులు ఈ పులి పిల్లలను కనుగొన్నారు. ఈ పిల్లలకు సుమారు రెండు మూడు నెలల వయసు ఉంటుందని, వీటి తల్లి రిజర్వ్ లో నివసిస్తున్న టి-73 అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక ఆ పెద్దపులి మరిన్ని పిల్లలను కూడ కని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జోన్ లో అత్యంత ఎక్కువమంది సందర్శించిన పులిగా పేరుతెచ్చుకున్న... అకాసుందరి పేరుగల టి-17 కు పుట్టిన ఆడపులే టి-73 అని, ఇప్పుడు ఈ టి-73 కూడ ముద్దులొలికే పులి కూనలను కనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు తాను ఉండేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని, ఇక్కడే నివసిస్తున్న మొదటి ఆడపులి ఈ టి-73 అని, చాలా కాలం తర్వాత ఇక్కడే ఈ పులి పిల్లలను పెట్టడం వన్యప్రాణ ప్రేమికులకు నిజంగానే శుభవార్త అని అధికారులు అంటున్నారు. ఈ అభయారణ్యంలో మరిన్ని ఆడ పులులు పిల్లలు పెట్టి ఉండొచ్చని వాటిని కూడ గుర్తిస్తామని తెలిపారు. -
28 ఏళ్ల తరువాత కంటిచూపు వచ్చింది
ఎన్నో దక్షిణాది సినిమాలకు సంగీతాన్నందించిన శంకర్ గణేశ్ ద్వయంలో ఒకరైన గణేశ్ జీవితంలో అద్భుతం జరిగింది. 28 ఏళ్ల క్రితం ఒక పేలుడులో ఆయన తన చూపును కోల్పోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఆయనకు చూపు తిరిగి వచ్చింది. ఇప్పుడాయన అన్నిటినీ చూడగలుగుతున్నారు. ఈ అద్భుతం వెనుక ఒక అత్యాధునిక సర్జరీ పద్ధతి ఉంది. 1986 లో గణేశ్ కు ఒక ఉత్తరం వచ్చింది. అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఆ ఉత్తరాన్ని తెరవగానే అవి పేలడంతో ఆయన కంటి చూపు పోయింది. అప్పటి నుంచీ ఆయన సంగీత ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. అనేక రకాల చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు 28 ఏళ్ల తరువాత అత్యాధునిక గ్లూడ్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనే కొత్త టెక్నిక్ వల్ల ఆయనకు పోయిన చూపు తిరిగి వచ్చింది. ఈ టెక్నిక్ ను బాంబు పేలుళ్లు, టపాకాయల పేలుళ్లలో చూపును కోల్పోయినవారికి చూపునిచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు గణేశ్ అన్నీ చూడగలుగుతున్నారు.