28 ఏళ్ల తరువాత కంటిచూపు వచ్చింది
28 ఏళ్ల తరువాత కంటిచూపు వచ్చింది
Published Sat, May 31 2014 5:28 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
ఎన్నో దక్షిణాది సినిమాలకు సంగీతాన్నందించిన శంకర్ గణేశ్ ద్వయంలో ఒకరైన గణేశ్ జీవితంలో అద్భుతం జరిగింది. 28 ఏళ్ల క్రితం ఒక పేలుడులో ఆయన తన చూపును కోల్పోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఆయనకు చూపు తిరిగి వచ్చింది. ఇప్పుడాయన అన్నిటినీ చూడగలుగుతున్నారు. ఈ అద్భుతం వెనుక ఒక అత్యాధునిక సర్జరీ పద్ధతి ఉంది.
1986 లో గణేశ్ కు ఒక ఉత్తరం వచ్చింది. అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఆ ఉత్తరాన్ని తెరవగానే అవి పేలడంతో ఆయన కంటి చూపు పోయింది. అప్పటి నుంచీ ఆయన సంగీత ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. అనేక రకాల చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది.
ఇప్పుడు 28 ఏళ్ల తరువాత అత్యాధునిక గ్లూడ్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనే కొత్త టెక్నిక్ వల్ల ఆయనకు పోయిన చూపు తిరిగి వచ్చింది. ఈ టెక్నిక్ ను బాంబు పేలుళ్లు, టపాకాయల పేలుళ్లలో చూపును కోల్పోయినవారికి చూపునిచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు గణేశ్ అన్నీ చూడగలుగుతున్నారు.
Advertisement