Silent revolution
-
'ఆ మార్పు నిశ్శబ్ద విప్లవం'
దీ, న్యూఢిల్లీ: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తాను చాలా నేర్చుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధాని రేడియో కార్యక్రమం మన కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో దేశ ప్రజలు ఖాదీ వస్త్రాలు ధరించడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారు. పర్యాటకరంగంలో భారత్కు చాలా అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. ధనికులు గ్యాస్ రాయితీ వదులుకుని పేదలకు చేయూత నివ్వాలని, ఇప్పటికే 30 లక్షల మంది తమ గ్యాస్ సబ్సిడీలను వదులుకున్నారని ఇదొక నిశబ్ద విప్లవం అని ప్రధాని అన్నారు. సెల్ఫీ విత్ డాటర్ కార్యక్రమం విజయవంతమైందని చెప్పిన ఆయన ప్రజల సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బీహార్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఈసీ తోసిపుచ్చడంపట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎన్నికల కమిషన్ ఒక నియామక సంస్థగానే పనిచేసిదిగా ఉండేదని, ఇప్పుడు నిజమైన దోహదకారిగా పనిచేస్తుందని, ఈ సందర్భంగా ఈసీకి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. దేశంలోని ప్రతి యువకుడు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకొని సమయం వచ్చినప్పుడు దానిని వినయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మీ సేవ ద్వారా నిశ్శబ్ద విప్లవం: సీఎం కిరణ్
-
మీ సేవ ద్వారా నిశ్శబ్ద విప్లవం: సీఎం కిరణ్
సికింద్రాబాద్: త్వరలో మూడవ దశ రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో ఆయన ప్రసంగిచారు. విజయం కోసం చేసే యుద్ధం కన్నా విలువల కోసం పోరాటం గొప్పదని తాము నమ్ముతామన్నారు. మీసేవ నిశ్శబ్ద విప్లవం సాధించినట్లు తెలిపారు. పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. 18 ఏళ్ల విరామం తరువాత మన రాష్ట్రంలో 20 సూత్రాల పథకం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత తమదేనన్నారు. అన్ని పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. పుట్టిన ప్రతి ఆడ పిల్ల రక్షణ కోసం బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నిజాయితీ పారదర్శకత ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోథుల పెన్షన్ 4 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. అభయ హస్తం పథకం మరో 9 లక్షల మందికి వర్తింపజేసినట్లు చెప్పారు.